Search
Close this search box.

క్రెడిట్ మేనేజెమెంట్

album-art
00:00
  • 1. సంఘంలో అప్పుదారుల సభ్యత్వం పెంచడమెలా?సంఘంలో సభ్యుల జాబితా ఆధారంగా, సంఘ పరిధిలోని సభ్యత్వము లేని వారిని గుర్తించాలి. ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమమును చేపట్టాలి. గ్రామ సభలు నిర్వహించడం ద్వారా, స్వయంగా సంప్రదించడం ద్వారా, సంఘ సభ్యులకు అందించే సేవలన వివరించడం ద్వారా సభ్యత్వ నమోదు వారము లేదా మాసం అనుసరించడం ద్వారా సంఘంలో సభ్యులు కాని వారిని సంఘ సభ్యులుగా చేరుటకు ఉత్తేజపరచవలెను. స్వయం సేవక సంఘాల సభ్యులుగా చేర్చుకొని అట్టి సంఘాలకు[...]
  • 2. పరపతేతర వ్యాపారంసంఘంలో సభ్యులకు పరపతి వితరణతో పాటు పరపతేతర సేవలను కూడా అందించాలి. పరపతేతర సేవలలో భాగంగా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు సభ్యులు కొనగోలు చేయుటకుసంఘం తన వ్యాపారాన్ని వికేంద్రీకరించాలి. వికేంద్రీకరణలో భాగంగా విత్తనాలు శుద్ధి చేసే యంత్రాలను స్థాపించడం, బియ్యం మరలు వంటివినెలకొల్పడ పవర్ టిల్లర్స్, డస్టర్స్, స్ప్రేయర్లు ట్రేషర్స్ వంటివిఅద్దెకిచ్చి వ్యాపారాన్ని కూడా సంఘం చేపట్టాలి. సభ్యులు తమ పంటని నిల్వ చేసికొనడానికి గిడ్డంగి నిర్మాణం చేసి సభ్యులకు అందజేయ[...]
  • 3. నాన్ ఫండ్ వ్యాపారంఎట్టి పెట్టుబడి లేకుండా చేసే వ్వాపారాన్ని నాన్ ఫండ్ వ్యాపారం అంటారు. సంఘం ఇన్సూరెన్స్ ఏజంటుగా ఉండడం నాన్ ఫండ్ వ్యాపారానికి ఉదాహరణగా చెప్పవచ్చును. బిజినెస్ ఫెసిలిటేటరు గా, బిజినెస్ కరస్పాండెట్ గా ఉంటూ సభ్యులకు అనేక రకములైన సేవలను అందించి ధనార్జన చేయవచ్చును. ఇట్టిసేవలు అందించుటకు కేవలం ఒక రూపాయి పెట్టుబడి పెట్టవలసిన అవసరంలేదు. వాణిజ్య బ్యాంకుల ద్వారా సభ్యులకు వసూళు చెయ్యడం, ఋణ సదుపాయం కలిగించడం, ఋణ దరఖాస్తులతో జతపరచవలసిన[...]
  • 4. పరపతీతర వ్యాపారం - అవశ్యకతసంఘాలలో పరపతి వ్యాపార అవకాశాలు పతాక స్థాయికి చేరాయి అని చెప్పవచ్చును. చాలా బ్యాంకులు పరపతి సదుపాయాన్ని రైతాంగానికి కల్పిస్తూ పోటీ పడుతున్నాయి . ఇందు వల్ల పరపతి వ్యాపారంలో లాభదాయకత సన్నగిల్లుతున్నది. అందుచేత పరపతీతర వ్యాపార అవకాశాన్ని సంఘాలు ఎంచుకొని తమ లాభదాయకతను పెంపొందింపచేసికొనవలెను. ప్రాథమిక వ్యవసాయ సంఘాన్ని " వన్ స్టాప్ షాప్ " గా మార్చవలసిన అవసరమున్నది. నాణ్యమైన సేవలను, సరసమైన ధరలకు సంఘాలు అందించాలి. పరపతీతర[...]
  • 5. వనరుల సమీకరణపి ఎ సి ఎ స్ కు వనరులు సభ్యులనుండి వాటాధనం రూపంలో, డిపాజిట్ల రూపంలో మరియు పై స్థాయి ఆర్థికసంస్థనుండి అప్పుల రూపంలో సమకూర్చుకుంటుంది. దీనితో పాటు నికరలాభం ఆర్జించడం ద్వారా వనరులను సమకూర్చుకొని వాటిని మరల వ్యాపారానికి వినియోగించుకుంటాయి.వనరులను సమాకరించుకొనవలసిన అవసరం పి.ఎ.సి.యస్ లు తమ ఆర్థిక అవసరాలు తీర్చుటకు అవసరమగు వనరుల కై జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పై ఆధార పడతాయి. బ్యాంకు మంజూరు చేసే ఋణం సభ్యుల[...]
  • 6. వ్యాపారాభివృద్ధి ప్రణాళికసభ్యుల యొక్క ఆర్థిక ప్రయోజనాలను పెంచేందుకు ఏర్పాటు చేయబడిన వ్యాపారసంస్థ PACS. సభ్యులకు ఉత్పన్నమయ్యే అవసరాలను తీర్చుటకు, కొత్త ఉత్పత్తులను మరియు సేవలను ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. అలా చేసినట్లయితే వ్యాపారం వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అందుకు అవసరమగు వనరులను అంచనావేసి సమీకరించు కోవాలి. ఈ కార్య కలాపాలన్ని ఒక క్రమపద్ధతిలో ఏకకాలంలో జరగాలంటే పూర్తి వివరాలను అనగా చేపట్టవలసిన కార్యకలాపాలు, వనరుల సమీకరణకు ఉపయోగించే పద్ధతులు మరియు వ్యాపార కార్యకలాపాల అమలు,అంచనా[...]
  • 7. లాభ ప్రణాళికలో మానవ వనరుల పాత్రసంఘము తన లక్ష్యసాధనలో భాగంగా లాభాన్ని ఆర్జించాలంటే, సంఘములో పనిచేస్తున్న సిబ్బంది మరియు పాలకవర్గ సహకారం ఎంతైనా అవసరం. సంఘంలో విధులను నిర్వహించే వారంతా ముఖ్య నిర్వహణాధికారితో బాటు లాభ ప్రణాళికలోని ముఖ్యాంశాలపై దృష్టి సారించి, వాటి సాధనకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. అప్పులు, అడ్వాన్సులు ఇచ్చుట, నూతన ఉత్పత్తులు, వ్వాపార అవకాశాలు, నిధుల నిర్వహణలాంటి సమస్యాత్మకమైన అంశాలపై పాలక వర్గ సభ్యులతో కలిసి, చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది[...]
  • 8. ఋణ వివిధీకరణ - ఆవశ్యకతసాధారణంగా PACS అందజేసే రుణాలలో 90% పైగా పంట రుణాలకు ఇవ్వడం జరుగుతుంది. భారీ అవకాశాలు వేరే రంగాలలో ఉండగా, పరపతిని వివిధీకరించి, రిస్క్ ను తగ్గించకుంటే ద్రవ్యకొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేగాకుండా వ్యవసాయ రుణాలపై మార్జిన్ కూడా తక్కువ. అందువలన రుణ వివిధీకరణ తప్పనిసరి. దానివలన అనేక ప్రయోజనాలు కలవు. ముఖ్యంగా సభ్యులఅనేక అవసరాలు తీర్చడానికి వ్యాపారాభివృద్ధికి సభ్యులకు మరెన్నో సేవలు అందించడానికి విభిన్న ఆదాయ వనరులను ఉత్పత్తి[...]
  • 9. PACS and its objectivesప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము 10 మంది కన్నా తక్కువకాని, అదే గ్రామంలోకాని లేక సమీప గ్రామంలో కాని, నివశిస్తున్న రైతుల సమూహంతో ఏర్పాటు చెయ్య బడుతుంది. ఇది స్వేచ్ఛాపూరితంగా ఏర్పాటు చేసుకున్న స్వయంప్రతిపత్తి వుత్పత్తి కలిగిన సంఘం. సభ్యుల యొక్క ఆర్థిక సామాజిక మరియు సాంస్కృతిక అవసరాలు మరియు ఆకాంక్షాలను తీర్చడానికి ఏర్పాటు చేసిన సంస్థ.. ప్యాక్ గ్రాస్ట్రూట్ స్థాయిలో సభ్యులతో ప్రత్యేక సంబంధం కలిగి ఉంటుంది. చాలావరకు సన్న[...]
  • 10. మూలధనాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చుసభ్యత్వాన్ని మరియు రుణాలు తీసుకునేవారి సభ్యత్వాన్ని పెంచుటద్వారా, స్వయంభరణ శక్తిగల సంస్థగా రూపొందించాలంటే, సంఘం సభ్యులను సమీకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం సంఘం సభ్యత్వాన్ని సమీక్షింంచి గ్రామంలోని చిన్న మరియు సన్న కారు రైతులు, మౌఖిక ఖాతాదారులు, వ్యవసాయ కూలీలు, కళాకారులు, చిన్న వ్యాపారులు, SHGs JLGs మొదలగు వారందరినీ సంస్థకు సభ్యులు నామమాత్రపు సభ్యులుగా చేర్చి, సంస్థయొక్క సేవలను వినియోగించుకునే విధంగా చెయ్యాలి. దీనిమూలంగా అప్పులు తీసుకునే సభ్యుల[...]
  • 11. R.O. Water Plantఆర్.ఓ. వాటర్ ప్లాంటు నిర్మాణానికి సంబందించిన అవశ్యకత ఖర్చు నిధుల సమీకరణ మొదలగు అంశాలు పాలకవర్గ సమావేశంలో చర్చించి వాటర్ ప్లాంట్ నిర్మించి నిర్వహించుట కు తీర్మానం తీసుకోవాలి. వాటర్ ప్లాంటు నిర్మాణానికి ( డి.పి.ఆర్ ) డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారుచేసుకోవాలి. వాటర్ ప్లాంటు నిర్మాణానికి మండల కేంద్రాలలో ఉన్న భూగర్భ వనరుల శాఖనుండి అవసరమైన అనుమతులు తీసికోవాలి. ముఖ్యంగా మన ప్లాంటులోని నీరు త్రాగు నీరుగా ఉపయోగించవచ్చునన్న సర్టిఫికేట్ భూగర్భ[...]
  • 12. గోడౌనుల నిర్మాణంగిడ్డంగుల నిర్మాణ అవశ్యకత పాలకవర్గ సమావేశంలో చర్చించి, నిర్మాణమునకు అగు ఖర్చు, అట్టి ఖర్చును భరించుటకు అవసరమగు ఆర్థిక వనరులను సమకూర్చుకొను విషయం పై తీర్మనం వ్రాయవలెను. గోదాముల నిర్మాణానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ( డి.పి.ఆర్ ) తయారు చేసుకొనవలెను. గిడ్డంగుల నిర్మాణానికి సంఘమునుండి తగు మంజూరు పొందాలి. గోదాములో నిల్వ చేసిన సరుకు సురక్షితంగా ఉండే విధంగా తగుచర్యలు తీసికొనాలి. బ్యాంకు ఋణం తీసుకొనదలచిన డి.పి.ఆర్ తో పాటు బ్యాంకు వారు[...]
  • 13. పెట్రోల్ బంక్ల ఏర్పాటుపెట్రోల్ బంక్ నిర్మాణ అవశ్యకత నిర్మాణశ్యయము అట్టి వ్యయమును భరించుటకు అవసరమగు ఆర్థిక వనరులను సమకూర్చుకొను విషయాలపై తీర్మనము వ్రాయవలెను. పెట్రోల్ బంక్ స్థాపనకు హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలలో ఏదైనా సంస్థనుండి ప్రాంచైస్ లేదా డీలర్ షిప్ సంఘంపొంది ఉండవలెను. సంఘం పెట్రోల్ బంక్ స్థాపనకు ఒక డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు ( డి.పి.ఆర్) ను తయారు చేసుకొనవలెను. పెట్రోల్ బంక్ స్థాపనలో సంఘం ఒక రూమ్, ప్రహరీ గోడ నిర్మాణం చేయాలి.[...]
  • 14. స్వల్పకాలిక రుణాలను పెంచుటకు వ్యూహాలు :సంఘం తమ పరిధిలో ఉన్న సంఘ సభ్యులకు స్వల్పకాలిక రుణాల ద్వారా పంట ఋణములు అందజేయుచున్నవి. ఈ రుణపరపతి విస్తృత పరచుకొనవలెనన్న సంఘం కొన్ని వ్యూహాలు అమలు చేయవలసివున్నది. అందులో ముఖ్యంగా - వివిధ విభాగములలో సభ్యులయొక్క పరపతి అవసరాలను తయారుచేసుకోవాలి. కాలాల వారీగా అవసరమయ్యే పరపతి వివరాలను తయారుచేసుకోవాలి. సంఘం పరిధిలోని ఆర్థిక స్థితిని సర్వే చేయాలి. సంఘం తన యొక్క పరిధిలోని చేతివృత్తుల వారు, చేనేత కార్మికులు,[...]
  • 15. లాభార్జన ప్రణాళిక ( Profit Planning )ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సభ్యులకు అవసరమైన సేవలు అందించవలెనన్న లాభార్జనతో పనిచేయవలసిన అవసరం ఉన్నది. లాభార్జన అనేది ఆకస్మికంగారాదు. దానికి క్రమ బద్ధమైన ప్రణాళిక అవసరం. లాభార్జన ప్రణాళిక లో గమనించవలసిన ముఖ్యాంశాలు : వనరుల సేకరణ మరియు నిర్వహణ వ్యాపారాభివృద్ధి - పరపతి మరియు పరపతేతర కార్యక్రమాలు నిధుల నిర్వహణ - వృధా నిల్వలను తగ్గించుకొని, ఉన్ననిధులను లాభాలు వచ్చేలా వినియోగించుకోవడం నిధులు అవసరంలేని వ్యాపారం[...]
  • 16. నెగోషియబుల్ గిడ్డంగి రశీదుపై అప్పు పొందుటకు మార్గ దర్శకాలునెగోషియబుల్ గిడ్డంగి రశీదుపై అప్పు పొందవలెనన్న కిసాన్ క్రెడిట్ కార్డు కలిగిన చిన్న లేదా సన్న కారు రైతు అయి ఉండవలెను.ప్రభుత్వరంగ బ్యాంకు లేదా గ్రామీణ బ్యాంకు లేదా సహకార సంఘముల నుండి పంట ఋణం పొంది ఉండవలెను.అప్పు మొత్తము గరిష్టంగా మూడు లక్షల వరకు పంటవిలువలో 75 శాతము వరకు ప్రస్తుతము ఉన్న మార్కెటు ధర లేదా ప్రభుత్వ కనీస మద్ధతు ధర, ఏది తక్కువైతే[...]
  • 17. నెగోషియబుల్ గిడ్డంగి రశీదు - ప్రయోజనములు 2011 లో ప్రారంభించబడిన నెగోషియబుల్ గిడ్డంగి రశీదు, భౌతికంగా సరుకును డెలివర్ చెయ్యకుండా, గిడ్డంగిలో నిల్వచేసిన సరుకు యొక్క యాజమాన్నాన్ని బదిలీ చెయ్యడానికి అనుమ తిస్తుంది. ఈ రశీదులు నెగోషియబుల్ రూపంలో జారీచేయబడతాయి మరియు రుణం కోసం కొల్లేటరల్ గా ఉపయోగపడతాయి. ఏ గిడ్డంగిలో సరుకు నిల్వ ఉంచుతారో ఆ గిడ్డంగి Bureau of Indian Standards / FCI CWC సూచించిన స్పెషిఫికేషన్ కు లోబడి నిర్మించి,[...]
  • 19. విత్తనముల వ్యాపారం PACS యొక్క ఉద్దేశం సంఘం పరిధిలోని రైతులకు కావలసిన మేలు రకములైన విత్తనాలు సకాలంలో అందించి అధికోత్పత్తి సాధించుటకు మరియు సంఘమునకు లాభము చేకూర్చుటకు దోహదపడుట. సంఘ పరిధిలోని సాగు భూమికి కావలసిన విత్తన పరిమాణమును అంచనా వేయుటకు సంఘ పరిధిలోని సాగు భూమిని, నేల రకమును, సాగునీటి వసతి, పంటల వివరములు మరియు పంట వేయుకాలము - రబీ, ఖరీప్ మున్నగు విషయములు తెలుసుకొనవలెను. విత్తనాల వ్యాపారం చేయవలెనన్న బోర్డు ఆమోదంతో[...]
  • 21. KCC ఋణము తీసుకొనుటకు అర్హతప్రాథమిక సహకార సంఘ పరిధిలో నివాసమున్న ఏ రైతైనా ఋణము తీసుకొను ఉద్ధేశ్యముతో సంఘములో “ A"క్లాసు సభ్యుడుగా చేరవచ్చును. సభ్యునిగా చేరడానికి వాటా ధనము చెల్లించవలెను. తదుపరి పాలకవర్గం ఆ సభ్యత్వాన్ని అంగీకరించ వలసివుంటుంది. బైలా లో ఉదహరించిన విధంగా అతనికి వ్యవసాయ భూమి ఉండవలెను. భూమిపై సర్వ హక్కులు తనకు గలవని దృవీకరిస్తూ SRA ఆఫీసునుండి లేదా మీసేవ నుండి EC 13 సంవత్సరముల వరకు తీసుకురావలెను. అప్లికేషన్[...]
  • 22. PACS as a Business Entityవ్యాపార సంస్థగా పిఎసియస్ ప్రస్తుత ఆర్థిక దశలో ఒక సంస్థ తన స్వంత కాళ్ళపై నిలబడి నిలదొక్కుకోగలిగితే తప్ప తన సభ్యులకు సేవలను అందించగలిగే స్థితిలో ఉండదు. పియసిఎస్ తన సభ్యులకు అవసరమైన సేవలతో పాటు డిపాజిట్ల సేకరణ మరియు పరపతిని అందించుటకు ఏర్పాటు చేయబడ్డ ఒక విలక్షణమైన సంస్థ. ఒక సంస్థ నిలదొక్కుకోవాలంటే ప్రతి సంవత్సరం లాభాలను ఆర్జించాలి. తమ సభ్యులకు సమర్ధవంతంగా సేవలు అందించాలన్నా, పోటీ తత్వాన్నీ[...]
  • 23. ఎరువుల వ్యాపారంసంఘ పరిధిలోని రైతులకు నాణ్యమైన మరియు ఖచ్చితమైన తూకము కలిగిన ఎరువులు సకాలంలో సరసమైన ధరలకు అందించి అధికోత్పత్తికి తోడ్పడుట సంఘ లక్ష్యం. తద్వారా సభ్యునికి లాభాన్ని చేకూర్చడంతో పాటు, సంఘం యొక్క వ్యాపార పరిధిని పెంచి అధిక లాభాన్ని ఆర్జించవలెనన్న ద్యేయంతో సంఘాలు పనిచేయవలెను.ఎరువుల వ్యాపారం చేయవలెనన్న సంఘం బోర్డు ఆమోదంతో పాటు వ్యవసాయ శాఖనుండి రూ॥ 3500 చలానా ద్వారా చెల్లించి, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా లైసెన్సు పొందవలెను. ఈ లైసెన్సు[...]
  • 24. పంటభీమా మరియు వ్యక్తిగత ప్రమాద భీమాపంటభీమా పధకము పండించే పంటల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించిన E - panta పోర్టల్ లో నమోదు చేయవలయును. సభ్యుడు తాను పండించే పంట వివరాలు రైతు భరోసా కేంద్రంలో నమోదు అయ్యేవిధంగా చూడవలెను. రుణం మంజూరు చేసిన జాబితా యొక్క కాపీని స్థానికవ్యవసాయ అధికారికి కూడా సమర్పించవలసి ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి చట్టపర ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేవిధంగా తప్పని సరిగా E-panta పోర్టట్ లో భీమా నమోదు[...]
  • 25. KCC ఋణం మంజూరు కొరకు అవసరమైన డాక్యుమెంట్లు పూర్తిగా నింపబడిన, నిర్ధేశించిన అప్లికేషన్ పత్రం పట్టాదారు పాసు పుస్తకము టైటిల్ డీడ్ రిజిష్టర్ డాక్యుమెంట్స్కు సంభందించిన 13 సంవత్సరముల లింక్ డాక్యుమెంట్స్ భూమి కిస్తు రసీదు ఎన్కంబ్రెన్స్ సటిఫికేట్ - 13 సంవత్సరముల క్రితం నుండి ప్రామిసరీ నోట్ డిక్లరేషన్ రూల్ 13 ఆఫ్ ఎ.పి. లాండ్ రిపార్డ్స్ రూల్స్ 1974 చార్జ్ డిక్లరేషన్ కొత్త సభ్యుడైనట్లయితే ID ప్రూప్, అడ్రస్ ప్రూప్ ఇతర ఆర్థిక[...]
  • 26. KCC cum Pass bookప్రతి సభ్యునికి KCC cum Pass book తప్పనిసరిగా ఇవ్వవలెను. అందులో అతని యొక్క భూమి వివరాలు, సర్వే నెంబర్, సాగుభూమి, మెరక, పల్లం, ఏ గ్రామంలో ఉన్నదీ అన్న వివరాలు తప్పక నమోదు చేయాలి. ప్రతి జమ, చెల్లింపులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వడంతో పాటు పాస్బుక్ లో నమోదు చేయవలెను. పాస్బుక్ లో నమెదు చేసిన అన్ని ఎంట్రీలను ధృవీకరించ వలసిన బాధ్యత రుణగ్రహీతకు ఉంది. డిక్లరేషన్, మార్టేజ్ లో[...]
  • 27. Rate of interest & repayment of KCC loanప్రాథమికంగా సభ్యునికి మంజూరు చేస్తున్న పంట ఋణము రూ॥ 3 లక్షల వరకు 7% వడ్డీ రేటు కలిగిఉంటుంది. జిల్లా బ్యాంకు నుండి సంఘానికి 5.65% నుండి 5.75% వరకు పంట ఋణాలపై వడ్డీ నిర్ణయించబడినది. అంతిమంగా రైతుకు మాత్రం 7% వడ్డీకి ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడే కేంద్ర ప్రభుత్వ వడ్డీ సబ్వెన్షన్ (2%) మరియు ఇన్సెంటివ్ సబ్వెన్షన్ (3%) కూడా ఆ రుణానికి వర్తిస్తాయి.సంఘ[...]
  • 28. Classification of KCC as NPAకెసిసి రుణాలకు కూడా రిజర్వుబ్యాంకు, నాబార్డు వారిచే నిర్దేశించిన ప్రుడెన్షియల్ నిబంధనలు వర్తించును.స్వల్పకాలిక పంటలకు మంజూరు చేయబడిన ఒక రుణానికి సంబంధించిన అసలు కంతు (instalment ) కాని, దానిపై రావలసిన వడ్డీ గాని గడువు తేదీ దాటి రెండు పంట సీజన్ల వరకు చెల్లించబడని పక్షంలో ఆ రుణం నిరర్ధక ఆస్తిగా పరిగణించబడుతుంది.దీర్ఘకాలిక పంటలకు మంజూరు చేయబడిన ఒక రుణానికి సంభందించిన అసలు కంతు కాని, దానిపై రావలసిన[...]
  • 29. స్పల్పకాలిక ఋణాలు ( ఇతరాలు )పంట ఋణాలతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా స్వల్పకాలిక ఋణాలను పంపిణీ చేయవచ్చును. అట్టి వానిలో వ్యవసాయ మరియు అనుబంధ కార్యక్రమాలు పంటల మార్కెటింగ్ పారిశ్రామిక సహకార సంఘాలకు 22 రకాల ఆమోదిత కుటీర, గ్రామ చిన్న తరహా పరిశ్రమలకు చేతివృత్తి వారలకు, చేనేత కార్మికులకు, మత్స్య పరిశ్రమకు ఎరువులు, పురుగుమందులు కొనగోలు చేసి, నిల్వ చేసి పంపిణీ చేయుట వంటి కార్యకలాపాలకు ఈ ఋణాలను సభ్యులకు అందజేయవచ్చును. పంటను[...]
  • 30. దీర్ఘకాలిక పరపతి - ఋణ వితరణ లో ప్రాథమిక అవసరాలుసహకార వ్యవస్థ పునర్వ్యవస్థీకరించిన తరువాత, ఉత్పత్తి మరియు పెట్టుబడి క్రెడిట్ రెండింటినీ సహకార సంంఘ సభ్యుల అవసరాలు తీర్చే విధంగా ప్యాక్స్ అందజేస్తున్నాయి. దీర్ఘకాలిక రుణాలు అస్తులను సృష్టించడంతో పాటు, మూలధన నిర్మాణానికి సహాయపడుతుంది. ఒకే సంఘంనుండి సభ్యుల క్రెడిట్ అవసరాలు తీర్చడం చాల ప్రయోజన కరంగా ఉన్నది. దీర్ఘకాలిక రుణం అందించేటప్పుడు PACS అనుసరించవలసిన ప్రాథమిక అవసరాలను నాలుగు దశలుగా విభజించవచ్చును. సభ్యత్వం మరియు[...]
  • 34. మల్టీ సర్వీస్ సెంటర్లుగా ప్యాక్స్సంఘ సభ్యుల అవసరాలు తీర్చుతూ వారికి ఆర్థిక ప్రయోజనం మరింత సమకూర్చుతూ సంఘం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. వ్యవసాయ ఋణాల వితరణ పతాకస్థాయికి చేరుకొనడం, మార్జిన్స్ సన్న గిల్లుతున్న నేపధ్యంలో మల్టీ సర్వీసు సెంటర్లుగా కూడా ప్యాక్స్ రూపాంతరం చెందాలి. సాంప్రదాయ వ్యాపారాలు చేస్తూ అధునాతన వ్యాపారాలపై కూడా దృష్టి సారించాలి.గోడౌన్ల నిర్మాణం, రైస్ మిల్లులు, పెట్రోల్ బంక్లు, పాల సేకరణ కేంద్రాలు, ఆర్.ఓ.వాటర్ ప్లాంట్స్, పశువుల దాణా మిక్సింగ్ ప్లాంట్స్, గ్యాస్[...]
  • 36. దీర్ఘకాలిక ఋణములు పొందుటకు అర్హతలు రాబోయే ఆర్థిక సంవత్సరములు అనగా 2021 - 22 లో నాబార్డు నుండి రీఫైనాన్స్ పొందవలెనన్న, 31.3.2020 నాటికి CRAR 9% మించి ఉండాలి. 2019-20 సంవత్సరానికి ఆడిట్ పూర్తయి ' ఎ ' లేదా ' బి ' క్లాసిఫికేషన్ లో ఉండాలి. నికర ఋణములు మరియు అడ్వాన్స్ల నిల్వపై నికర నిరర్ధక ఆస్తులు 12% మించకుండాపూడి ఉండాలి. గత మూడు సంవత్సరములలో 2 ఆర్థిక సంవత్సరములలో నికర[...]
  • భూమి అభివృద్ధి చిన్న మరియు సూక్ష్మ నీటిపారుదల నీటి పొదుపు మరియు నీటి సంరక్షణా పధకాలు మత్య్స మరియు పశుసంరక్షణ వ్యర్థ భూమి అభివృద్ధి Dry land వ్యవసాయం కాంట్రాక్ట్ వ్యవసాయం ప్రాంత అభివృద్ధి పధకాలు తోటల పెంపకం మరియు హార్టికల్చర్ కూరగాయలు మరియు పండ్ల ఉత్పాదకత పెంచడానికి ఖచ్చితమైన వ్యవసాయం విత్తనోత్పత్తి స్యూ కల్చర్ వ్యవసాయ మార్కెటింగ్ సదుపాయాలు వ్యవసాయ పనిముట్లు సాంప్రదాయేతర శక్తి వనరులు వాటర్ షెడ్ మరియు గిరిజన అభివృద్ధి కార్యక్రమాలకు ఫైనాన్సింగ్[...]
  • 38. దీర్ఘకాలిక రుణాల మంజూరు మరియు పంపిణీ కొరకు నిర్దేశించిన కాలపరిమితిరుణ మంజూరు మరియు పంపిణీ కొరకు కాలపరిమితి రెండు లక్షల రూపాయల వరకు మరియు రెండు లక్షల పై మొత్తానికి విడివిడిగా నిర్దేశించబడినది. ఋణ ధరఖాస్తు పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ తో సహా అందినట్లయితే - ప్రాథమిక ప రిశీలన కూడా మొదటి రోజునే పూర్తిచేయాలి ఎంత ఋణమైనాసరే . రెండవ రోజు EC పొందాలి. రెండులక్షల రూపాయల లోపు రుణ పరిమితి అయితే[...]
  • 39. భూమి విలువను నిర్ధారించుటభూమి యొక్క విలువ, సభ్యుని ఋణ అర్హత, SRA ఇచ్చిన విలువపై ఆధారపడి ఉంటుంది. SRA విలువలో అసాధారణమైన మార్పు ఉన్నప్పుడు, ఎప్పటికప్పుడు, భూమి విలువను/సభ్యుని ఋణ అర్హతను ఎక్కించడానికి ఆప్కాబ్ మార్గ దర్శకాలు జారీచేస్తున్నది. జిల్లా బ్యాంకుల పాలకవర్గం కూడ సభ్యుల అర్హతను నిర్ణయించడానికి వారు స్వంతంగా నిర్ణయించిన విలువలను తీసుకోవడం జరుగుతున్నది.ప్రస్తుతమున్న భూమదింపు నిబంధనలను దృష్టిలో ఉంచుకొని, రైతుకు సహాయం చేయడానికి మార్పులు చేయడం జరిగింది.- 100% SRA విలువ[...]
  • 40. Field Inspectionక్షేత్రస్థాయి తనిఖీ సంబంధిత బ్యాంకుల పాలకవర్గ నిర్ణయం ప్రకారం అదీకృత ఆఫీసర్ల చే నిర్వహహించబడుతుంది. ఇది రుణ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మంజూరు చేయడానికి ప్రతిపాదించబడిన రుణ పరిమాణాన్ని బట్టి అధికారుల బృందం క్షేత్ర స్ధాయిలో తనిఖీ చేయడానికి అనుమతించబడుతుంది. ఋణ పరిమితి రు. 2.50 లక్షల వరకు - సంఘ ముఖ్య కార్యనిర్వహణాధికారి మరియు సూపర్వైజర్ ఋణ పరిమితి రు. 2.50 లక్షల నుండి రు. 5.00 లక్షల వరకు -[...]
  • 41. ఋణ దరఖాస్తు ప్రాసెసింగ్ కొరకు అవసరమైన పత్రాలుఅప్పు దరఖాస్తుతో బాటు, దరఖాస్తు దారుడు సమర్పించవలసిన పత్రాలు అడంగల్ పహాని -తాజాగా పాత పహాని - 13 సంవత్సరముల అడంగల్ / పహానీ టైటిల్ బుక్ కమ్ పాస్బుక్ స్కెచ్ మ్యాప్ / ల్యాండ్ మ్యాప్ అన్ని సంబంధిత బ్యాంకులనుండి బాకీ లేనట్లు ధృవీకరణ పత్రం ఫోటోలు కె వైసి కి సంబంధించి ఐడీ ప్రూఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్ SRA నుండి భూమి విలువ సర్టిఫికేట్[...]
  • 42. PACS as MSC గా రీఫైనాన్స్ పొందుటకు అర్హత కలిగిన కార్యక్రమాలువ్యవసాయ నిల్వ కేంద్రాలు: కొత్త గోడౌన్ల నిర్మాణానికి, ఇప్పటికే ఉన్న గోడౌన్ల నిల్వ సామర్థ్యాన్ని పెంచుట కొరకు, సార్టింగ్ మరియు గ్రేడింగ్ తో బాటు గిడ్డంగి రశీదులను జారీ చేయడానికి వీలుగా గిడ్డంగుల నిర్మాణం.cold storage ఏర్పాటువ్యవసాయ సేవా కేంద్రాలు - హైటెక్ వ్యవసాయ పనిముట్లు కొనుగోలువ్యవసాయ ప్రాసెసింగ్ కేంద్రాలు - వాక్సింగ్ మరియు పాలిషింగ్ యూనిట్, శీతలీకరణ గదులు, ఉత్పత్తికి అదనపు విలువ[...]
  • 43. వంశవృక్షముదీర్ఘకాలిక ఋణములు ఇచ్చునప్పుడు దరఖాస్తు దారుని వంశవృక్షము తప్పని సరిగా తీసుకొనవలెను. ఎందుకనగా ఆస్తి పై హక్కు గలవారు ఎవరో తెలుసుకొనుటకు మరియు హక్కు దారుల అందరిచేత డాక్యుమెంట్స్ ఎక్జిక్యూట్ చేయించుటకు దోహదపడును.దరఖాస్తు దారుని వంశవృక్షము వారి తాతనుండి ప్రారంభించాలి.ఉమ్మడి దరఖాస్తు అయితే అందరి వంశవృక్షాలు వ్రాయాలి.సేల్ డీడ్ / గిఫ్ట్ డీడ్ కు సంబంధించి కూడా వారి వంశవృక్షాలు వ్రాయాలి.ఉమ్మడి కుటుంబం అని, విడిపోతే divided family అని ప్రత్యేకంగా వ్రాసి చూపాలి. కూతుర్లున్నా[...]
  • 44. PACS - వాటి ఆర్థిక వనరులుగ్రామీణ స్థాయిలో వ్యవసాయ పరపతి సేవలు అందించుటలో ప్రముఖ పాత్ర వహించుచున్న PACS ఆయా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల మీద ఆధాలపడవలసి వచ్చుచున్నది. ఆ విధంగా కాకుండా ఆ సంఘాలు ఆర్థిక వనరులను సమకూర్చుకోగలిగినట్లయితే, పై ఆర్థిక సంస్థపై పూర్తిగా ఆధారపడవలసిన అవసరం లేదు. ఆర్థిక వనరుల సమీకరణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది - సభ్యుల నుండి వాటా ధనము సంఘం యెక్క స్వంత నిధులు సభ్యులనుండి మరియు సభ్యేతరులనుండి[...]
  • 45. ఆర్థిక సేవలుసహకార సంఘము అందించగల వివిధ సేవలలో ముఖ్యమైనది ఆర్థిక సేవలు.ఈ విభాగంలో సంఘం ముఖ్యంగా రెండు కార్యక్రమాలు చేపట్టగలదు.1. ఋణ సదుపాయం2. పొదుపులను ప్రోత్సహించడంసంఘాలు స్వల్పకాలిక పంట ఋణాలు మరియు దీర్ఘకాలిక ఋణాలు తమ సభ్యులకు వివిధ కార్యకలాపాలు చేపట్టుటకు అందజేయడం జరుగుతుంది. సంఘం ఋణాలను సభ్యులకు అవసరమైన సమయంలో ఇచ్చినట్లయితే, సభ్యుడు తద్వారా ఎక్కువరాబడి పొంది ఋణం కూడ తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఆ రాబడి నుండి ఖర్చులు పోను, మిగతా[...]
  • 46. ఉత్పాదక సేవలుసంఘం సభ్యులకు అందించగల సేవలలో ముఖ్యమైనది ఉత్పాదకసేవలు. ఈ విభాగంలో ముఖ్యంగా 3 కార్యక్రమాలు సంఘం చేపట్టి వచ్చును.- ఇన్ పుట్ సప్లై- అద్దెకు పనిముట్లు- సాంకేతిక సలహాలుఇన్ పుట్ సప్లైలో భాగంగా విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, మొదలైనవి, సభ్యుల అవసరం నిమిత్తం కొనగోలు చేసి, వారి అవసరార్థం అందించడానికి సిద్ధంగా ఉండాలి.ప్రస్తుత యాంత్రిక ప్రపంచంలో ఆధునిక యంత్రాలు మరియు పనిముట్లు ఎక్కువ ధర కలిగి ఉండుట మూలంగా సన్న మరియు చిన్న[...]
  • 47. ఎన్ ఒ డి సి ప్రాధాన్యతఅర్హతగల జిల్లా బ్యాంకుల తరుపున SAO క్రింద ఒక పరిమితి రాష్ట్ర సహకార బ్యాంకుకు నాబార్డు ద్వారా మంజూరు చేయబడుతుంది. NODC ఆధారంగా పరిమితిపై డ్రాయల్స్ అనుమతి ఇస్తారు. నెలవారీ NODC స్టేట్మెంట్ జిల్లా బ్యాంకు వారీగా, మరుసటి నెల 20 వ తేదీ లోపు భౌతికంగా గాని లేక డిజిటల్ ప్లాట్ఫాం ద్వారా గాని పంపవలసివుండును. ఒకవేళ NODC లో లోటు గనుక వుంటే, ఆలోటును రాష్ట్ర సహకార[...]
Scroll to Top