Search
Close this search box.

ఎల్నినో మరియు లానినా సమయంలో పంట సాగులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు

album-art
00:00
  • 1. వివిధ ప్రాంతాలలో వైవిధ్య వాతావరణ పరిస్థితుల వల్ల పంటలపై వాతావరణం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎల్న్ని మరియు లానినా వలన పంటకాలంలో బెట్ట పరిస్థితులలో అకాల వర్షాలు, అధిక వర్షాలు, తుఫానుల తీవ్రత వలన పంటల దిగుబడి గణనీయంగా తగ్గి మన రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఎలినో ప్రభావంతో కొన్ని ప్రాంతాల రైతులు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితులలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం.
  • 2. ఎలినో పరిస్థితులను అధిగమించాలంటే రైతులు వర్షపు నీటిని చెరువులు, కుంటలు కమ్యూనిటీ ట్యాంకులు, వాటర్ షెడ్లు మరియు కొలనులలో నిలువచేసే పద్ధతులను తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ నిలువ చేసిన నీటిని పంట బెట్ట పరిస్థితులో మరియు కీలక దశల్లో 1 లేదా 2 రక్షక తడులుగా అందించినట్లయితే 20 నుండి 30 శాతం వరుకు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం.
  • 3. ఎలినో సమస్యను ఎదుర్కోవాలంటే సాగు చేసే పంటలో తక్కువ నీటి వసతిలో అధిక దిగుబడి ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటి పారుదల కోసం అధికమైన తుంపర్లు మరియు బిందుసేద్యం పద్ధతులను పాటించి సాయంత్రం సమయంలో పంటలకు నీరు అందించినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు. అదే విధంగా నేల మరియు నీటి సంరక్షణ పద్ధతులను విధిగా పాటించాలి. నేలపై ఉన్న మట్టి యొక్క గట్టిపొరను విచ్ఛిన్నం చేయడానికి అంతర కృషి తప్పక చేపట్టాలి.
  • 4. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమయినపుడు ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. బెట్ట పరిస్థితులలో నత్రజని ఎరువులు మరియు సూక్ష్మ పోషకాలను పిచికారీ చేయాలి మరియు వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉండే పంటలు అంటే కంది, ప్రత్తి, ఆముదం మొదలగునవి సాలు మార్చి సాలు పద్ధతిని నీటి తడులు ఇవ్వాలి. బెట్ట పరిస్థితులలో నేల తేమ ఎక్కువగా ఆవిరికాకుండా ఉండటానికి మొక్కల సాంద్రతను తగ్గించాలి. అదేవిధంగా నీటి సంరక్షణ మరియు నేల కోతకు[...]
  • 5. లానినా సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు: వరద ముంపును తట్టుకునే పంట రకాలను వేసుకోవాలి. పలు ప్రాంతాలలో నేల కోతకు గురికాకుండా పంటలను వాలుకు అడ్డుగా నాటుకోవాలి. పంట పొలాలలో మురుగునీరు పోవడానికి కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. పంట కనుక 80 శాతం పరిపక్వతకు ఉంటే వెంటనే కోత కోసి సురక్షితమైన స్థలంలో నిల్వ చేసుకోవాలి. ఉద్యానవన పంటల్లో మొక్కలు క్రింద పడిపోకుండా కట్టెలతో ఊతం ఇవ్వాలి. వరద నష్టాన్ని తగ్గించడానికి నదులు, సరసులు, జలాశయాలు[...]
  • 6. వరదలు వచ్చే ప్రదేశాలలో ఎక్కువ నీటిని ఉపయోగించుకునే వృక్ష సంపదను నాటడం మరియు వరద నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి అనువుగా మొక్కలను నాటడం వలన వరద తీవ్రత మరియు దాని వలన కలిగే నష్టాన్ని తగ్గించవచ్చు. అదే విధంగా అధిక విస్తీర్ణంలో అడవుల పెంపకం చేపట్టాలి.
  • 7. అధిక వర్షం వచ్చినపుడు, వర్షం తగ్గిన తరువాత నిలచి ఉన్న అధనపు నీటిని పంట పొలాల నుండి తీసివేసి మొక్కలకు నిటారుగా ఉండటానికి ప్రోపింగ్ చేసుకోవాలి. అలానే కూరగాయలు మరియు పండ్ల తోటలకు ఊతం ఇవ్వడం వల్ల నష్టాన్ని తగ్గించుకోవచ్చు. వేగంగా పంట కోలుకోవడానికి మరియు నష్టాలను తగ్గించడానికి నత్రజని ఎరువులను అధనంగా వేసుకోవాలి. అధిక వర్షం కారణంగా పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తే వివిధ పంటల్లో సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి.
  • 8. అధిక వర్షం సమయంలో పురుగు మందులు మరియు ఎరువులు చల్లకూడదు. కోతకోసిన పంట ఉత్పత్తులను బహిరంగ ప్రదేశాల్లో ఉంచడము మరియు పశు జీనాదులను బయట మేపడానికి అనుమతించరాదు. చెట్ల కింద కరెంటు స్తంభాలు, టవర్లకు దగ్గరగా ఉంచరాదు.
Scroll to Top