Search
Close this search box.

చిరు ధాన్యాలలో వివిధ అంతర పంటల సాగు

album-art
00:00
  • చిరుధాన్య పంటలను అతి తక్కువ నీటి వనరులతో, తక్కువ ఎరువులతో, అన్ని రకాల నేలలలో ఎటువంటి వాతావరణ పరిస్థితులలో అయినా పండించుకోవచ్చు. వీటి పంటకాలం తక్కువ. పురుగులు, తెగుళ్ళ సమస్య కూడా చాలా తక్కువ. అంతేకాకుండా ఇవి అత్యధిక పోషకాలను కలిగి పోషకాహార లోపాలు తగ్గించడంలో ప్రధాన భూమికలను పోషిస్తున్నాయి. చిరుదాన్యాలను ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలో పోడు భూములలో, కొండ వాలు ప్రాంతాలలోనూ సాగు చేస్తున్నారు. అంతేకాకుండా రబీలో ప్రధాన పంట తర్వాత భూమిలో మిగిలి ఉన్న[...]
  • మెట్ట ప్రాంతాలలో వర్షాధార సాగు చేయుట వలన పంటల దిగుబడులు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలం నీటి ఎద్దడి (కరువు) పరిస్థితులు ఏర్పడినప్పుడు పంట దిగుబడులు గణణీయంగా తగ్గిపోతాయి. అదేవిధంగా అధిక వర్షపాతం మరియు గాలుల కారణంగా కూడా చేను పడిపోయి పంట దిగుబడులు తగ్గుతాయి. ముఖ్యంగా ఇటువంటి వాతావరణ పరిస్థితులలో ఒకే రకమైన పంటను వేయటం కంటే ఒకే పొలంలో వైవిధ్యమైన పంటలను ఒకే సారి పండించుకోవడం ఉత్తమం.
  • అనూహ్య వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక పంట నష్ట పోయినప్పటికి మిగిలిన పంటల నుండి కనీస దిగుబడి తీసుకోవచ్చు. అంతర పంటలు వేసుకునేటప్పుడు నేలలోని తేమ మరియు పోషకాలు సమర్థంగా వినియోగించుకోబడతాయి. చీడపీడల సమస్య కూడా తగ్గించబడుతుంది. చిరుధాన్య పంటలు అంతర పంటలుగా వేసుకోవడానికి బాగా అనుకూలమైనవి.
  • రాగితో అంతర పంటలు: చిరుధాన్యాలతో అపరాలను అంతర పంటలుగా పండించడం చాలా లాభదాయకం. అపరాలు నత్రజని స్థిరీకరించు గుణం కలిగి రసాయన ఎరువుల వినియోగం తగ్గించుటకు మరియు నేల సారం పెంచుటకు సహాయపడతాయి. రాగి మరియు కంది పంటను లేదా రాగి మరియు మినుము పంటను 8:2 నిష్పత్తిలో వేసుకొన్నప్పుడు ఒక్క రాగి పంట వేసుకునే దానికన్నా అధిక ఆదాయం పొందవచ్చు.
  • రాగితో సాగు చేసుకోగల మరికొన్ని అంతర పంటలు:రాగి మరియు చిక్కుడు 8:1 లేదా 6:2 నిష్పత్తిలో, రాగి మరియు బెండ / గోరుచిక్కుడు 8:2 నిష్పత్తి లో, రాగి మరియు వేరుశనగ 6:4 లేదా 4:1 నిష్పత్తిలో, రాగి మరియు సోయచిక్కుడు 2:1. నిష్పత్తిలో అంతర పంటలు వేయాలి. మెట్ట ప్రాంతాలలో రాగిలో ఈ విధంగా అంతరపంటలు వేసుకోవడం వలన చిన్న సన్నకారు రైతులకు పని దినాలు పెరగడమే కాకుండా ఆహార మరియుఆర్థిక భద్రతలు కూడా కలుగుతాయి.
  • కొర్ర లో అంతర పంటలుకొర్ర మరియు కంది 5:1 నిష్పత్తిలో, కొర్ర మరియు సోయాచిక్కుడు 5:1 నిష్పత్తిలో, కొర్ర మరియు వేరుశనగ 2:1 నిష్పత్తిలో, వేరుశనగ మరియు కొర్ర 6:1 నిష్పత్తిలో, కొర్ర మరియు ఆముదం 3:1 నిష్పత్తిలో, కొర్ర మరియు చిక్కుడు 6:2 నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు.
  • సామలో వివిధ అంతర పంటలు:సామ మరియు కంది పంటలో 5:1 లేదా 4:2 నిష్పత్తిలో లేదా 6:2 నిష్పత్తిలో, సోయాచిక్కుడు మరియు సామ 2:2 నిష్పత్తిలో, వేరుశనగ మరియు సామ 6:1 నిష్పత్తిలో, సామ మరియు మినుము లేదా పెసర 2:1 నిష్పత్తిలో, సామ మరియు నువ్వులు 4:1 నిష్పత్తిలో, సామ మరియు చిక్కుడు 4:2 నిష్పత్తిలో అంతర పంటలు వేయాఇ.
  • వరిగలో వివిధ అంతర పంటలు:కంది మరియు వరిగ 1:2 నిష్పత్తిలో, వరిగ మరియు పెసర 2:4 లేదా 2:1 నిష్పత్తిలో, వరిగ మరియు సోయాచిక్కుడు 1:1 నిష్పత్తిలో అంతర పంటలు వేయాలి. ఊదులో అయితే ఊద మరియు రైస్ బీన్ 4:1 నిష్పత్తిలో, అదే అరికలో అయితే అరిక మరియు కంది 2:1 నిష్పత్తిలో, అరిక మరియు మినుము లేదా పెసర 2:1 నిష్పత్తిలో, అరిక మరియు సోయాచిక్కుడు 2: 1 నిష్పత్తిలో అంతర పంటలు వేయాలి.
  • వర్షాధార మెట్ట వ్యవసాయంలో చిరుధాన్యాల ఆధారిత అంతర పంటలు ముఖ్యంగా లెగ్యూమ్ జాతికి చెందిన అంతర పంటలు పండించడం మరింత లాభదాయకం. చిరుధాన్యాలు మిగిలిన ఆహార పంటల కన్నా తక్కువ వనరులను ఉపయోగించుకుంటాయి. పురుగులు, తెగుళ్ళ సమస్య తక్కువ. వాతావరణ ప్రతికూలత ను తట్టుకుంటాయి. అంతేకాకుండా అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. లెగ్యూమ్ అంతర పంటలు నత్రజనిని స్థిరీకరించి చిరుధాన్య పంటలకు అందించటం వలన రెండు పంటల దిగుబడి పెరగడమే కాకుండా రసాయన ఎరువు అవసరం[...]
  • అంతేకాకుండా లెగ్యూమ్ లలో మాంసకృత్తులు, ఇతర ఆవశ్యకత అమైనో ఆమ్లాలు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. అందువలన వర్షాధార మెట్ట ప్రాంతాలలో చిరుధాన్యాలతో లెగ్యూమ్ అంతర పంటలు వేయటం వలన ఆరోగ్య లేదా పోషక భద్రత, ఆహార భద్రతలు చేకూరతాయి.
Scroll to Top