00:00
- 1. కాయ కోసే సమయానికి కాయ పూర్తి పరిమాణం సంతరించుకుని ఆకుపచ్చ రంగులో ఉండాలి. పక్వానికి వచ్చిన కాయ భుజాలు పూర్తిగా ఏర్పడి, తొడిమ దగ్గర కొంతవరకు గుంతలా కనిపిస్తుంది. కాయపై ఉన్న గ్రంథులు తెలుపు చుక్కలుగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. రిఫ్రాక్టో మీటర్ ద్వారా కాయ రసాన్ని చూస్తే 10-13 బ్రిక్స్ చెక్కెర శాతం ఉంటే అది కోతకు సిద్ధం అయినట్టు. కాయ తొడిమ పెద్దగా ఉంచకుండా చిన్నగా కత్తిరించుకోవాలి. లేనిచో అవి మిగిలిన పండ్లపై గీతలు[...]
- 2. కాయ కోసే సమయంలో తేమ శాతం ఎక్కువగా ఉండకుండా ఉండేలా, పొడి వాతావరణం లోనే కోసుకోవాలి. ఉదయం 9 గంటల పైన కాయ కోయాలి. కాయ కోసేటప్పుడు హార్వెస్టర్స్ సాయంతో కాయకి దెబ్బ తగలకుండా కోసుకోవాలి. చెట్టుని లేదా కొమ్మలను ఊపి కాయ కిందకు రాలే లాగ చేయకూడదు.
- 3. కాయ కోసేటప్పుడు మట్టి అంటకుండా ఉండేలా చూసుకుంటే మంచి నాణ్యమైన కాయలు పొందడం తో పాటు, తెగుళ్లు కూడా తక్కువగా ఆశిస్తాయి. కోసిన కాయలను ప్యాకింగ్ చేసే ముందు తొడిమ భాగం కిందకు ఉండేలా పెట్టి 2-3 గంటలు ఉంచితే సోన అంతా కాయ పై పడి మచ్చలు గా మారి కాయ నాణ్యతను దెబ్బతీయకుండా కిందకు కారిపోతుంది. తరువాత న్యూస్ పేపర్లలో / ఎండు గడ్డితో పెట్టడం వల్లరవాణా లో దెబ్బతినే అవకాశాలు తగ్గుతాయి.[...]
- 4. కాయ కోతకు ముందు చెట్టుపై ఉండగానే కార్బెండిజం 1 గ్రా / లి. నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా కోత తరువాత మచ్చ తెగులు, కాయ కుళ్ళు రాకుండా నివారించవచ్చు. కాయ కోసి, సోన అంతా కారిపోయాక, 52-55 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న వేడి నీటిలో కాయలను 5-10 నిమిషాలు పెట్టడం ద్వారా రసాయనాలు లేకుండా కుళ్ళు తెగుళ్లను నివారించవచ్చు. పిందె రాలడం ఎక్కువగా ఉన్నప్పుడు ప్లానోఫిక్స్ 1 మి.లీ 4.5 లీ నీటికి[...]