00:00
- 1.చెఱకు సాగులో కార్శీ తోటలు పెంచుట అనాదిగా వస్తున్న పద్ధతి. మొదటి సంవత్సరం వేసిన మొక్క తోట కొట్టిన తరువాత ఆ మోడెంట నుండి రెండవ సంవత్సరం పెంచబడు తోటలను కార్మీ తోట అంటారు. కార్శీ తోటలు పెరిగే కొద్దీ దిగుబడులు తగ్గుతూ వస్తాయి. అంతేకాక భూసారం తగ్గి తెగుళ్ళు వస్తాయి. అంతేకాక భూసారం తగ్గి తెగుళ్ళు మరియు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. చెఱకు పంట శాఖీయ పద్ధతి ద్వారా సాగు చేయడం వలన మొక్క[...]
- 2. తెగుళ్ళు: ఎర్రకుళ్ళు తెగులు:చెఱకును ఆశించే తెగుళ్ళలో ఎర్రకుళ్ళు తెగులు ముఖ్యమైనది మరియు ప్రమాదకరమైనది. ఈ తెగులు ఆశించిన తొలిదశలో పై నుండి 3, 4వ ఆకులు పసుపు పచ్చగా మారుతాయి. ఆ తరువాత మొవ్వంతా ఎండిపోతుంది. తెగులు సోకిన గడలను నిలువుగా చీల్చితే పులిసిన పిండి పదార్థపు వాసన వస్తుంది. చెఱకు లోపలి కణజాలం ఎర్రగా మారి అక్కడక్కడ తెల్లటి అడ్డ మచ్చలు కనబడతాయి. తెగులు ముదిరే కొద్ది లోపలున్న కణజాలము చచ్చిపోయి చెఱకు గుల్లబారి[...]
- 3. యాజమాన్యం: తెగులు సోకని ఆరోగ్యకరమైన తోటల నుండి విత్తనాన్ని సేకరించి నాటడం వల్ల మొచ్చెల ద్వారా వ్యాపించే తెగులును అరికట్టవచ్చును. తెగులు సోకిన తోటల నుండి కార్శీ చేయరాదు. తెగులు సోకిన తోటలు నరికిన తర్వాత అదే భూమిలో తిరిగి చెఱకును సుమారు 4 నెలల వరకు నాటరాదు.
- 4. విత్తనపు మొచ్చెలను నాటే ముందు వేడి నీటిలో 52 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద కార్బండెజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 30 నిమిషాలు శుద్ధి చేయడం వలన విత్తనము మొచ్చెలలోని శిలీంధ్రము చాలా వరకు అరికట్టబడుతుంది. తెగులు తీవ్రంగా వచ్చే ప్రాంతాలలో తెగులును నిరోధించు రకాలను సాగు చేసుకోవాలి. కో 7706, 7602, 93 145, 87 No 298, 97 85, § 7219, 86 96, 2003 46, 2005[...]
- 5. కాటుక తెగులు:ఈ తెగులును కొరడా తెగులు అని కూడా అంటారు. తెగులు సోకిన మొక్క మొవ్వ పొడవైన నల్లని కొరడాగా మారుతుంది. మొవ్వు నుండి కొరడా వచ్చిన 3-4 రోజుల దాకా తెల్లటి, పలుచటి పొరతో కప్పబడి ఉంటుంది. ఆ తరువాత పొర చిట్లి అసంఖ్యాకరమైన శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా, వర్షపు జల్లుల ద్వారా పరి సరాల్లోకి వెదజల్లబడతాయి. తెగులు సోకిన చెఱకులు సన్నగా ఉంటాయి. ఈ తెగులు మొక్క తోటలు కన్నా కార్శీ[...]
- 6. కాటుక తెగులు నివారణ: ఆరోగ్యవంతమైన తోటల్లో నుండి విత్తనాన్ని సేకరించాలి. తెగులు ఉధృతముగా ఉన్న ప్రాంతాలలో కార్శీ తోటలు పెంపకము మొదటి కార్శీకే పరిమితము చేయాలి. కాటుక తెగులును తట్టుకునే రకాలైన 2003 వి 46, 2005 టి 16, 83 వి 15, కో 7706, కొ 7805 వంటి రకాలను సాగు చేయాలి.
- 7. కాటుక తెగులు నివారణ:తెగులుకు లొంగిపోయే రకాలను సాగు చేస్తున్నప్పుడు విత్తనపు మొచ్చెలను ప్రొపికొనజోల్ (1 మి.లీ / లీటరు ) మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. కార్శీ తోటల్లో ప్రాపికొనజోల్ (0.5 మి.లీ / లీటరు) మందును కార్శీ చేసిన 30-35 రోజులకు ఒకసారి, మరో 30 రోజులకు ఇంకొకసారి పిచికారీ చేయాలి.
- 8. వడలు తెగులు:చెఱకు మొక్కలు ఏదో ఒక రకమైన ఒత్తిడికి లోనైనప్పుడు మొక్కల నిరోధక శక్తి తగ్గుట వలన భూమిలో ఉండే వడలు తెగులు శిలీంధ్రము చెఱకులోనికి ప్రవేశించి తెగులును కలుగజేస్తుంది. తోటల్లో ఈ తెగులు సోకినటువంటి మొక్కలు నీటి ఎద్దడికి లోనైనట్లు ఎండిపోతాయి. చెఱకుల లోపలి కణజాలం బూడిద రంగు లేదా ఇటుక రంగుకు మారి క్రమేపి ఎండిపోతుంది. చెఱకు లోపల గుల్ల ఉర్పడుట వలన తేలికై తూకము తగ్గుతుంది.
- 9. వడలు తెగులు నివారణ: విత్తనాన్ని తెగులు సోకని ఆరోగ్యవంతమైన తోటల నుండి వాడాలి. తోటలలో నీరు నిలవ ఉండకుండా చూడాలి. సిఫారసు మేరకు నత్రజని ఎరువులు వాడాలి. తెగులు హెచ్చుగా సోకిన తోటలు కార్శీ చేయరాదు. పంట మార్పిడి చేయాలి.
- 10. గడ్డిదుబ్బు తెగులు:ఈ తెగులు సూక్ష్మాతి సూక్ష్మమైన ఫైటోప్లాస్మా అనే క్రిమి వలన వస్తుంది. మొక్క తోటల కన్నా కార్శీ తోటలలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కార్శీ తోటల్లో తెగులు సోకినప్పుడు చెఱకులో సాధార ణమైన గడలు ఎదగకుండా సుమారు 200 నుండి 250 వరకు పాలిపోయిన తెల్లటి గడ్డి మాదిరి పిలకలు వస్తా యి. గడ్డిదుబ్బు తెగులు బాగా ఎదిగిన తోటలకు సోకితే మొవ్వులోని ఆకులు తెల్లగా మారి, పై కణుపుల దగ్గ[...]
- 11. గడ్డిదుబ్బు తెగులు నివారణ:ఈ తెగులు విత్తనపు మొచ్చెల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కనుక ఆరోగ్యవంతమైన తోటల నుండి విత్తనము సేకరించుకోవాలి. తెగులు సోకిన మొక్క తోటల నుండి కార్శీ చేయరాదు తెగులు సోకిన దుబ్బులను త్రవ్వి తగుల బెట్టాలి. విత్తనపు మొచ్చెలను వేడి నీటిలో గాని, తేమతో మిళితమైన వేడి గాలిలో గాని శుద్ధి చేయాలి
- 12. గడ్డిదుబ్బు తెగులు నివారణ: తెగులును వ్యాప్తి చేసే కీటకాలను నివారించటానికి మలాథియాన్ లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. తెగులును తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి.
- 13. అనాస కుళ్ళు తెగులు:దీనిని మొచ్చె కుళ్ళు తెగులు అని కూడా అంటారు. విత్తనపు ముచ్చెలు నరికిన తరువాత నాటడం ఆలస్యం అయినప్పుడు, వేడి నీటి శుద్ధి చేసిన విత్తనం నాటినప్పుడు, ఇవకతీత సౌకర్యం లేదా తేమ ఎక్కువగా ఉండే నల్లరేగడి నేలలో విత్తనం నాటినప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.
- 14. అనాస కుళ్ళు తెగులు:నాటిన రెండు లేదా మూడు వారాలకు తెగులు లక్షణాలు కనబడతాయి. భూమిలో ఉండే శిలీంధ్రము ముచ్చల చివర్ల ద్వారా లోనికి ప్రవేశించి లోపలి కణజాలాన్ని నష్టపరుస్తుంది. మొదటి దశలో కణజాలం నల్లగా మారి చివరకు కణాలన్నీ కుళ్ళిపోతాయి. తెగులు సోకిన ముచ్చెలను చీల్చినప్పుడు అనాస పండు వాసన వస్తుంది. అందుకే దీనిని అనాస కుళ్ళు తెగులు అంటారు.
- 15. అనాస కుళ్ళు తెగులు నివారణ: తెగులు సోకిన దుబ్బులను సమూలంగా తీసి తగులబెట్టాలి. సరైన సాగు నీరు, మురుగు నీరు పోయే సౌకర్యం ఏర్పాటు చేయాలి. కార్బండెజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- 16. పసుపు ఆకు తెగులు:ఈ తెగులు వైరస్ వల్ల కలుగుతుంది. మన రాష్ట్రంలో సాగు చేయు అన్ని రకాలలో ఈ తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది.లక్షణాలు: తెగులు ఆశించిన మొక్కల యొక్క ఆకుల ఈనెల పసుపు వర్ణంలోకి మారుతాయి. ఆకుల అంచుల నుండి ఎండుతూ వస్తుంది. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాలలో ఆకుల ఈనెలు గులాబీ రంగులోకి మారి, తరువాత ఎండిపోతాయి.
- 17. పసుపు ఆకు తెగులు లక్షణాలు: మొక్క ఎదిగిన తరువాత (4-6 నెలల) సమయంలో గడల పెరుగుదల తగ్గి గిడసబారి ఉంటాయి. పైనుండి చూసినప్పుడు మొక్క యొక్క ఆకులు విసనకర్ర ఆకారంలో ఆకులు దగ్గర దగ్గరగా ఉంటాయి. తెగుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పంట ఎండిపోయి, చనిపోతుంది. మొక్కలు గిడసబారడంతో దిగుబడులు తగ్గుతాయి.
- 18. పసుపు ఆకు తెగులు నివారణ: తెగులు ఆశించిన తోటల నుండి కార్శీ చేయరాదు. టిష్యుకల్చర్ ద్వారా వృద్ధి చేసిన మొక్కలను నాటినప్పుడు ఈ తెగులు తీవ్రతను తగ్గించవచ్చు. ఈ తెగులు పేనుబంక పురుగు ద్వారా ఒక మొక్క నుండి ఇంకొక మొక్కను ఆశిస్తుంది కాబట్టి ఈ పేనుబంక పురుగులను అరికట్టడానికి డైమిథోయేట్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- 19. పురుగులుపీక పురుగు:ఈ పురుగు చెఱకు నాటిన 30 రోజుల నుండి ఆశిస్తుంది. పైరు పిలకలు వేసే దశలో, పిల్ల పురుగు మొవ్వు లోపలికి తొలుచుకు పోయి, దవ్వ లోపలి భాగాన్ని తినివేయడం వలన మొవ్వులు ఎండి చనిపోతాయి. చచ్చిన మొవ్వులను పీకిన, తేలికగా బయటకు వస్తాయి. కుళ్ళిపోయిన మొవ్వు నుండి చెడు వాసన వస్తుంది. పీక పురుగు ఆశించి మొవ్వు చనిపోవుట వలన పక్క పిలకలు అధికంగా వచ్చినప్పటికి, అవి బలహీనంగా ఉండి, పరిగా పెరుగుదల[...]
- 20. పీక పురుగు నివారణ: పీక పురుగు నివారణకు చెఱకు ముచ్చెలను 20 సెం.మీ లోతు కాలువలో, 2.5 సెం.మీ లోతుగా, పెడ ప్రక్కలో నాటాలి. నాటే సమయములో ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3జి 13 కిలోలు లేదా ఫిప్రోనిల్ 0.3 జి 10 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 జి. 9 కిలోలు గుళికలు చాళ్ళలో వేయాలి. చెఱకు నాటిన 30 రోజుల నుండి 7-10 రోజుల వ్యవధిలో ట్రైకోగ్రామా ఖిలోనిన్ అనే గుడ్డు పరాన్న జీ[...]
- 21. కాండం తొలుచు పురుగు:చెటకు నాటిన 120 రోజుల నుండి పంటకోత వరకు ఈ పురుగు ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు ఆశించిన గడల పైభాగాన రంధ్రాలు కనిపిస్తాయి. వాటిపై పురుగు విసర్జించిన మలిన పదార్థాలు కూడా కనిపిస్తాయి. బలమైన గాలులు వీచినప్పుడు, ఆ రంధ్రాలు ఏర్పడిన ప్రాంతానికి గడలు విరిగిపోతాయి. వర్షాభావ పరిస్థితులు, ఎక్కువ మోతాదు నత్రజని వాడకము, బోళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువ.
- 22. కాండం తొలుచు పురుగు నివారణ: ఈ పురుగు నివారణకు ఎండిన క్రింది ఆకులను రెలచి, క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు జూన్ - జూలై మాసంలలో చెఱకు గడలపై పిచికారీ చేయాలి. సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వాడాలి. ఆలస్యంగా నత్రజని ఎరువులను వాడకూడదు. ఆలస్యంగా వచ్చిన పిలకలను (వాటర్ షూట్స్) తీసివేయాలి. తోట పడిపోకుండా నిలగట్టాలి.
- 23. కాండం తొలుచు పురుగు నివారణ: మురుగు నీరు పారుదల సౌకర్యం కల్పించాలి. ట్రైకోగ్రామా ఖిలోనీస్ అనే గుడ్ల పరాన్న జీవిని (20,000 / ఎ) 120 రోజుల నుండి 7-10 రోజుల వ్యవధిలో 6-8 సార్లు పైరులో వదులుకోవాలి. చెఱకు నాటిన 120 రోజుల నుండి లింగాకర్షణ బుట్టలు 10 చొప్పున పెట్టి, అధిక సంఖ్యలో మగ పురుగులు నాశనం చేయటం ద్వారా ఈ పురుగు ఉధృతి తగ్గించవచ్చు.
- 24. పొలుసు పురుగు:నీటి ఎద్దడికి లోనైన పంటలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కణుపులు ఏర్పడినప్పటి నుండి చెఱకు నరికే వరకు పొలుసు పురుగు పైరును ఆశిస్తుంది. పొలుసు పురుగు ఆశించిన మొక్కలలోని ఆకుల కొనలు ఎండిపోయి, పాలిపోయినట్లు కనిపిస్తాయి. గడలు ఏర్పడిన తరువాత ఈ పురుగు యొక్క పిల్లలు చెఱకు గడలపై ప్రాకి చెఱకు గడల ఆకు తొడిమల క్రింద స్థిర నివాసము ఏర్పరచుకొని, గడలలోని రసాన్ని పీల్చి వృద్ధి చెందుతాయి. ఈ పురుగులు[...]
- 25. పొలుసు పురుగు నివారణ: చెఱకు విత్తనాన్ని మలాథియాన్ మందు ద్రావణంలో (అనగా 2 మి.లీ మలాథియాన్ 1 లీటరు నీటికి కలిపిన మందు ద్రావణంలో) ముంచి నాటుకున్నట్లయితే ఈ పురుగు యొక్క తాకిడిని తగ్గించవచ్చును. పొలుసు పురుగును అరికట్టడానికి మొక్కలోని క్రింద ఆకులు రెలచి (మొవ్వులోని కనీసం 8 ఆకులు ఉంచి) డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- 26. చెఱకు నాటడానికి పొలుసు పురుగు ఆశించిన తోటల నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి. ఒకవేల పురుగు ఆశించిన పొలం నుండే విత్తనం వాడవలసి వస్తే విత్తనశుద్ధి తప్పక చేసుకోవాలి. చెఱకు తోటల్లో ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి
- 27. పిండి నల్లి:గులాబి వర్ణంలో నుండు తల్లి మరియు పిల్ల పురుగులు ఆకు తొడిమలకు, చెఱకు గడలను మధ్య గుంపులుగా చేరి గడల నుండి రసాన్ని పీల్చివేస్తాయి. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల నుండి రసం పీల్చివేయడం వలన ఆకులు పసుపుగా మారి ఎండిపోతాయి. పిండి నల్లి విసర్జించు పదార్థాలపై సూటిమోల్డ్ అనే శిలీంధ్రం పెరిగి చెఱకు గడలు నల్లగా మసిబారతాయి. పంట పక్వానికి వచ్చినప్పుడు పిండి నల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది.
- 28. పిండి నల్లి నివారణ: ఎదిగిన తోటల్లో పురుగు నివారణకు ఆకులు రెలచి బహిర్గతమైన కణుపుల మీద మలాథీయాన్ 3 మి.లీ లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నత్రజని ఎరువుల మోతాదు ను తగ్గించుకోవాలి.
- 29. వేరు లద్దె పురుగు:ఈ పురుగు ఆశించిన మొక్కల ఆకులు పసుపుగా మారి ఎండిపోతాయి. వేరు లద్దె పురుగులు భూమి లోపల వ్రేళ్ళను, కాండాన్ని తినివేయడం వలన, మొక్కలు వడలిపోయి ఎండిపోతాయి. ఇలాంటి మొక్కలను లాగినప్పుడు చాలా సులువుగా ఊడి వస్తాయి. ఇసుక భూముల్లోనూ, కార్శీ తోటల్లోనూ ఈ పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు ఆశించినప్పుడు మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవడం గమనించవచ్చు.
- 30. వేరు లద్దె పురుగు నివారణ: చెఱకు నాటిన తరువాత తగిన నీటి తడులు ఇవ్వాలి. లద్దె పురుగు నివరాణకు లోతు దుక్కి చేయాలి. ఇలా చేయడం ద్వారా వేరు పురుగు యొక్క కోశస్థ దశలను నాశనం చేయవచ్చు. ఈ పురుగు తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తోటల నుండి కార్శీ చేయరాదు. ఈ పురుగు ఆశించిన పొలాన్ని, 2-3 రోజులు నీళ్లతో నిలగట్టి, తరువాత నీరు తీసివేయాలి. ఎకరాకు 8 కిలోల చొప్పున ఫోరేట్ 10[...]
- 31. చెదలు:తేలికపాటి నేలల్లో ఇసుక నేలలో ఈ పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇవి చెఱకు నాటినప్పటి నుండి చెఱకు నరికే వరకు పంటకు హాని చేస్తాయి. చెదలు ఆశించిన తోటల్లో ఆకులు పసుపుగా మారి ఎండి చనిపోతాయి. ఇలాంటి మొక్కలను పీకి చూస్తే నేల మట్టానికి ఉన్న కాండం ఆర్థ చంద్రాకారంలో కత్తిరించినట్లు ఉండి లాగినప్పుడు చాలా సులువుగా ఊడి వస్తాయి. ఈ పురుగులు కాండాన్ని తిని ఉండే ప్రదేశాన్ని గమనించవచ్చు. నాటిన ముచ్చెల చివళ్ళ[...]
- 32. చెదలు నివారణ: ఇసుక నేలల్లో చెఱకు నాటిన తరువాత బాగా నీటి తడులు ఇవ్వాలి, నీటి కొరత లేకుండా చూసుకోవాలి. చెద పురుగుల పుట్టలను త్రవ్వి, రాణి పురుగును చంపి, అందులో క్లోరిపైరిఫాస్ 50 ఇ.సి 5 మిలీ లీటరు నీటికి కలిపి ఒక్కొక్క పుట్టలో 15-20 లీటర్ల మందు ద్రావణం వేసి చదును చేయాలి.
- 33. చెదలు నివారణ: విత్తనపు దవ్వను నాటుటకు ముందు మలాథియాన్ 2 మి.లీ లేదా డైమిథోయేట్ 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.యస్ 1 మి.లీ లీటరు నీటికి కలిపిన ద్రావణములో 15 నిమిషాలు శుద్ధి చేయుట వలన మొలక శాతం దెబ్బ తినకుండా అరికట్టవచ్చు. ఎదిగిన తోటలలో చెదలను అరికట్టుటకు క్లోరిపైరిఫాస్ 20 ఇ.సి లేదా 50 ఇ సి మందును 5 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి చెఱకు గడలపై (6-7 కణుపుల[...]