Search
Close this search box.

సూక్ష్మ సాగు నీటి పద్ధతి (మైక్రో ఇరిగేషన్)

album-art
00:00
-0:47
  • 1
    0:47
    1. అధిక దిగుబడులకై అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు అధిక దిగుబడులను పొందవచ్చు.ఇది సూక్ష్మ సాగు నీటి పద్ధతి ద్వారా వీలుకలుగుతుంది. ఈ పద్ధతి 6 రెండు రకాలు అవి బిందు (డ్రిప్) మరియు తుంపర (స్ప్రింక్లర్) పద్ధతులు.
  • 2
    0:51
    2. ప్రతి రోజు మొక్కకు కావలసిన నీటిని లేటరల్ పైపులకు అమర్చిన డ్రిప్పర్ల ద్వారా బొట్లు బొట్లుగా నేల ఉపరితలం మీద లేదా నేల దిగువన నేరుగా వేరు మండలంలో అతిస్వల్ప పరిమాణంలో (గంటకు 1 నుండి 12 లీటర్ల వరకు) అందించే విధానాన్ని “బిందు సేద్యం” లేదా “డ్రిప్ పద్ధతి” అంటారు. ఈ పద్దతిలో డ్రిప్పర్ల వరకు నీరు పీడనం (ప్రెషర్)తో పైపులైన్ల ద్వారా సరఫరా చేయబడుతుంది.
  • 3
    0:45
    3. వివిధ నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సాగు నీరందినపుడు నీటి వినియోగ సామర్థ్యం గురించి తెలుసుకుందాం. సాంప్రదాయ పద్ధతిలో నీటిని అందించినపుడు నీటి వినియోగ సామర్థ్యం 30 నుండి 45% ఉంటుంది. తుంపర పద్ధతిలో నీటిని అందించినపుడు నీటి వినియోగ సామర్థ్యం 55 నుండి 70% ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో నీటిని అందించినపుడు నీటి వినియోగ సామర్థ్యం 90 నుండి 95% ఉంటుంది
  • 4
    0:29
    4. ఉపరితల డ్రిప్ ముఖ్యంగా పండ్ల తోటలకు మరియు వరుసల మధ్య ఎక్కువ అంతరం ఉన్న పంటలకు సిఫారస్ చేయబడినది.
  • 5
    0:37
    5. నేల దిగువన అమర్చబడు డ్రిప్ పద్ధతి ముఖ్యంగా కూరగాయలు, గ్రీన్ హౌస్, షేడెనెట్స్, చెరకు, సుగంధద్రవ్యాలు, ఔషద మొక్కలు మరియు పూల మొక్కలకు సిఫారసు చేయబడినది.
  • 6
    0:26
    6. మైక్రోస్ప్రింక్లర్ పద్ధతి ముఖ్యంగా 12 నుండి 15 సంవత్సరాల పైబడిన పండ్ల తోటలకు, ఆకు కూరలు, ఆయిల్ ఫామ్మొ దలగు పంటలకు సిఫార్సు చేయబడినది.
  • 7
    0:33
    7. డ్రిప్ పద్ధతి వల్ల కలిగే లాభాలు :ఈ పద్ధతి వివిధ పంటలలో 21 నుండి 50% వరకు సాగు నీరు ఆదా అవుతుంది. అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ మరియు ఎత్తు పల్లాలుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనది.
  • 8
    0:29
    8. నీటిని, రసాయనిక ఎరువులను సరఫరా చేయటం వలన మొక్కలు ఏపుగా పెరిగి, త్వరగా పక్వానికి వచ్చి అధిక దిగుబడులు (15 నుండి 150%) మరియు నాణ్యమైన పంటను పొందవచ్చు.
  • 9
    0:26
    9. ప్రతీ చెట్టుకు నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి అందజేయడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటారు నడపబడి కరెంటు వినియోగంలో దాదాపు 30-45% ఆదా అవుతుంది.
  • 10
    0:29
    10. పోషక పదార్థాలను నీటిలో కరిగించి నేరుగా మొక్కల వేళ్ళకు దగ్గరగా అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి దాదాపు 20-43% ఎరువులు ఆదా అవుతాయి. ఈ పద్ధతి ద్వారా ఎరువులు నేరుగా మొక్కకు అందుతాయి.
  • 11
    0:30
    11. నేలను చదును చేయటం, గట్లు కట్టటం, కాలువలు తవ్వటం, చెయ్యటం, నీటిని పార గొట్టటం, ఎరువులు వేయడం మొదలైన పనులు ఉండవు కాబట్టి వీటికయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంట వరుసల మధ్యలో తేమ ఉండదు, కావున కలుపు సమస్య తగ్గుతుంది. ఈ పద్ధతిలో పంట వరుసల మధ్యలో తేమ ఉండదు, కావున కలుపు సమస్య తగ్గుతుంది.
  • 12
    0:21
    12. మొక్కల మొదళ్ళ వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వలన పురుగు మందుల పిచికారీ, మొక్కల కత్తిరింపులు, పంటకోత మొదలగునవి సులభతరమవుతాయి.
  • 13
    0:19
    13. నీరు నేరుగా మొక్కలకు అందించటం వలన మొక్కలపై మరియు ఆకులపై తేమ ఉండదు కావున చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది.
  • 14
    0:26
    14. భూమి కోతకు గురికాదు. ఎరువులు భూమి లోపలి పొరల్లోకి చొచ్చుకొని పోయి వృధా కావు. మురుగు నీటి సమస్య తగ్గుతుంది.
  • 15
    0:35
    15. అధికంగా గాలి వీయడం వలన స్ప్రింక్లర్ పద్ధతిలో మాదిరిగా నీటి వినియోగ సమర్థతపైన ఎటువంటి ప్రభావం ఉండదు.