00:00
- సంఘ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సిఇఓ ) అధికారములు మరియు బాధ్యతలు సర్వీసు నిబంధనలకు అనుగుణముగా సిఇఓ నియమకాలు జరుగుతుంది. సిఐఓ ప్రెసిడెంట్ అజమాయిషీకి లోబడి అడ్మినిస్ట్రేషన్ పవర్ కలిగి ఉన్నాడు. సంఘము తరపున వ్యాజ్యములు వేయుటకు కాని సంఘముపై వేయబడు వ్యాజ్యములను ఎదుర్కొనుటకుగాని, ఆయనకధికారము కలదు. సంఘముచే వ్రాయబడు పత్రములు, దస్తావేజులు, అధ్యక్ష మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారుల సంతకములు ఉండవలెను. అట్టి పత్రములు, దస్తావేజులు సిఇఓ ఆధీనములో ఉండవలెను.
- సంఘ ఆస్తులు, నగదు తదితర నిల్వలు సిఇఓ ఆధీనములో ఉండును. వాటి పరిరక్షణకు బాధ్యుడై ఉండును. మానేజ్మెంట్ కమిటీ విధించిన పరిమితులకు లోబడి బ్యాంకు అకౌంట్లను అధ్యక్షుడు లేక ఒక పాలకవర్గ సభ్యునితో కలిసి నిర్వహించు అధికారము కలదు. సంఘము తరపున ఉత్తర ప్రత్యుత్తరములు నడుపుట సంఘము యొక్క అన్ని అకౌంట్ పుస్తకములు, రిజిష్టరులు నాబార్డు వారు నిర్దేశించిన కామన్ అకౌంటింగ్ సిస్టమ్ ప్రకారము వ్రాయుట మరియు వ్రాయించుట మరియు వాటి ఆధీనతను కలిగి యుండుట సిఇఓ[...]
- బైలాననుసరించి సంఘ వ్యవహారములను నిర్వహించుట, మేనేజ్మెంట్ కమిటీ రూపొందించిన నిబంధనలకు లోబడి డిపాజిట్లు సేకరించుట, డిపాజిట్లు సర్టిఫికేట్లనిచ్చుట, డిపాజిటు గడువు ముగిసిన వెంటనే వడ్డీతో సహా చెల్లించుట. పేబిల్లు తయారుచేసి అధ్యక్షుల వారి అనుమతి పొందిన పిదప మార్జిన్ ఖాతా నుండి మాత్రమే సిబ్బంది జీతభత్యాలు చెల్లించుట.
- సంఘంలో సభ్యత్వమును కోరుచు వచ్చిన దరఖాస్తులను స్వీకరించి తన యొక్క సిఫారసులతో వాటిని పాలకవర్గము వారి ముందుంచి వారి నిర్ణయమును దరఖాస్తు దారులకు చట్టంలోని సెక్షన్ - 19 (3) లో నిర్దేశింపబడిన కాలపరిమితిలోపట తెలియచేయాలి. సంఘమునకు చెల్లించబడిన మొత్తములకు సిఇఓ రశీదులు ఇవ్వవలెను. అయితే సంఘము తీసుకున్న ఋణములు, రశీదులు, పత్రములు మొదలైనవి సంఘము తరపున వ్రాసినప్పుడు, సంఘ సిఇఓ తో పాటు అధ్యక్షుడు మరియొక పాలకవర్గ సభ్యుడు సంతకము చేయవలెను.
- సొసైటీ యొక్క అన్ని ఓచర్లను, రశీదులను, ఆస్తి అప్పుల పట్టికను తదితర నివేదికలను, సంఘ వ్యాపారరీత్యాగాని, రిజిస్ట్రారు వారు లేక ఫైనాన్సింగ్ బ్యాంక్ కోరినప్పుడు గాని సమర్పించాలి. అలాగే అప్పు దరఖాస్తులను స్వీకరించి వాటి పరిశీలన, మంజూరు మరియు బట్వాడాలకు ఏర్పాట్లు చేయాలి. సంఘము యొక్క అన్ని విధములయిన ఖర్చులను లేదా చెల్లింపులను పాలకవర్గము రూపొందించిన నిబంధనావళి ననుసరించి అధ్యక్షుని ఆమోదము పొందిన పిదపనే చెల్లించవలెను.
- జనరల్ బాడీ మీటింగునకు, పాలకవర్గ సమావేశమునకు గాని నీటీసు మరియు చర్చనీయాంశములు అందజేయాలి. సంఘ నగదు నిల్వకు సిఇఓ బాధ్యుడు. ఈ నగదు మొత్తమును సంఘము ఆఫీసు నుంచి అధ్యక్షుడు కాని, తనిఖీ అధికారులుకాని కోరినప్పుడు చూపించవలెను. ఈ మొత్తము నిల్వ రు. 500/- లు (ఐదు వందలకు) మించి ఏనాడు ఉంచరాదు. అంతకు మించిన నగదును వెనువెంటనే ఫైనాన్సింగ్ బ్యాంకులో జమకట్టవలెను.
- ఎపిఎస్ యాక్ట్ చట్టంలోని సెక్షన్-21 (జి) సెక్షన్ 21 ఎఎ (5), సెక్షన్ - 21 ఎఎ (6), 21 (ఇ) మరియు 21 (ఎఫ్) క్రింద సభ్యుల మరియు కమిటీ సభ్యుల అనర్హతల గూర్చి కనిపెట్టుట, అట్టి విషయములను కమిటీకి మరియు రిజిస్ట్రారుకు నివేదించుట, ఇతర అనర్హతలను గూర్చి రిజిస్ట్రారుకు మరియు మహాజనసభ / ప్రాతినిధ్య మహాజనసభకు సమాచారము అందచేయాలి.
- ముఖ్య కార్యనిర్వహణాధికారి ఫైనాన్సింగ్ బ్యాంకు వారిచే సరఫరా చేయబడిన ట్రిప్లికేట్ రశీదు పుస్తకమునే వాడవలెను. ఇతర ఉద్యోగులు కూడా ఉపయోగించునట్లు చూడవలెను.*ముఖ్య కార్యనిర్వహణాధికారి సంఘంలో జమ అయిన వసూళ్ళ మొత్తమును 48 గంటలలోగా ఫైనాన్సింగ్ బ్యాంకు నందు చెల్లించవలెను. అట్లు చేయనిచో మేజర్ మిస్ కాండక్ట్ గా భావించి క్రమశిక్షణా చర్యలకు బాధ్యుడగును. * సంఘ పాలకవర్గ సభ్యుడు వాయిదా మీరిన బకాయిదారుడు అయినప్పుడు ఆ విషమయును రిజిస్ట్రారు దృష్టికి తదుపరి చర్యలు తీసుకునే నిమిత్తం వెంటనే[...]
- సొసైటీ యొక్క బైలాననుసరించి డిపాజిట్ల రూపంలో గాని, అప్పుల రూపంలోగాని, సభ్యులనుండి కాని, ఆర్థిఖ బ్యాంకు నుండి గాని, ఇతరుల నుండి గాని, సంఘము సేకరించగల మొత్తం ఋణము . ఏ సందర్భములోనూ చెల్లించబడిన వాటాధనము మరియు క్షేమనిధి మొత్తమునకు ఇరువది ఐదు (25) రెట్లకు మించి యుండరాదు.
- * సొసైటీలో లోన్లను సభ్యులకు మాత్రమే బట్వాడా చేయవలెను. అట్టి లోన్లు మంజూరు చేయునపుడు పాలకవర్గము నిర్ణయించిన మేరకు షేరు ధనము వసూలు చేయవలెను.* సంఘము సభ్యుల వ్యవసాయ మరియు వ్యవసాయ సంబంధిత పనులకుగాను, ఉత్పత్తులకుగాను, పంట అప్పులు మరియు పెట్టుబడి అప్పులుగ మంజూరు చేయవచ్చును.* సభ్యుల ఆర్థిక అవసరములను తీర్చు నిమిత్తము నాబార్డు మరియు రిజర్వు బ్యాంకు మార్గ దర్శకములకు లోబడి అప్పు విధానములకు (లోన్ పాలసీ) లోబడి బైలా నెం. 3 లో ఉదహరింపబడిన[...]
- * సొసైటీ యొక్క సభ్యులకు భూమి హామీపైగాని, చట్టంలోని సెక్షన్ 36 ప్రకారము గావించిన “ఛార్జి” పై గాని మరియు నాబార్డు మరియు రిజర్వు బ్యాంకు మార్గదర్శకములకు లోబడి ఏ ఇతర హామీలపై గాని అప్పులు మంజూరు చేయవచ్చును.* అప్పు వాయిదాలను అవసరమయినప్పుడు నాబార్డు గాని రిజర్వు బ్యాంకు గాని వారి పూర్వ అనుమతితో వారి నిబంధనలకు లోబడి పొడిగించవచ్చును.
- * సొసైటీ సభ్యులనుండి సేకరించిన నిర్ణీత అప్పు దరఖాస్తులను సిఇఓ తన సిఫారసులతో పాలకవర్గము వారి ఆమోదమునకు ఉంచవలెను.* సంఘము ఇచ్చిన అప్పు దుర్వినియోగము గావింపబడినదని పాలకవర్గమువారు అభిప్రాయపడినచో అట్టి అప్పు గడువు ముగియకుండగనే వడ్డీతో సహా వెంటనే వసూలు చేయుటకు చర్య తీసుకొనవచ్చును.* సొసైటీ యొక్క సభ్యలకు బంగారు వస్తువుల తాకట్టు పై పాలవకర్గమువారు నిర్ణయించు వ్యాపార నిబంధనలకు లోబడి ఋణములను మంజూరు చేయవచ్చును.
- * సంఘ సభ్యులకు క్యాష్ క్రెడిట్ అప్పులు కూడా ఫైనాన్సింగ్ బ్యాంకు / నాబార్డు / రిజర్వు బ్యాంకు వారు నిర్ణయించు నిబంధనల మేరకు మంజూరు చేయవచ్చును.* అలాగే సంఘ సభ్యుల నుండి వసూలు చేసిన ఋణ మొత్తములను సభ్యులకు తిరిగి అప్పులుగా ఇవ్వరాదు. అట్టి వసూళ్ళను ఫైనాన్సింగ్ బ్యాంకునకు జమ కట్టవలెను. అయితే సంఘము తన స్వంత నిధులు వినియోగించునపుడు ఈ నిబంధన వర్తించదు.
- * సొసైటీ సభ్యుని నుండి గాని లేదా ఇంతకు పూర్వము సభ్యుడుగా ఉన్న వ్యక్తి నుండి గాని సంఘము నకు ఏమైనా రావలసియున్న యెడల సభ్యుని యొక్క వాటాధనము, డిపాజిట్టు మొదలగు వాటి నుండి సంఘము రాబట్టుకొను మొదటి హక్కు కలిగియున్నది. సంఘములోనున్న సభ్యుని వాటా ధనము లేదా డిపాజిట్టును లేదా మరి ఏ ఇతర మొత్తమునైనను పూర్తిగా గాని, కొంతగాని సంఘము నకు రావలసిన బాకీకి మినహయించుకొనుటకు సంఘమునకు హక్కు కలదు.* ఏ సభ్యుడయిన సొసైటీకి[...]