00:00
- 1. మన రాష్ట్రంలో వీటిలో అనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస మరియు బూడిద గుమ్మడి ముఖ్యంగా సాగుచేస్తారు. వీటికి వేడి వాతావరణం అనుకూలమైనది. నీటిని నిలుపుకొనే తేలికపాటి బంకమట్టినేలలు, బరువైన ఎర్రనేలలు బాగా అనుకూలమైనవి.
- 2. విత్తే సమయం:అనప, దోస, కాకరలకు విత్తేసమయం జూన్ - జూలై చివరి వరకు మరియు జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు ఉంటుంది.గుమ్మడి, పొట్లలకు విత్తేసమయం జూన్ - జూలై మరియు డిసెంబరు - జనవరి చివరి వరకు ఉంటుంది.
- 3. బీర, బూడిద గుమ్మడిలకు విత్తేసమయం జూన్ నుండి ఆగష్టు మొదటి పక్షం మరియు డిసెంబరు రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు నాటుకోవచ్చు.దొండకు విత్తే సమయం జూన్ - జూలై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరమంతా నాటుకోవచ్చు.
- 4. విత్తనం మరియు విత్తేపద్ధతి:భూమి మీద పాకించే పాదులకు, వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగు నీరు పోవటానికి 2 మీ. దూరంలో కాలువలు చేయాలి. వేసవిలో వేసే పాదులకు పొలం అంతటా నీటి పారుదల కొరకుబోదెలను చేయాలి. అన్ని రకాల పాదులకు 3 విత్తనాలను 1-2 సెం.మీ లోతులో విత్తుకోవాలి.
- 5. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగ జాతి కూరగాయలను వర్షాధార పంటకు 150 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం గల పాలిథీన్ సంచుల్లో విత్తుకొని 15-20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకొని పొలంలో నాటుకోవాలి.
- 6. విత్తనశుద్ధి:కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున ధైరమ్ మరియు 5 గ్రా. చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 100 గ్రా. ల విత్తనానికి 2 గ్రా. ల చొప్పున ట్రైకోడెర్యా విరిడి తో విత్తన శుద్ధి చేసి విత్తనం వేయాలి.
- 7. ఎరువులు: విత్తే ముందు పశువుల ఎరువు, భాస్వరం, పొటాష్ నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. నత్రజనిని రెండు సమపాళ్ళుగా చేసి విత్తిన 25-30 రోజులకు మరియు పూత పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువును వేయకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి.
- 8. కలుపు, నివారణ, అంతరకృషి:కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2-3 తడుల తర్వాత మట్టిని గుల్లచేయాలి. ఎకరాకు 1.2 లీ పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటికి కలిపి విత్తనం వేసిన 24-48 గంటలలోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కకు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రా. బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది.
- 9. సి.సి.సి 250 మి.గ్రా. లేదా మాలిక్ హైడ్రజన్ 50 మి.గ్రా లీటరు నీటికి కలిపి కూడా 2-4 ఆకుల దశలో పిచికారీ చేయవచ్చు. కాకర, పొట్ల పంటలను తప్పనిసరిగా పందిరి వేసి, తీగలు పాకించాలి లేకపొతే పండు ఈగ బెడద ఎక్కువగా ఉంటుంది.
- 10. పొట్లలో 3-4 రోజుల పిందెకు చివర చిన్నరాయిని పురికొసతో కట్టాలి లేకుంటే కాయలు మెలి తిరుగు తాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి, మంచి మార్కెట్ రేటు లభిస్తుంది.
- 11. గింజ విత్తేముందు పొలంలో నీరు పెట్టాలి. ఆ తర్వాత ప్రతి 3-4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదుచుట్టూ 3-5 సెం.మీ మందం మట్టి ఎండినట్లుగా ఉన్నపుడు నీరు ఇవ్వాలి. మామూలుగా వారానికి ఒకసారి చొప్పున తడులు ఇవ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదుచుట్టూ నిలువ ఉండకూడదు. వేసవి పంటలకు నాలుగైదు రోజులకొకసారి నీరు ఇవ్వాలి.
- 12. సస్యరక్షణ పురుగులుగుమ్మడి పెంకు పురుగులు: తీవ్ర దశలో ఆకులను, పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగజేస్తాయి. దీని నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లేదా మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి చల్లాలి.
- 13. పొట్ల ఆకుపురుగు: గొంగళి పురుగులు పంట పెరుగుదల దశలో మరియు పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ లేదా క్వినాల్ఫాస్ 2 మి.లీ థయోడికార్బ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పూతకు ముందు దశలో చల్లాలి.
- 14. పండు ఈగ:ఇవి కాయలను తిని నష్టపరుస్తాయి. దీని నివారణకు పూత, పిందె దశలో మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. 100 మి.లీ మలాథీయాన్ + 100 గ్రా. చక్కెర లేదా బెల్లం పాకం లీటరు నీటిలో కలిపి మట్టి ప్రమిదుల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి.
- 15. తెగుళ్ళు:బూజు తెగులు: ఒక మాదిరి వర్షంతో కూడుకొన్న చల్లని వాతావరణంలో ఆశిస్తుంది. తర్వాత ఆకులకు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా మెటలాక్సిల్ ఎమ్.జడ్ 2 గ్రా. ల లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- 16. బూడిద తెగులు: ఆకుల పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న మచ్చలు ఏర్పడి తర్వాత తెల్లని పొడివంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. లేత ఆకుల కన్నా, దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు 1 మి.లీ ట్రైడిమార్ఫ్ లేదా 1 మి.లీ డైనోకాప్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- 17. ప్యుజేరియం వేరుకుళ్ళు తెగులు:దీన్ని ఎండుతెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన తీగలు వడలిపోయి ఆకస్మాత్తుగా ఎండి పోతాయి. ఆకులు వాడిపోతాయి. నివారణకు బోర్డోమిశ్రమము 1% లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రా. చొప్పున కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిచేలా పదిరోజుల వ్యవధి లో 2-3 సార్లు పోయాలి.
- 18. ఈ శిలీంధ్రం భూమిలో వుంటుంది కనుక పంటమార్పిడి చేయాలి. ఆఖరి దుక్కిలో వేపపిండి 250 కిలోలు/ ఎకరాకు వేసి కలియదున్నాలి. పంటవేసిన తర్వాత ట్రైకోడెర్మా విరిడి కల్చర్ ను పశువుల ఎరువులో అభివృద్ధి చేసి భూమిలో పాదుల దగ్గర వేయాలి.
- 19. ఆకుల ఈనెల మధ్య మందంగా చారలు ఏర్పడి, పెళుపుగా మారి, గిడసబారిపోయి, పూత, పిందె ఆగిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులుఉన వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను లీటరు నీటికి 2 మి.లీ చొప్పున డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేయాలి.
- 20. ఆకులపై, కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి, ఎండి రాలిపోతాయి. పిందె దశలో రాలిపోతాయి. దీని నివారణకు తెగులును గమనించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బెండజిమ్ 1 గ్రా. లేదా కార్బెండజిమ్, మాంకోజెబ్ కలిపిన మిశ్రమమును 2 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు పిచికారీ చేయాలి.
- 21. మిథైల్ యూజినాల్ + వెనిగార్ + పంచదార ద్రావణం 10 మి.లీ చొప్పున కలిపి 10 ఎరలు ఎకరానికి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించాలి లేదా 100 మి.లీ మలాథియాన్ + 100 గ్రా. బెల్లం 10 లీ. నీటి లో కలిపి మట్టి ప్రమిదల్లో అక్కడక్కడ పొలంలో వుంచాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- 22.100 గ్రా.ల విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి 2 గ్రా. చొప్పున వాడి విత్తనశుద్ధి చేయాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
- 23. పెంకు పురుగల నివారణకు ధయోడికార్బ్ 1 గ్రా. లేదా క్లోరిపైరిఫాస్ లీటరు నీటికి 2 మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు డైనోక్యాప్ 1 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. నులిపురుగుల బెడద ఉన్నచోట కార్బోసల్ఫాన్ 3 గ్రా. ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. పాదులలో వేపపిండి వేసుకోవాలి.
- 24. తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు / తెగులు మందులు వాడరాదు. దీని వలన ఆకులు మాడిపోతాయి.
- 25. ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి. పంటమార్పిడి చేయాలి (జొన్న, మొక్కజొన్నతో)
- 26. బూడిద గుమ్మడిని ఎకరాకు విత్తనమోతాదు 2.0 నుండి 2.8 కిలోల చొప్పున ఉండి, రెండు వరుసల ఉండేటట్లు విత్తుకోవాలి. మధ్య దూరం 3.0
- 27. మంచి గుమ్మడిని ఎకరాకు విత్తనమోతాదు 1.0 నుండి 1.5 కిలోల చొప్పున ఉండి, రెండు వరుసల ఉండేటట్లు విత్తుకోవాలి. మధ్య దూరం 3.0
- 28. సారకి ఎకరాకు విత్తనమోతాదు 1.2 నుండి 1.6 కిలోల చొప్పున ఉండి, రెండు వరుసల మధ్య దూరం వేసవిలో అయితే 2.5, ఖరీఫ్ లో అయితే 3.0 ఉండేటట్లు విత్తుకోవాలి.
- 29. కాకరకి ఎకరాకు విత్తనమోతాదు 1.8 నుండి 2.4 కిలోల చొప్పున ఉండి, రెండు వరుసల మధ్య దూరం వేసవిలో అయితే 1.5, ఖరీఫ్లో అయితే 2.5 ఉండేటట్లు విత్తుకోవాలి.
- 30. బీర కి ఎకరాకు విత్తనమోతాదు 0.6 నుండి 0.8 కిలోల చొప్పున ఉండి, రెండు వరుసల మధ్య దూరం వేసవిలో అయితే 2.0, ఖరీఫ్ లో అయితే 2.5 ఉండేటట్లు విత్తుకోవాలి.
- 31. కూరదోసకి ఎకరాకు విత్తనమోతాదు 1.0 నుండి 1.4 కిలోల చొప్పున ఉండి, రెండు వరుసల మధ్య దూరం వేసవిలో అయితే 1.0, ఖరీఫ్ లో అయితే 1.5 ఉండేటట్లు విత్తుకోవాలి.
- 32. పచ్చిదోస కీరదోసకి ఎకరాకు విత్తనమోతాదు 1.0 నుండి 1.4 కిలోల చొప్పున ఉండి, రెండు వరుసల మధ్య దూరం వేసవిలో అయితే 1.5, ఖరీఫ్ లో అయితే 2.5 ఉండేటట్లు విత్తుకోవాలి.
- 33. పొట్ల కి ఎకరాకు విత్తనమోతాదు 0.6 నుండి 0.8 కిలోల చొప్పున ఉండి, రెండు వరుసల మధ్య దూరం 2.0 ఉండేటట్లు విత్తుకోవాలి.
- 34. దొండకాయికి ఎకరాకు విత్తనమోతాదు చూపుడు వేలు మందం కలిగి 4 కణుపులు కలిగిన కాండపు ముక్కలు పాదుకు 2 చొప్పున ఎకరాకు 1333 - 2000, రెండు వరుసల మధ్య దూరం 2.0 ఉండేటట్లు విత్తుకోవాలి.