Search
Close this search box.

రైతు స్థాయిలో మొలక శాతం పరీక్షించే పద్ధతులు

album-art
00:00
  • రైతు స్థాయిలో మొలక శాతం పరీక్షించే పద్ధతులురైతు సాగు చేసే వివిధ పంటలలో నాణ్యమైన విత్తనం యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. లాభసాటి పంటకు నాణ్యమైన విత్తనము ప్రధానం. కాబట్టి ప్రతి సంవత్సరం రైతు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని లాభసాటి వ్యవసాయం చేయాలి. విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. మొలక శాతాన్ని లెక్కించడానికి నాలుగు పద్ధతులున్నాయి. వాటి గురించి తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం.
  • రైతు స్థాయిలో మొలక శాతం పరీక్షించే పద్ధతుల్లో ట్రే పద్ధతి గురించి తెలుసుకుందాం. లావు గింజలైన ఆముదం, వేరుశనగ, ప్రత్తి విత్తనాలను ట్రే పద్ధతిలో పరీక్షించవచ్చు. ఒక ప్లాస్టిక్ ని గాని, కుండీని గాని ఇసుక తో నింపి 50 నుండి 100 విత్తనాలను అంగుళం లోతుగా నిర్ణీత ఎండలో విత్తాలి. ఇసుకను నీటితో తడుపుతూ ఉంటే 7 నుండి 10 రోజుల్లో మొలకలు వస్తాయి. 50 లేదా 100 కు ఎన్ని మొలకలొచ్చాయో లెక్కించి శాతాన్ని[...]
  • గుడ్డలో మూటకట్టే పద్ధతి : ఒక వంద విత్తనాలను తడి గుడ్డలో మూటకట్టి, ప్లేటులో తరచూ మూటను నీటితో తడుపుతూ ఉండాలి. మొలకలొచ్చాక లెక్కించి మొలక శాతాన్ని తెలుసుకోవచ్చును. తదుపరి కార్య క్రమంలో పెట్రిడిష్ పద్ధతి గురించి తెలుసుకుందాం.
  • వంగ, టమాటా, మిరప వంటి చిన్న విత్తనాల మొలక శాతాన్ని పెట్రిడిష్ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. ' ఎట్రిడిష్ బ్లాటింగ్ పేపరు అమర్చి నీటితో తడపాలి. దానిపై 50 నుండి 100 విత్తనాలను అమర్చి మూత పెట్టాలి. తేమ ఆరిపోకుండా బ్లాటింగ్ పేపరును నీటితో తడుపుతూండాలి. మొలకెత్తిన గింజలను లెక్కించి మొలక శా తాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
  • పేపరు టవలు పద్ధతి:వరి, ప్రత్తి , ప్రొద్దు తిరుగుడు, జొన్న తదితర విత్తనాల్లో మొలక శాతాన్ని తెలుసుకోవడానికి ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ముందుగా పేపరు టవలు లేదా మందపాటి వస్త్రాన్ని తీసుకొని నీటిలో తడపాలి. దీన్ని నేలపై లేదా బల్లపై పరచి వంద విత్తనాలను వరుస క్రమంలో అమర్చాలి. విత్తనాలపై మరో పేపరు టవలు గాని లేదా పలుచటి గుడ్డను గాని కప్పాలి. ఈ రెండింటిని చాపలా చుట్టి చివర్లను దారంతో కట్టి ఏటవాలుగా పెట్టాలి.[...]
  • వివిధ పంటలలో నిర్దేశించిన విత్తన మొలక శాతం:మొక్కజొన్న లో విత్తన మొలక శాతం 90% ఉండాలి. శనగలో 85%, వరి, ఉలవలు, లూసర్న్, మొక్క జొన్న, కుసుమలు, నువ్వులలో 80% ఉండాలి. జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద, సజ్జ, ప్రత్తి సంకరాలలో విత్తన మొలక శాతం 75% ఉండాలి. ఆముదం, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, సోయాచిక్కుడు, పొగాకు, క్యాబేజి, ఉల్లి, మెంతి, తోటకూరలో 70%, ప్రత్తి, బెండ, క్యాలీఫ్లవర్ లో 65% ఉండాలి. మిరప, దోస,[...]
Scroll to Top