00:00
- 1. పురుగు మందుల చట్టం 1968 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ప్రకారం కొన్ని రకాల పురుగు మరియు తెగుళ్ళ మందులను నిషేదించడం జరిగింది. డైకోఫాల్, డైనోకాప్ మరియు మెథోమిల్ మందులను అమ్మటం కానీ, పంపిణీ చేయడం కానీ మరియు వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. అదే విధంగా మోనోక్రోటోఫాస్ 36% ఎస్.ఎల్ పురుగు మందును వాడకూడదని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
- 2. డైకోఫాల్ కు బదులుగా నీటిలో కరిగే గంధకం కానీ ప్రొపగేట్ లేదా ఫెన్ జాకైన్ మరియు స్పైరోమెసిఫిన్ లాంటి మందులను వాడటం ద్వారా వరి, కంది, నిమ్మ, ప్రత్తి, బెండ, వంగ పంటలలో నల్లిని నివారించవచ్చును. అదే విధంగా డైనోకాప్ కు బదులుగా హెక్సాకొనజోల్ లేదా సల్ఫర్, అజాక్సిస్ట్రోబిన్ లేదా కార్బండెజిమ్ లాంటి మందులను మామిడి మరియు గులాబి మొక్కలలో బూడిద తెగులు నివారణకు ఉపయోగించవచ్చును.
- 3. మెధోమిల్ కు ప్రత్యామ్నాయంగా ఇమామెక్టిన్ బెంజోయట్ లేదా థమోడికార్బ్ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ లేదా స్పైనోసాడ్ మరియు ఫ్లూబెండమైడ్ లాంటి మందులను కంది, ప్రత్తి, టోమాటో, మిరప, వేరుశనగ మరియు ద్రాక్ష పంటలలో కాయతొలుచు పురుగు నివారణకు ఉపయోగించవచ్చును.
- 4. మోనోక్రోటోఫాస్ 36% ఎస్. ఎల్ బదులుగా ఇమామెక్టిన్ బెంజోయట్ లేదా ధయోడికార్బ్ లేదా ఇండాక్సాకార్బ్ లేదా క్లోరాంట్రనిలిప్రోల్ లేదా స్పైనోసాడ్ మరియు ఫ్లూబెండమైడ్ లాంటి మందులను కంది, మినుము, పెసర మరియు ప్రత్తి పంటలలో కాయ తొలుచు పురుగు నియంత్రనకు మరియు పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు నివారణకు మరియు వరి పంటలో సుడిదోమ, పచ్చ దీపపు పురుగు మరియు ఆకుముడత పురుగు నివారణకు ఉపయోగించవచ్చును.
- 5. ప్రత్తిలో పేనుబంక, పచ్చదోమ మరియు తామర పురుగు నివారణకు ఇమిడాక్లోప్రిడ్, అసిలామప్రిడ్, థయోమిథాక్సామ్, లేదా డైఫెన్ యురాన్ లాంటి మందులను వాడవచ్చును. అలానే వరిపంటలో సుడిదోమ, పచ్చ దీపపు పురుగు నివారణకు బుప్రోఫెజిన్, ఎసిఫెట్, పైమెట్రోజైన్, డైనోటెఫ్యురాన్ లేదా ట్రైప్లుమిజో పైరిమ్ లాంటి మందులను వాడవచ్చును. వరిలో ఆకు ముడత పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ కానీ క్లోరాంట్రానిలిప్రోల్ లాంటి మందులను వాడవచ్చును.