00:00
- సొసైటీ యొక్క ఎనిఏలో చిక్కుకుపోయిన అమౌంట్స్ను మెంబర్స్కు లోన్స్ ఇవ్వడానికి ఉపయోగపడదు. అలా ఉన్న మొత్తాలకు ప్యాక్స్లు ప్రొవిజన్లు చేయాలి. లేదా వాటిని రద్దు అయినా చేయవలసి వస్తుంది కాబట్టి దాని యొక్క భారం సొసైటీ యొక్క లాభాలపైన పడకుండా ముందుగానే లోన్స్ రికవరీకి తగు చర్యలు తీసుకోవాలి. ఎస్పిఎలు ఎక్కువగా ఉండడమే ప్రస్తుతం సొసైటీలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య.
- సొసైటీలో ఎన్పీఎ పెరుగుదలకు ముఖ్య కారణం తక్కువ స్థాయిలో రుణ వసూళ్ళు, సకాలంలో వసూలుకు తగిన చర్యలు తీసుకోకపోవటం మరియు నిర్వహణ లోపాలు. ఈ కారణాలు అంతర్గత మరియు బహిర్గత అంశాలతో ముడిపడి ఉన్నాయి. సంఘ వసూళ్ల నిర్వహణలో అభివృద్ధిని సాధించేందుకు సకాలంలో బకాయిదారులతోనూ, జామీనుదారులతోనూ క్లెయిమ్లపై రాజీని కుదుర్చుకోవడం, ఆస్తుల అమ్మకాలు, ఆఖరి ప్రయత్నంగా చట్టపరమైన చర్యలను ఉపయోగించి బకాయిలను రాబట్టుటకు తగు చర్యలు సకాలంలో తీసుకోవాలి.
- బకాయిదారు తీసుకున్న రుణము దుర్వినియోగపరచటం నిధుల మళ్లింపు సాంకేతిక మరియు నిధుల నిర్వహణ నైపుణ్యం లేకపోవడం ఆస్తుల నిర్వహణ సరిగా చేయకపోవడం వ్యక్తిగత ప్రమాదం, మరణం మొదలగునవి సంభవించడం నివాస లేక వ్యాపార స్థానాలను మరో ప్రాంతానికి మార్చటం మొండిగా ఉపేక్షించడం లేక ఉద్దేశ్య పూర్వకముగగా బకాయిలను చెల్లించకపోవడం
- బారోవర్ యొక్క కార్యకలాపాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. సరిపోయినంత మదింపు లేకపోవడం ఋణ మంజూరులో జాప్యం జరగడం తక్కువ లేక ఎక్కువ లోన్ మంజూరు వాయిదాల చెల్లింపు కాలం సరిగా నిర్ణయించకపోవడం లోన్ బట్వాడా తరువాత సరియైన ఫాలోఅప్ లేకపోవడం బారోవర్తో రెగ్యులర్ కాంటాక్ట్ లేకపోడం వసూళ్ల కొరకు సకాలంలో ప్రయత్నాలు చేయకపోవడం అంతర్గత నియంత్రణా పద్ధతులు సమర్థవంతంగా లేకపోవడం సిబ్బందికి నిబద్ధత తక్కువగా ఉండడం గడువు తేదీలు మరియు చెల్లించాల్సిన మొత్తాలు మొదలగు వాటిపై బాకీదారునికి[...]
- ఎన్ఏఎ ను నివారించాలంటే సొసైటీకి నిర్దిష్టమైనటువంటి పరపతి విధానము, అనగా క్రెడిట్ పాలసీ మరియు ప్రొసీజర్ ఉండి తీరాలి. లక్ష్యానికి సంబంధించిన కార్యకలాపాలు, నష్టపూచీని అనుమతించే ప్రమాణాలు, పరపతి అంగీకారం అధికారము పరపతి ఆవిర్భావం మరియు నిర్వహణ పద్ధతులు మొదలగు వాటికి సంబంధించి లిఖిత పూర్వకంగా నిర్థిష్ట పరపతి విధానాలు సొసైటీ కలిగి ఉండాలి.అలాగే సొసైటీ 6 నెలలుకొకసారి ఎస్పిఎ నే బారోవర్ వైజ్ రివ్యూ చేయుట, అప్పు కట్టవలసినదిగా లెటర్స్ పంపటం, నియమితకాలంలో బాకీదారులను సందర్శించుట,[...]
- లోన్ మంజూరు చేయడానికి ముందే బారోవర్ చేపట్టాలనుకుంటున్న పథకానికి సంబంధించి తగినంత పరిజ్ఞానం ఉన్నదీ లేనిదీ సంఘం నిర్ణయించాఇల. అతడు ఆ పనిని లాభదాయకంగా నిర్వహించడానికి, అమలు చేయడానికి అవసరమైన నైపుణ్యం కలిగి ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా గాని, లోకల్ ఎంక్వైరీ ద్వారా గానీ బారోవరెక్క నిజాయితీని, చరిత్రను తెలుసుకోవాలి. బ్యాంక్ ద్వారా నల్ల ధనాన్ని మార్చుకొనే దురుద్దేశ్యం రుణ గ్రహీతకు ఉందేమో క్షుణ్ణంగా పరిశీలించాలి. సూక్ష్మంగా చెప్పాలంటే రుణ మంజూరుకు[...]
- ఎస్పిఎ ను తగ్గించడంలో అప్పు వసూళ్ళ లక్ష్య సాధనకు అనుమతించబడిన ఋణమాఫీ ప్రమాణాల నిర్ణయ స్థాయి, నియంత్రణ కొరకు పై అధికారులకు తెలియజేయుట, వసూళ్లు రద్దు చేయుట లేక మాఫీ పరిస్థితులు మొదలగు వాటి విషయములోను నిర్దేశించబడిన షరతులను వసూలు విధానములో ప్రతి సొసైటీ కలిగి ఉండవలెను. అప్పులలో కొంత భాగము రద్దు చేయవలసి వచ్చినపుడు మరియు వన్ఎమ్ సెటిల్మెంట్ విషయములో తగిన జాగ్రత్తలు పాటిస్తూ అటువంటి చర్యలు పాలకవర్గంచే ఆమోదము పొందబడవలెను. అవసరమైనప్పుడు ప్రత్యేక వసూలు[...]
- సాధారణంగా బారోవర్ యొక్క పని విధానము, ఆర్థిక స్థోమత, అవగాహన, నిధుల వినియోగం మరియు ద్రవ్య సరఫరా సరియైన పద్ధతిలో పరిశీలించక పోవడం వలన పరపతి ప్రభావం దెబ్బతింటుంది. వివిధ రకాలైన ఋణాల మంజూరు విషయంలో సొసైటీలు సముచితమైన ప్రమాణాలతో కూడిన షరతులు మరియు చర్యలను అవలంబించుట వలన పరపతి ప్రభావ నైపుణ్యతను పెంచుకొనవచ్చును. స్కీము ప్రకారం లోన్ ఎంత కావలెనో అంతనే ఇవ్వవలెను.
- ప్రతి లోన్ అకౌంట్ను, ప్రత్యేకించి సక్రమంగా లేని అప్పు ఖాతాలను పర్యవేక్షించుటకు సమగ్ర పరిశీలన అవసరము. ఋణగ్రహీత తన యొక్క అప్పు ఖాతాలో జమచేసే అసలు మరియు వడ్డీని జాగ్రత్తగా గమనించి పర్యవేక్షించవలెను. కాలానుగుణంగా, తగినంత సెక్యూరిటీ వున్నదా మరియు దానికి త్వరితగతిన వసూలు చేయగలమా అనే విషయాలను సమీక్షించాలి. ఏ సందర్భములోనైననూ బారోవర్ తన యొక్క అప్పు ఖాతాను సరిగా అమలు పరచని ఎడల సదరు విషయములు తక్షణమే పరిగణలోనికి తీసుకొని సదరు ఖాతాను ఎన్పీఎ[...]
- ఎస్పిఎ ను పర్యవేక్షించుటకు మరియు వసూళ్ళకు సంబంధించి సరియైన ప్లానింగ్ సొసైటీకి : అవసరం. ఇవి అన్నియూ సొసైటీ యొక్క అప్పుల వసూళ్ళ విధానంలో ఒక భాగంగా ఉండాలి. ఎస్పిఎ ను తగ్గించాలంటే ఎన్ఎఎ ఖాతాలను ఒక్కో ఖాతా వారీగా పర్యవేక్షించాలి. స్పెషల్ రికవరీ డ్రైవ్ ప్రోగ్రామ్ని చేపట్టాలి. కాంప్రమైజ్ పద్దతిన లోన్స్ రీషెడ్యూల్ కానీ రద్దు చేయుట కానీ చేయాలి. ఎన్పీఎ ఖాతాల చెల్లింపుదారులకు ప్రోత్సాహకాలు అందించవచ్చును. ప్రభుత్వ యంత్రాంగంతో సత్సంబంధములు కలిగి ఉండడం ప్రజావ[...]
- ఏదైనా సొసైటీకి క్రెడిట్ రిస్కుల నివారణకు జాగ్రత్తలు తీసుకొనుచున్ననూ, వాటి నుంచి తప్పించుకొనుటకు నష్టనివారణ చర్యలు తీసుకొనవలెను. ప్రతీ సొసైటీ, నష్ట నివారణ కొరకు తగు పర్యవేక్షణ చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా రుణాలను క్రమబద్దీకరించుట మరియు సముచితమున వసూళ్ల పద్ధతిని నిర్ణయించుట సివిల్ సూట్లు అమలు చేయుట ప్రస్తుతము ఉన్న ఎస్పిఎ ను తగ్గించుట మరియు ఆస్తుల నాణ్యతను పెంచడం ద్వారా క్రెడిట్ రిస్క్లు అధిగమించవచ్చు.
- అప్పు తిరిగి చెల్లించుట అనేది బకాయిదారుని యొక్క ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. బకాయిదారులకు సరియైన ఆదాయం లేనపుడు రుణం వసూలు చేయడం కష్టం. రీపేమెంటు షెడ్యూలు సరిగా లేనపుడు, బకాయిదారుని ఆదాయం రీపేమెంటునకు సరిపడునపుడు, బకాయిదారుని ఆమోదముతో ఋణ కాలపరిమితిని రీఫేజుమెంట్ చేయవచ్చును. సదరు అప్పు గడిచిన రెండేళ్ళు సకాలములో చెల్లించబడి ఉండవలెను. లోన్ రీస్ట్రక్చరింగ్ చేయాలంటే, బకాయిదారుని అప్పు చెల్లించు పద్ధతి గతంలో బాగుగా ఉండి ప్రస్తుతము అనుకోని సంఘటన వలన చెల్లించలేని పరిస్థితి ఏర్పడినపుడు,[...]
- ఎస్పిఎలను తగ్గించనట్లయితే అవి సొసైటీ యొక్క పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఎన్పీఎలను తగ్గించుటకు అవసరమైన వ్యూహాలను అభివృద్ధి పరచవలెను. బారోవర్స్కు ఋణం మంజూరు చేసే ముందు, అతడు ఇతర బ్యాంకులు లేదా సంస్థలలో వ్యవహరించే తీరుతో పాటు అతనికి సంబంధించిన ఇతర వివరాలను సక్రమంగా విచారించాలి. అతని పరపతి స్థోమతను అంచనావేయాలి. ఆర్థిక సహాయం అందించబడే ప్రాజెక్టు లేదా పథకానికి, సాంకేతిక సౌలభ్యం, నిలదొక్కుకునే ఆర్థికస్థోమత ఉన్నదీ లేనిదీ అంచనా వేయాలి. ఖాతాలను క్షుణ్ణంగా[...]
- బకాయిదారులు అప్పు తీర్చుటకు శక్తియున్ననూ కావాలనే అప్పు తీర్చని సందర్భంలో వారిపై మరియు వారి హామీదారులపై చట్టప్రకారము చర్యలు తీసుకొనవలెను. అందులో భాగంగా దావాలు వేయడం, తీర్పును పొందటం వంటి చర్యలను ఆరంభించి, తద్వారా స్థిరాస్థులతో పాటు ఇతర సెక్యూరిటీలను నగదుగా మార్చుకునేలా సంఘాలకు సౌలభ్యం ఉంది. కోర్టు నుండి పొందిన ఏ తీర్పు అయినా 12 సంవత్సరాల వరకు అమలులో ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఆలస్యం చేయకుండా కోర్టులో దావాలు వేసి బకాయిదారులు చర, స్థిరాస్తులను[...]
- ఏపిసిఎస్ యాక్ట్ ప్రకారం రిజిస్టరైన సొసైటీకి సభ్యుని, గత సభ్యుని, మరణించిన సభ్యునికి చెందిన షేర్ క్యాపిటల్ లేక దానిపై వడ్డీ, డివిడెండ్, బోనస్, లేక ఏదేని చెల్లించదగిన లాభంపై హక్కు ఉండును.సంఘం యొక్క సభ్యులను లేదా మరణించిన సభ్యుల వారసులు ఖాతాకు జమ చేయాల్సిన, చెల్లి ౦చదగిన మొత్తాన్ని సొసైటీకి చెల్లించాల్సిన రుణానికి సర్దుబాట చేయవచ్చును. కోపరేటివ్ సొసైటీస్ యాక్ట్ క్రింద రిజిస్టరైన సంఘానికి, బకాయి ఉన్న ఏదేని మొత్తాన్ని వసూలు చేయుటకు రాష్ట్ర రెవెన్యూ[...]
- ఎన్పీఎ లు పెరగడానికి మరొక ముఖ్య కారణం బకాయి వసూళ్ళు తక్కువగా ఉండడం. తక్కువ వసూళ్ళుకు అనేక కారణాలు ఉండవచ్చు. అయినప్పటికీ ప్రతి సంఘం, బకాయి వసూళ్ళలో వివిధ మార్గాలను అమలు చేయవలెను. వివిధ సంధర్భాలలో బకాయిదారులను సందర్శించుట మరియు నిర్దిష్టమైన పద్ధతులు అనగా డిమాండ్ నోటీసులను జారీ చేయుట, ఆ తదుపరి రిమైండర్స్ను జారీ చేయుట, చివరి అవకాశంగా దావాలు వేయడం, న్యాయపరమైన చర్యల ద్వారా వసూలు చేయవచ్చు. సంఘాలు వాటి బకాయిలను వసూలు చేసుకోవడానికి[...]
- సంఘం నిలదొక్కుకొని మనగలగడానికి లాభాన్ని సంపాదించవలెను. అనగా సొంత ఖర్చులను భరించడానికి, భవిష్యత్తులో మరింత వృద్ధి చెందడానికి అవి తప్పనిసరిగా లాభాలను ఆర్జించవలెను. ఒకసారి ఒక లోను ఎన్ఎఎగా వర్గీకరించినపుడు
- సొసైటీలో ఎన్పిఎ పెరుగుతున్నట్లయితే అవి ఆ సొసైటీ యొక్క ఆస్తి విలువలను తగ్గిస్తాయి. సంఘ వనరులు ఎక్కువ భాగం రుణ వ్యవహారాలలో వినియోగించడం వల్ల పెరిగిన ఎస్పిఎ ఆస్తుల అసలు విలువను తగ్గిస్తాయి. రాబట్టదగిన అస్తుల విలువ ఆస్తుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే దాని నికర విలువ తగ్గిపోతుంది. ఒకసారి నికర విలువ తరిగిపోడం ప్రారంభమైతే దాని ఆర్థిక సామర్థ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
- సొసైటీలో ఎన్పీఎ పెరుగుదలను అరికట్టకపోతే ఆదాయ సముపార్జన సామర్ధ్యం, ఆర్థిక పటుత్వంపై ప్రభావం పడి డివిడెండ్ను చెల్లించడం మరియు డిపాజిటర్ల క్లెయింలు పరిష్కరిచే శక్తిని కోల్పోతుంది. సంఘ మూలధనానికి వాటాల రూపంలో జమచేసిన వాటాదారులకు ఎటువంటి ప్రతిఫలం అందకపోతే, వారికి సంఘ వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్లడంపై ఆసక్తి నశిస్తుంది. డిపాజిటర్లలో కూడా ఆసక్తి నశిస్తుంది. గ్రామీణ వ్యవసాయదారులు మరియు డిపాజిటర్ల దృష్టిలో సంఘ ప్రతిష్ట దెబ్బతినడానికి దారితీస్తుంది. సంఘాల వ్యాపార విస్తీర్ణంలో ఇతర పోటీదారులైన వాణిజ్య బ్యాంకులు,[...]
- సొసైటీలో ఎన్ఎఎలు అధికమవుట వలన, సంఘం యొక్క ఆర్థిక పరిస్థితి మరియు నిఖర విలువ దెబ్బ తింటుంది. అదేవిధంగా ఆస్తుల విలువ తగ్గిపోయి స్వంత నిధులపై ప్రభావ పడుతుంది. స్వంత నిధులు తగ్గడం వలన సంఘం ఉన్నత స్థాయి ఆర్థిక సంస్థ నుండి తీసుకొను అప్పులు కూడా తగినంత ఎక్కువగా పొందలేము. ఎన్పీఎ శాతం ఒక స్థాయికి దాటితే డిసిసిబి లేదా రాష్ట్ర సహకార బ్యాంక్ నుండి అప్పులు పొందడానికి స్వంత నిధుల ఆధారంగా అర్హతను లెక్కిస్తారు[...]