00:00
- 1. పాక్స్ ఇన్స్పెక్షన్ లో భాగంగా తనిఖీ చేయవలసిన డాక్యుమెంట్స్ గురించి ఇపుడు తెలుసుకుందాం. ఫిజికల్ క్యాష్ ని క్యాష్ బుక్ లెడ్జర్ తో వెరిఫై చేయాలి. సొసైటీలో జరిగే క్రెడిట్ మరియు నాన్ క్రెడిట్ యాక్టివిటీస్ కి సంబంధించిన వోచర్స్ ను బిల్ బుక్ మరియు స్క్రోల్స్ తో వెరిఫై చేయాలి.
- 2. సొసైటీలో జరిగిన లోన్ డిస్ బర్స్ మెంట్ మరియు కలెక్షన్స్ డిసిసిబి బుక్స్ లో నమోదు చేసారో లేదో వెరిఫై చేయాలి.సొసైటీలో మెయిన్ టైన్ చేసే మెంబర్ లెవల్ లోన్ లెడ్జర్, డిస్ బర్స్ మెంట్ మరియు రికవరీస్ అప్ డేట్ గా నమోదు అవుతున్నాయో లేదో చెక్ చేయాలి.
- 3. సొసైటీలో మెయిన్ టైన్ చేస్తున్న డిసిబి ప్రకారం అసలు మరియు వడ్డీ కలెక్షన్స్ ను డిసిసిబికి రెమిట్ చేసిన లావాదేవీలను డిసిసిబిలలో మెయిన్ టైన్ చేస్తున్న రికార్డ్స్ తో సరిచూసుకోవాలి. అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ సరి అయిన విధంగా ప్రొవిజన్ చేసారో లేదో వెరిఫై చెయ్యాలి. డ్యూ టూ, డ్యూ బై రిజిష్టర్స్ ను వెరిఫై చేయాలి. డ్యూ టూ, డ్యూ బై క్లియర్ చెయ్యడానికి తీసుకున్న చర్యలను సమీక్షించాలి.
- 4. సొసైటీలో ఖర్చు పెడుతున్న ఎస్టాబ్లిష్ మెంట్ ఎఏక్సపెన్ డిచర్ ను మరియు అదర్ ఏక్సపెన్ డిచర్ పరిమితులకు లోబడి ఉన్నాయో లేదో మరియు స్టాఫింగ్ ప్యాటర్న్ ఎపిసియస్ యాక్ట్ 1964 సెక్షన్ 11బి - (సి) 1 ప్రకారం ఉన్నాయో లేదో వెరిఫై చేయాలి. సొసైటీలో డ్రా చేస్తున్న అడ్వాన్స్ లు ఐటమ్ వైజ్ గా వెరిఫై చేయాలి. అలాగే వాటిపై కామెంట్స్ ను తయారు చేయాలి.
- 5. సొసైటీలో క్రాప్ ఇన్యూరెన్స్ ప్రీమియమ్ మరియు క్లెయిమ్స్ ను వెరిఫై చేయాలి. లోనుకు తగిన రేషియోలో షేర్ క్యాపిటల్ ని కలెక్ట్ చేసారో లేదో వెరిఫై చేయాలి. అలాగే బారోయింగ్స్ లెడ్జర్ వివరాలు డిసిసిబిలెడ్జ ర్ తో సరితూగుతుందో లేదో వెరిఫై చేయాలి.
- 6. ఒకవేళ సొసైటీలో కౌంటర్ బిజినెస్ అంటే మెంబర్ ల నుండి డిపాజిట్ సేకరణ మరియు మెంబర్ లకు లోన్స్ వ్యాపారాలు చేస్తున్నట్లయితే వాటి లావాదేవీల్ని సమగ్రంగా పరిశీలించాలి. రాండమ్ గా డిపాజిట్లపై, లోన్లపై ఇంట్రస్ట్ కాలుక్యులేషన్ తనిఖీ చేయాలి. డిపాజిట్ రిసీట్స్ లెడ్జర్స్ లో నమోదును వెరిఫై చేయాలి. అన్ని లోన్ డాక్యు మెంట్స్ ని క్షుణ్ణంగా పరిశీలించాలి.
- 7. ఎస్ టి, ఎల్ టి లోన్ డిస్ బర్స్ మెంట్ మరియు లావాదేవీలన్నింటిని సమగ్రంగా పరిశీలించాలి. సొసైటీ నిర్వహిస్తున్న వ్యాపారంపై ఇన్ స్పెక్టింగ్ ఆఫీసర్ కామెంట్స్ రాయాలి. సొసైటీలో బారోయింగ్ మెంబర్స్ దగ్గర్నుంచి కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ ను డిసిసిబి కి సబ్ మిట్ చేసారో లేదో వెరిఫై చేయాలి.మరియు సొసైటీలో మెయిన్ టైన్ చేస్తున్న డివి ఫైల్స్ మరియు చార్జ్ డిక్లరేషన్ బాండ్స్ రిజిష్టర్ ని వెరిఫై చేయాలి.
- 8. చార్జ్ డిక్లరేషన్స్ అన్నియు ఫోర్స్ లో ఉన్నాయో లేదో వెరిఫై చేయాలి. సొసైటీలో ఎస్ ఎ ఓ లైవ్ లో ఉన్న లోన్ అకౌంట్స్ కి సంబంధించిన చార్జ్ డిక్లరేషన్ బాండ్స్, డివి ఫైల్స్ అన్నిటినీ వెరిఫై చేయాలి.సొసైటీలో కొత్త మెంబర్ ల విషయంలో మంజూరు చేసిన ఋణములకు సంబంధించిన డాక్యుమెంట్స్ను క్యాటగిరీ వైజ్, పర్పస్ వైజ్ వెరిఫై చేయాలి.
- షార్ట్ టర్మ్ లోన్స్ కి ప్యాక్స్ ఇన్స్పెక్షన్ :9. అడ్మిషన్ రిజిష్టర్ లో మెంబర్షిప్ నమోదును సరిచూసుకోవాలి. అలాగే డిసిసిబి ద్వారా సాంక్షన్ అయిన క్రెడిట్ లిమిట్ ను వెరిఫై చేయాలి. కొత్త మెంబర్ ల నుంచి కలెక్ట్ చేసిన అడ్మిషన్ ఫీ మరియు షేర్ క్యాపిటల్ ని షేర్ క్యాపిటల్ రిజిష్టర్ మరియు క్యాష్ బుక్ తో వెరిఫై చేయాలి. ల్యాండ్ హెూల్డింగ్ టైటిల్ డీడ్స్ మరియు వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీలను లోన్ డాక్యుమెంట్స్[...]
- 10. డాక్యుమెంటేషన్ కి ముందు 13 సంవత్సరముల ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ ని పొందుపరచారో లేదో చూడాలి. ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ లో పొందుపరిచిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాగే సొసైటీ హక్కును ధృవీకరిస్తూ రెండవ ఈసీ ని జత పరచారో లేదో వెరిఫై చేయాలి.
- 11.సబ్ రిజిష్టర్ ఆఫీస్ లో డిక్లరేషన్ చార్జ్ క్రియేట్ అయినట్లుగా కన్ ఫర్మ్ చేసుకోవాలి.డిమాండ్ ప్రామిసరీ నోట్ ను లోన్ అమౌంట్ కి తీసుకున్నారో లేదో వెరిఫై చేయాలి.అన్ని డాక్యుమెంట్ లలో కరెక్షన్స్ లేకుండా చూడాలి. ఒకవేళ కరెక్షన్స్ ఉన్నట్లయితే అందరి సంతకాలు ఉన్నాయో లేదో చూడాలి.
- లాంగ్ టర్మ్ లోన్స్ కి ప్యాక్స్ ఇన్స్పెక్షన్:1. బారోయర్ మెంబర్షిప్ ను రిజిష్టర్ లో నమోదు చేసారో లేదో వెరిఫై చేయాలి. షేర్ క్యాపిటల్, అడ్మిషన్ ఫీజు మరియు ఇవాల్యుయేషన్ ఫీజు వసూలు ను షేర్ క్యాపిటల్ రిజిస్టర్ మరియు క్యాష్ బుక్ తో వెరిఫై చేయా లి.ప్యాక్స్ డిస్ బర్స్ చేసిన లోన్ డిసిసిబి కమ్యూనికేట్ చేసిన స్కీమ్ ప్రకారం ఉన్నదో లేదో వెరిఫై చేయాలి
- 2. లీగల్ స్క్రూటినీ మరియు లీగల్ అడ్వైసర్ యొక్క రికమండేషన్స్ ఫాలో అయ్యారో లేదో వెరిఫై చేయాలి. సబ్ రిజిష్ట్రార్ నుండి పొందిన టైటిల్ మరియు బాండ్ ఎగ్జిక్యూషన్ అక్నాలెడ్జ్ మెంట్ ను డాక్యుమెంట్స్లో జతపరిచారో లేదో వెరిఫై చేయాలి. అలాగే హామీకి ఉంచిన భూమికి సంబంధించిన హక్కు పత్రాలు (టైటిల్ డీడ్స్) పట్టా పాస్ పుస్తకాలు, అడంగల్ లేదా ఫహాని 13 సంవత్సరాలకు ముందు మరియు ప్రస్తుత కాలమునకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేయాలి.3. తనఖా[...]
- 4. ఒకవేళ ఏవైనా వ్యవసాయ అనుబంధ పరికరాలు కొనినట్లైతే ఎస్టిమేషన్ లేదా కొటేషన్ తగిన విధంగా ఉన్నదో లేదో వెరిఫై చేయాలి. లోను సద్వినియోగ ధృవీకరణ పత్రం మరియు ఇన్యూరెన్స్ సర్టిఫికేట్ను వెరిఫై చేయాలి. ఫామ్ మెకనైజేషన్ వస్తువుల విషయంలో సొసైటీ పేరు మీద హైపోలికేషన్ నమోదు అయినట్లు ధృవీకరించుకోవాలి. మొత్తం లోను డిస్ బర్స్ మెంట్ షెడ్యూల్ ప్రకారం అయినదో లేదో వెరిఫై చేయాలి. కంటెంట్‌ని వినడానికి ప్లే బటన్‌పై క్లిక్ చేయండి: Your browser[...]
- 5. మెంబర్ వైజ్, పర్పస్ వైజ్ మరియు పీరియడ్ వైజ్ ఓవర్ డ్యూ లిస్ట్ ని వెరిఫై చేయాలి. అన్ని ఓవర్ డ్యూ కేసుల యొక్క లీగల్ యాక్షన్ కవరేజ్ ని పరిశీలించాలి. అదేవిధంగా ఒకే ఫ్యామిలీకి మరియుఒకే విలేజ్ కి సంబంధించిన పెద్ద మొత్తములో ఓవర్ డ్యూస్ ఉన్నాయోమో వెరిఫై చేయాలి. మరియు పెద్దమొత్తములో ఒకే రోజు సొసైటీ డిస్ బర్స్ మెంట్ చేసిన లోన్ పర్టికులర్స్ ని వెరిఫై చేయాలి.
- 6. బోర్డ్ రిజల్యూషన్స్ అన్నింటినీ వెరిఫై చేయాలి. లోన్స్ సాంక్షన్ మరియు రిలీజ్ విషయంలో, బిల్ పేమెంట్, స్టాఫ్ సాలరీస్ విషయంలో అధికారం ఎవరికి ఉన్నదో పరిశీలించాలి. గత రెండు మూడు సంవత్సరాల ఏక్సపెన్ డిచర్ ని వెరిఫై చేసి ఏవైనా అబ్ నార్మల్ గా పెరిగినట్లయితే కారణాలను సమీక్షించాలి.
- 7. ఛార్జ్ డిక్లరేషన్ మరియు డాక్యుమెంట్స్ని డిసిసిబి బ్రాంచ్క సబ్ మిట్ చేసారా లేకా సొసైటీ లోనే ఉన్నాయా అని వెరిఫై చేయాలి. అక్నాలెడ్జ్్మంట్స్ని వెరిఫై చేసి డిక్లరేషన్స్ అన్నియూ టైమ్ బార్ కాకుండాఉన్నాయో లేదో వెరిఫై చేయాలి.అలాగే అన్ని డివి ఫైల్స్ను డిసిసిబి కి హ్యాండ్ ఓవర్ చేసారో లేదా వెరిఫై చేసి కామెంట్స్ రాయాలి.
- 8. రాండమ్ గా కొన్ని లోన్ అకౌంట్స్ కు ఇంట్రస్ట్ కాల్క్యులేషన్ వెరిఫై చేయాలి మరియు కొన్ని క్లోజ్ అయిన వాటిని కూడా వెరిఫై చేసి, వాటికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ని బారోయర్ కు సరైన విధంగా రిటర్న్ చేసారా లేదా దానికి సంబంధించిన నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అని వెరిఫై చేయాలి.
- 9. సొసైటీ యొక్క ఫిక్స్ డ్ అసెట్స్ మరియు కౌంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను క్షుణ్ణంగా వెరిఫై చేయాలి మరియు వాటి వినియోగం పై కామెంట్స్ రాయాలి. సొసైటీ అకౌంట్స్కు సంబంధించిన అన్ని బుక్స్ ని సొసైటీ మెయిన్ టైన్ చేస్తుందా లేదా అని వెరిఫై చేయాలి.
- 10. కొత్త మెంబర్ లకు ఇచ్చిన లోన్లను వెరిఫై చేయాలి. అలానే ఎస్ ఎ ఓ లోన్ను ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఎన్ హ్యాంన్సు చేస్తూ ఇచ్చిన లోన్స్ ను కూడా వెరిఫై చేయాలి డిసిసిబితో ఉన్న ఇంబ్యాలెన్సెస్ మరియు రికన్సిలేషన్ పొజిషన్ ని వెరిఫై చేయాలి.
- 11. సొసైటీ ఐసిడిపి, ఆర్ఎస్ పి, ఆర్ వి వి క్లబ్స్ మొదలగు స్కీమ్ లను ఉపయోగించుకున్నట్లయితే వాటి ప్రతిఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలించి సమీక్షను రాయాలి. ఇంకను ఏవైనా సొసైటీ యొక్క ఆర్థిక పరిస్థితి పై యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలపై లోనింగ్ ప్రోగ్రామ్స్ పై వర్కింగ్ క్యాపిటల్ను, ప్రస్తుతం సొసైటీ చేస్తున్న వ్యాపారాలను పరిశీలించి కామెంట్స్ ని రాయాలి.
- 12. 30 జూన్ కు ఉన్న ఓవర్ డ్యూస్ మొత్తము సొసైటీలో ఉన్న రికార్డ్స కు మరియు డిసిబి (డిమాండ్ & కలెక్షన్ బ్యాలెన్స్ ) స్టేట్ మెంట్స్ కు ఆడిటెడ్ ఫిగర్స కు సరితూగుతుందో లేదో వెరిఫై చేయాలి. మరియు రికవరీస్ ని కూడా వెరిఫై చేయాలి. ఏదైనా సొసైటీ తన మెంబర్స్ నుండి గాని పబ్లిక్ నుండి గాని డిపాజిట్స్ కలెక్ట్ చేస్తున్నట్లయితే ఆ ఫండ్స్ ని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నది మరియు డిసిసిబి[...]