Search
Close this search box.

Business Diversification

album-art
00:00
  • 1. ప్రస్తుత ఆర్థిక దశలో ఒక సంస్థ తన స్వంత కాళ్ళపై నిలబడి, నిలదొక్కుగలిగితే తప్ప, త న సభ్యులకు సేవలను అందించగలిగే స్థితిలో ఉండదు. ప్యాక్స్ తన సభ్యులకు అవసరమైన సేవలతో పా టుడిపాజిట్ల సేకరణ మరియు పరపతిని అందించుటకు ఏర్పాటు చేయబడ్డ ఒక విలక్షణమైన సంస్థ. అనువైన అభివృద్ధి వ్యూహాలను అమలుచేస్తూ ప్యాక్స్ సమర్థవంతమైన సంస్థగా ఎదగాలి. ఒక సంస్థ యొక్య కార్యకలాపాల్లో సమర్థమతను, పోటీతత్వాన్ని కొలవడానికి 'లాభం ' అనేది సులభంగా అర్థం[...]
  • 2. నిర్ణీతకాలానికి ఖర్చుల కన్నా అధికంగా ఉండే మిగులును లాభం అని అంటారు. వ్యాపారా న్నినడపడానికి యజమానులు దానిపై పెట్టిన పెట్టుబడి మీద వచ్చే ప్రతిఫలాన్నే లాభంగా ఆర్థికవేత్త లు నిర్వచించారు. ప్యాక్స్ ఒక వ్యాపార సంస్థకాగా, అందులోని సభ్యులే దాని యజమానులు. సభ్యులే ఆ సంస్థకు మూలధనాన్ని సమకూర్చారు. బ్యాంకింగ్ పరిశ్రమలో తమ కార్యకలాపాల ద్వారా వ చ్చే లాభాన్నే మార్జిన్ గా చెప్పబడుతుంది. ఇది చెల్లించిన వడ్డీకన్నా వచ్చిన వడ్డీ అధికంగా ఉండే మిగు[...]
  • 4. ఫిక్స్ డ్ డిపాజిట్లు లేక బాండ్లు లేక మరేదైనా పెట్టుబడులను బ్యాంక్ లో లేదా ఇతర సంస్థల్లో పెట్టినప్పుడు ఆ పెట్టుబడులపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణించవచ్చు. * సంఘం యొక్క ద్రవ్యత్వ (ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొనుటకు ఉంచుకునే డబ్బు) అవసరాల కొరకు ఇతర బ్యాంకుల్లో ఉంచే నిల్వలపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణించవచ్చు. * ద్రవ్యేతర వ్యాపారం ద్వారా ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం, తదితర రూపాల్లో సంఘానికి ఇతర ఆదాయం సమకూరుతుంది.
  • 5. అప్పులు, పెట్టుబడులు, బ్యాంక్ నిల్వపై వడ్డీ ద్వారా లభించే ఆదాయాన్ని ఆర్థిక ప్రతిఫలంగా చెప్పుకోబడుతుంది. ఎందుకంటే ఈ రకమైన ఆదాయం సంఘం తన సభ్యునికి, సంస్థకు, బ్యాంక్ కు అప్పు ఇవ్వడం ద్వారా పొందుతుంది కాబట్టి సంఘం యొక్క మొత్తాన్ని ఆర్థిక లాభం మరియు ఇతర ఆదాయం కలిపి ఉంటాయి.
  • 6. సంఘం తన కార్యకలాపాల అవసరాలు అనగా (అప్పులు, పెట్టుబడులు, నగదు, బ్యాంకు నిల్వ, సిబ్బంది వ్యయం, పరిపాలన ఖర్చులు) నిమిత్తమై వనరుల సమీకరణలో వెచ్చించే వ్యయాన్ని ఆర్థిక వ్యయం అంటారు. ఈ రకమైన వనరులను సంఘం డిపాజిట్ల సేకరణ ద్వారా లేక రుణాలు తేవడం ద్వారా సమీకరిస్తుంది. డిపాజిట్లపై ఒప్పందం మేరకు, తెచ్చిన అప్పులపై అంగీకరించిన షరతుల మేరకు సంఘం వడ్డీ చెల్లించాలి. ఆదాయం వచ్చినా రాకపోయినా సంఘం మాత్రం వడ్డీ చెల్లించి తీరాలి. కాబట్టి[...]
  • 7. సంఘం తన నిర్వహణా వ్యయాలను ఆర్థిక మార్జిను నుండి వెచ్చించాలి. నిర్వహణా వ్యయాలలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. అవి సిబ్బంది వ్యయం, పరిపాలనా వ్యయం. సిబ్బంది వ్యయం లో సిబ్బందికి చెల్లించిన జీతాలు మరియు బత్తెములు, ప్రోత్సాహకాలపై వ్యయం, వారికి కల్పించిన సౌకర్యాలు, ప్రావిడెంటు ఫండుకు చెల్లించిన మొత్తాలు మొదలగునవి కలిసి ఉంటాయి. పరిపాలనా వ్యయంలో కార్యాలయపు అద్దె, పోస్టేజి, ఫోను, స్టేషనరీ, స్టాంపు పేపర్లు, విద్యుత్తు, ఇతర సాధారణ ఖర్చులు మరియు కంటింజెంటు[...]
  • 8. ఇప్పుడు మనం మరో రకమైన వ్యయాన్ని చూద్దాం. ద్రవ్యేతరవ్యయాలు అంటే సంఘం నగదును వెచ్చించినప్పటికీ, ఆమేరకు సంఘం యొక్క లాభం తగ్గిపోతుంది. రిస్కువ్యయం, తరుగుదల అనే రెండు ప్రధానమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రిస్కువ్యయం అంటే ఇచ్చిన అప్పుల వల్ల సంభవించబోయే నష్టాల కొరకు చేసిన ఏర్పాట్లు, సంఘం రాని బాకీల కొరకు, సంశయాత్మక బాకీల కొరకు కొంత మొత్తాన్ని అలాంటి అప్పులను రద్దు చేయడానికి ప్రొవిజన్ పెట్టాలి.
  • 9. సంఘం రిస్కు వ్యయం అంటే రానిబాకీల అంచనాతో ఏర్పరచిన నిధులు మరియు పెట్టుబడుల మార్కెటు విలువ ప్రకారం తరుగుదల కొరకు ఏర్పరచిన నిధులు. నిర్వహణ లాభం నుండి రిస్కు వ్యయం, స్థిరాస్థులపై తరుగుదల, పనున్ల చెల్లింపులను తీసివేయగా సంఘానికి నికర లాభం వస్తుంది.
  • 10. సంఘం లాభాలార్జిస్తే, నికర లాభం వచ్చిన తరువాత ఎలా వినియోగించాలని ఆలోచించాలి. దీనిని వినియోగించడంలో రెండు ముఖ్యమైన మార్గాలున్నాయి. అవి * సంస్థ యొక్క వ్యాపార అవసరాలను నెరవేర్చడానికై శాసనాత్మక లేదా నిర్దేశించబడ్డ కేటాయింపు లు చేయుట * యజమానులకు డివిడెండును ప్రకటించుట. స్థిరమైన మొత్తం లేదా లాభాల నుండి నిర్దేశించిన ప్రత్యేక నిధికి లేదా సాధారణ నిధికి కేటాయించడం.
  • 11. వాటా దారులు చెల్లించిన మూలధనంపై లాభాలనుండి డివిడెండును కొంత మొత్తాన్ని కేటాయించడం రెండవది, డివిడెండు అనేది పెట్టుబడి దారుడికి ప్రతిఫలం. ఒక విధంగా చెప్పాలంటే ఇది సంఘానికి ఖర్చు. ఆ మేరకు సంఘం నుండి డబ్బు బయటకుపోతుంది. దీనినే ఈక్విటీ వ్యయం అంటారు. చాలా సంఘాలు డివిడెండును చెల్లించడం లేదు. కాని ఇప్పటికైనా సంఘం వాటాదారునికి డివిడెండు చెల్లించేందుకు నాందిపలకాలన్నది కోరదగ్గ అంశం. అలాకాకపోతే ఏ పెట్టుబడిదారుడూ తన డబ్బును ప్రతిఫలమేరాని వ్యాపారంలో పెట్టడు. అయితే[...]
  • 12. ప్యాక్స్ లాంటి సంస్థలో లాభాలనార్జించడానికి ఎలా ప్రయత్నించాలో తెలుసుకుందాం. * వనరుల ప్లానింగు మరియు నిర్వహణ * వ్యాపారాభివృద్ధి * నిధుల నిర్వహణ *ద్రవ్యేతర వ్యాపారం (ఇతర ఆదాయం) * ఆదాయలోటుపాట్లను నియంత్రించడం * వ్యయ నియంత్రణ మరియు నిర్వహణ
  • 13. వినియోగదారుడు తన డబ్బును సంఘంలో డిపాజిట్ చేయడం వలన ఈ నిధి సమకూరుతుంది. వినియోగదారుడు అట్టి డిపాజిట్ ను కోరినప్పుడు లేదా కాలవ్యవధి ముగిసిన తర్వాత చెక్కు, ఆర్డర్ ఇతరాల ద్వారా సంఘం అతనికి చెల్లించాల్సి ఉంటుంది. కోరినప్పుడు చెల్లించవలసిన డిపాజిట్లు సాధారణంగా తక్కువ వ్యయంతో కూడుకున్న డిపాజిట్లు. ప్యాక్స్ సాధారణంగా డిమాండ్ డిపాజిట్లను సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల రూపంలో స్వీకరిస్తాయి.
  • 14. సాధారణంగా కాలవ్యవధి పెరిగేకొద్దీ సంఘం ఎక్కువ వడ్డీని చెల్లించాలి. ఈ పద్దు కింద సంఘం ఫిక్స్ డ్ , రికరింగ్ డిపాజిట్లను సేకరిస్తుంది. ఒక మొత్తాన్ని నిర్ణీత కాలానికి ఒక సారి మాత్రమే డిపాజిట్ చేయడాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ అని అంటారు. రికరింగ్ డిపాజిట్ కూడా నిర్ణీత కాలపు డిపాజిట్ అయినప్పటికి దీని ద్వారా నిర్ణీత మొత్తాలు మంత్లీ వస్తుంటాయి. సాధారణంగా సేవింగ్స్ బ్యాంక్ తక్కువ వ్యయంతో కూడిన డిపాజిట్ గా, కాలవ్యవధి ఎక్కువ[...]
  • 15. బ్యాంక్ లు అందరి నుండి డిపాజిట్లను స్వీకరిస్తుండగా, ప్యాక్స్ లు మాత్రం తమ సభ్యుల నుండి మాత్రమే స్వీకరిస్తున్నాయి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 నిబంధనల క్రింద నియంత్రించబ డుతున్నట్టి బ్యాంకులు మాత్రమే సాధారణ ప్రజలనుండి డిపాజిట్లను సేకరించగలవు.
  • 16. అప్పులు అనేవి ప్రత్యేక ఉద్దేశ్యం నెరవేరుటకై ఇతర సంస్థచే అందించబడే మొత్తాలు. అప్పులు డిసిసిబికి నాబార్డు అనుమతించిన పరిమితులకు ప్రతిగా డిసిసిబి, ప్యాక్స్ కన్సెషన్ వడ్డీ రేటులో ఇవ్వవచ్చు. లేదా వాణిజ్య అప్పులను మార్కెట్ వడ్డీ రేట్లకు తేవచ్చు. ఇతర రుణగ్రస్తునిలాగే ప్యాక్స్ కూడా అప్పులకు వాయిదాపై వడ్డీలను తన రుణగ్రస్తుని నుండి ఇచ్చిన అప్పు తిరిగి వచ్చిందా, లేదా అనేదానితో నిమిత్తం లేకుండా చెల్లించాల్సి ఉంటుంది. అప్పు ఒక ప్రత్యేక ఉద్దేశం కొరకు ఇవ్వ[...]
  • 17. మెంబర్స్ నుండి కలెక్ట్ చేయబడిన షేర్ క్యాపిటల్ ను స్వంత నిధులుగా పిలుస్తారు. సభ్యత్వం నుండి విరమించుకున్నప్పుడే దీనిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సంఘంలోనే ఉంచుకునే లాభాలను కూడా స్వంతనిధులుగా భావిస్తారు. ఇవి డివిడెంట్ చెల్లించిన తర్వాత నికర లాభంలో నుండి ఏర్పాటు చేసిన నిధులు, రిజర్వ్ లుగా ఉంటాయి. లాభంలోని ఈ భాగం సంఘం యొక్క వ్యాపారంలోనికి తిరిగి వస్తుంది.
Scroll to Top