00:00
- వైరస్ను తట్టుకునే రకాలను సాగుచేసుకోవాలి. గట్లమీద వైరస్ క్రిములకు స్థావరాలుగా ఉన్న కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. సూక్ష్మపోషక మిశ్రమాన్ని లీటరు నీటికి 2.5 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పొలం చుట్టూ 2 లేదా 3 వరుసలు జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంట గా వేసుకోవాలి.
- సేంద్రీయ ఎరువులు అధికంగా వాడి ఎరువుల సమతుల్యతను పాటించాలి. సూక్ష్మపోషక లోపాలు రాకుండా చూసుకోవాలి. విత్తనశుద్ధి చేయాలి. ఒక కిలో విత్తనానికి 8 గ్రా.ల ఇమిడాక్లోప్రిడ్ పురుగు మందుతో శుద్ధి చేసి మొక్క తొలిదశలో రసం పీల్చు పురుగులను నియంత్రించాలి. వైరస్ నివారణకు మందు లేదు కనుక వాటి వ్యాప్తికి దోహదపడే రసం పీల్చు పురుగులున అరికట్టడం ద్వారా వైరస్ ను సమర్థవంతంగా నిర్మూలించుకోవాలి.
- పొలంలో అక్కడక్కడ ఆయిల్ లేదా గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను లేదా రేకులను ఉంచితే తెల్ల దోమ ఉధృతిని తెలుసుకోవడంతో పాటు కొంతవరకు సంఖ్యను తగ్గించవచ్చు. వైరస్ సోకిన మొక్కల ను పీకి కాల్చివేయాలి. పేనుబంక నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
- తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 0.3 శాతం గుళికలు నాటిన 15 రోజులకు మరియు 45 రోజుల కు ఎకరానికి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు వేయాలి. ఎసిఫేట్ 1.5 గ్రా లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.25 లేదా డైఫిన్దథయురాన్ 1.5 గ్రా. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి తామర పురుగును నివారించుకోవచ్చు.
- మిరప కోతలు: పంట దిగుబడి అధికంగా పొందటానికి చెట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడు కోసి, పట్టాలపై కాని, సిమెంట్ కళ్ళాలపైనకాని ఆరబెట్టడం శ్రేష్టం. వర్షాధారపు పైరుకు 3 - 4 కోతలు, నీటి ఆధారపు పైరుకు 6-8 కోతలు కోయాలి.
- ఎగుమతికొరకు మిరప నాణ్యతను పెంచటానికి సూచనలు: మొక్కల మీద మిరపకాయలను ఎక్కువగా పండనీయరాదు. ఎక్కుగా పండితే మిరప నాణ్యత తగ్గు తుంది. పండిన కాయలు ఎప్పటికప్పుడు కోయటం వలన దిగుబడులు పెరుగుతాయి. కాయకోసే ముందు సస్యరక్షణ మందులు తరుచుగా పిచికారీ చేయరాదు. పిచికారీ చేస్తే మిరప కాయలమీద అవశేషాలుండే ప్రమాదముంటుంది.
- మిరపలో తాలు కాయలను, మచ్చకాయలను గ్రేడింగ్ చేసి వేరుచేయాలి. నిల్వచేయడానికి తేమ లేనటువంటి శుభ్రమైన గోనే సంచుల్లో కాయలు నింపాలి. కాయలను గోనేసంచులలో నింపేటపుడు నీరు చిలకరించరాదు. తేమ తగలకుండా వరిపొట్టు లేదా చెక్క బల్లలమీద గోడలకు 50 నుండి 60 సెం.మీ దూరంలో నిల్వ ఉంచాలి. అవకాశమున్నచోట శీతల గిడ్డంగుల్లో నిల్వచేస్తే రంగు, నాణ్యత తగ్గిపోకుండా లాభదాయకంగా ఉంటుంది.
- కాయలు మంచి రంగు రావాలని ఏ విధమైన రసాయనాలను, రంగులను వాడకూడదు. అవి ప్రమాద కరమేకాక నిషేదింపబడ్డాయి. అకాల వర్షాలకు గురికాకుండా, మంచు బారిన పడకుండా, రంగుకోల్పో కుండా ఆధునిక డ్రయ్యర్లలోగాని లేదా టొబాకో బారన్లలోగాని ఎండబెట్టి నాణ్యమైన మిరప కాయలను పొందవచ్చు.