00:00
- సేంద్రీయ ఎరువుల వల్ల భూమికి, పంటకు కలిగే ప్రయోజనాలు: సేంద్రీయ ఎరువులు నేలలో కుళ్ళి ఖనిజీకరణ చెంది పంటలకు అవసరమైన స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ లు, ఉప పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు పంటలకు అందిస్తాయి. సేంద్రీయ ఎరువులు కుళ్ళేటప్పుడు వివిధ సూక్ష్మజీవులు విటమినులను, రోగ నిరోధకాలను, పెరుగుదలను, వృద్ధి చేసే హార్మోనులను ఉత్పత్తి చేస్తాయి. ఆక్సినులు విత్తనాలు మొలకెత్తడాన్ని, వేర్ల పెరుగుదలకు తోడ్పడతాయి. శిలీంధ్రాలకు విషంగా ఉండే పదార్థాలు వీటి నుంచి తయారై[...]
- సేంద్రీయ ఎరువులు “చిలేట్స్” గా పనిచేసి సూక్ష్మ పోషకాల లభ్యతను, నేలలో వీటి కదలికలను పెంచుతాయి. సేంద్రీయ ఎరువుల నుంచి నత్రజని నిధానంగా విడుదలవడం వలన రసాయన ఎరువులతో పోలిస్తే సేంద్రీయ ఎరువులలో నత్రజని నష్టం తక్కువగా ఉంటుంది. వాతావరణంలోని నత్రజనిని సేంద్రీయంగా స్థిరీకరించి పంటలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తుంది.
- నేలలో హ్యుమన్ తయారీకి అవసరమైన కర్బనాన్ని అందిస్తాయి. నేలలోని ఖనిజ లవణలను మొక్కల వేర్ల నుంచి విడుదలయ్యే రసాయనాలతో, నేలలో సూక్ష్మ జీవులు విడుదల చేసే పదార్థాలతో కరిగించి మొక్కలకు అందుబాటులో ఉండే రూపంలోకి మారుస్తాయి. నేలలోని సూక్ష్మ జీవులన్నింటికి సేంద్రీయ ఎరువులు ఆహారంగా అందుబాటులలో ఉండి, ఇవి నేలకు పంటలకు ఉపయోగపడే ప్రక్రియలు జరిగేందుకు ఉపయోగపడతాయి. పారించే నీటి ద్వారా నేలకు చేరే భార ఖనిజ కాలుష్యాలైన పాదరసం, కాడ్మియం లాంటి వాటిని తాత్కాలికంగా గ్రహించి[...]
- నేల రసాయన, భౌతిక, జీవగుణాలపై ప్రభవం చూపి నేల సత్తువను ఉత్పాదక శక్తిని పెంచుతాయి. నేల భౌతిక స్థితిని మెరుగు పరుస్తాయి. అంటే తేమను నిల్వ ఉంచే శక్తి, నేలలోని గాలి ప్రసరణ, మట్టి రేణువులు ఒకదానికొకటి పట్టి ఉంచే శక్తిని మెరుగు పరుస్తాయి. నేలలో నీరు ఇంకిపోయే వేగాన్ని పెంచుతాయి. మురుగు నీరు పోవడాన్ని వృద్ధి చేస్తాయి. నేల కోతకు తట్టుకునే శక్తిని ఎక్కువ చేసి కోతను తగ్గిస్తాయి. నేలలోకి ఇంకే నీటిని పెంచి నేలపై[...]
- నేలపై సేంద్రీయ ఎరువులు మల్చింగ్గా పనిచేసే వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. చలికాలం లో నేల ఉష్ణోగ్రతను పెంచుతాయి. నేల, వాతావరణం మధ్య ఉష్ణోగ్రత ప్రయాణించకుండా నిరోధిస్తాయి. సేంద్రీయ ఎరువుల లభ్యత గురించి తదుపరి కార్యక్రయంలో తెలుసుకుందాం.
- పశువులు, గొర్రెలు, మేకల ఎరువులను శాస్త్రీయంగా అధికంగా సేకరించి, నిల్వ చేసి సేంద్రీయ ఎరువుగా వాడుకోవాలి. మన రాష్ట్రంలో సేంద్రీయ ఎరువు అయిన కోళ్ళ ఎరువు 7 లక్షల టన్నులు / సంవత్సరానికి లభిస్తుంది. డీప్లిట్టర్ పద్ధతిలో గాని కెజెస్ పద్ధతిలో గాని తయారైన కోళ్ళ ఎరువు పంటలకు వేస్తే భూమి వేడెక్కుతుందని, సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గుతుందని, రైతులకు అపోహ ఉంది. కోళ్ళ ఎరువులో పశువుల ఎరువులలో కంటే అధిక నత్రజని, భాస్వరం మరియు పొటాషియం[...]
- కోళ్ళ ఎరువును 2 - 3 నెలలు మగ్గబెట్టిన తర్వాత పొలానికి వేసుకోవడం వలన ఎలాంటి హాని ఉండదు. గ్రామీణ, పట్టణ కంపోస్టును శాస్త్రీయ పద్ధతిలో అధికంగా తయారు చేసుకోవాలి. వ్యర్థ పదార్థాలతో రైతు స్థాయిలోనే వానపాముల ఎరువును తయారు చేసుకోవాలి.
- చెరకు కర్మాగారాల నుంచి ఉప ఉత్పత్తిగా లేదా వ్యర్థ పదార్ధంగా తయారయ్యే చెరకు మడ్డిని సేంద్రీయ ఎరువుగా విరివిగా వాడవచ్చు. 100 టన్నుల చెరకు నుంచి 3 - 4 టన్నుల చెరకు మడ్డి తయారవుతుంది. చెరకు మడ్డిలో పశువుల ఎరువు కంటే అధికంగా నత్రజని, భాస్వరం, పొటాష్ లు ఉన్నాయి.
- పచ్చిరొట్ట పంటలయిన జనుము, జీలుగ, అలసంద, పెసర, మినుము, పిల్లిపెసర లాంటి వాటిని విస్తారముగా సాగు చేసి కలియదున్నాలి. వేరుశనగ, వేప, ఆముదం, కానుగ, పత్తి గింజల పిండి లాంటి వాటిని సేంద్రీయ ఎరువులుగా అధికం గా వాడాలి. భూమి, పంటల ఆరోగ్యాన్ని కాపాడుతూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు దోహదపడే సేంద్రీయ ఎరువుల ప్రాముఖ్యతను, ఆవశ్యకతను రైతులు గుర్తించి, వీటి ఉత్పత్తిని అధికం చేసి పంటలకు అందించాల్సిన అవసరం ఉంది.