Search
Close this search box.

వేసవిలో లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు

album-art
00:00
  • వేసవిలో చదును చేసుకునే పొలం పనులను బట్టి పంటల పెరుగుదల మరియు దిగుబడులు వస్తాయి. వేసవిలో లోతు దుక్కులు వాలుకు అడ్డంగా సుమారుగా 9 అంగుళాలకు లోతు తగ్గకుండా దున్నుకోవాలి. వర్షం తక్కువగా కురిసినా వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వర్షపు నీరు భూమిలో బాగా ఇంకిపోయి పంటలకు మేలు చేకూరుతుంది.
  • వేసవి కాలంలో దుక్కులు దున్నకుండా రైతులు పంటకోత అనంతరం పొలాన్ని అలాగే వదిలి వేస్తుంటారు. దీంతో తొలకరి వానలు పడగానే నీరు భూమిలోకి ఇంకిపోకుండా బయటకు వెళ్తుంది. వర్షాలకు ముందే భూమిని లోతుగా దున్నడం వల్ల లోతు భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగ బడతాయి. నేల సారవంతంగా మారుతుంది. ఇలా చేయడం వలన భూమి లో తేమ శాతం పెరిగి భూసారం అభివృద్ధి చెంది పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం, కలుపు మొక్కల నివారణ[...]
  • వేసవిలో లోతు దుక్కులు దున్నే ముందు పశువుల ఎరువు, వర్మికంపోస్టు ఎరువు, చెరువు మట్టిగాని వెదజల్లి దున్నడము ద్వారా నేల నుండి సారవంతమైన పంట దిగుబడితో పాటు తేమ శాతం పెరుగుతుంది. వేసవి దుక్కులు వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వాన నీరు భూమిలో కి ఇంకేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. భూమి కూడా ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది.
  • దున్నేముందు పొలంలో గొర్రెలు, పశువుల మందను తోలడం వల్ల అవి విసర్జించిన వ్యర్థాలు భూమి లోనికి చేరి సేంద్రీయ పదార్థం తయారవుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికందగానే పంటల నుంచి వచ్చే ఎండు ఆకులు, చెత్త కాల్చివేయకుండా అవకాశమున్న వారు లోతు | దుక్కులు చేయటం మూలంగా చెత్త చెదారం, ఎండు ఆకులు, నేల పొరల్లో కలిసిపోయి ఎరువుగా మారి భూసారం పెరుగు తుంది. పంటకు కావలసిన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.
  • రైతులు సీజన్కు ముందుగా వేసవి దుక్కులను తయారు చేసుకోకపోవడంతో కలుపు పెరిగి రైతుకు అదనపు భారంగా మారుతుంది. పంట లేని సమయంలో కలుపు మొక్కలు పెరిగి అవి భూమిలోని నీరు, పోషకాలను ప్రత్యక్షంగా గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అంతే కాకుండా అనేక రకాల పురుగులు, శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించడం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి. కాబట్టి వేసవిలో లోతు దుక్కులతో పాతుకుపోయిన కలుపు మొక్కలు వాటి విత్తనాలు నేల పై పొరల్లో నుంచి లోతు[...]
  • వేసవిలో చాలావరకు భూమి ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగులు, పంటకోత దశల్లో వాటి నిద్రావస్థ దశలను నేల, చెత్త, చెదారం, కొయ్య కాడల్లో గడుపు తాయి. తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు, వీటి శిలీంధ్ర బీజాలు తదితరమైనవి భూమి లోపల ఆశ్రయం పొందుతాయి. వేసవిలో లోతు దుక్కులు చేయడం వలన గుడ్లు, లార్వాలను పక్షులు, కొంగలు, కాకులు తిని వాటిని నాశనం చేస్తాయి. అదే విధంగా వేసవి దుక్కుల వల్ల భూమిలోపల[...]
Scroll to Top