Search
Close this search box.

సమస్యాత్మక భూములు – వాటి యాజమాన్యం

album-art
00:00
  • సమస్యాత్మక భూములు - వాటి యాజమాన్యంసమస్యాత్మక భూములు, సాధారణ సాగు భూములకు భిన్నంగా ఉండి, పంటల స్థిర అధికోత్పత్తిని సాధించుటకు ఆటంకము కలుగ చేస్తాయి. సమస్యాత్మక భూములు అనేక రకాలు. వీటిలో సమస్యను సరి చేసి, పంటల సాగుకు అనుకూలంగా మార్చి, అధిక దిగుబడులను సాధించుటకు కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించవలెను.
  • లోతుతక్కువ మరియు గలస అధికంగా గల నేలలు:నేల లోతు తక్కువగా ఉండటం వలన నీరు మరియు భూసారం పరిమితంగా ఉండటంతో వేరు పెరుగుదల తగ్గి పంట దిగుబడి తగ్గుతుంది. ఈ నేలల ఉత్పాదక శక్తిని పెంచడానికి వాలుకు అడ్డంగా బోదెలు, కాల్వలు నాగళ్ళతో లేదా “బండ్ ఫార్మర్” తో లేదా పారలతో గాని నిర్మించి పైరును బోదెల మీద నాటాలి. ఒక మీటరు మధ్య దూరంలో దుక్కి లోతుగా మూడు సంవత్సరాల కొకసారి దున్నాలి. వీటితో పాటు[...]
  • తక్కువ నీటి నిల్వశక్తి గల భూములు:
  • తక్కువ నీటి నిల్వశక్తి గల భూములు:చెరువు మట్టి వేయడం వలన భూమిలో బంక మన్ను శాతం పెరుగుతుంది. అందువలన భూమికి నీటిని, పోషక పదార్ధాలను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఏ పంట అవశేషాన్నైనా ఎకరాకు 20 క్వింటాళ్ళ చొప్పున వర్షాకాలానికి ఒక నెల ముందుగానే చేనుపై పలచగా చల్లి దంతి లేదా గుంటకతో మట్టిలో కలియదున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. పై వ్యర్ధ పదార్థాలను చేనులో తోలిన తర్వాత అలానే గాలికి వదిలి వేయకుండా వెంటనే చేనులో[...]
  • నేల పైపొర గట్టిపడే సమస్య:నేల పైపొర గట్టిపడే సమస్య ఉన్న భూములలో పశువుల ఎరువు లేదా మాగిన సేంద్రీయ పదార్థాల వాడకం వలన నేల పైపొర గట్టి పడకుండా చేస్తాయి. వ్యవసాయ వ్యర్థాలతో మట్టిని కప్పటం వలన ఈ సమస్య రాకుండా చూడవచ్చు. చిసెల్ నాగలితో నేలను దున్నటం ద్వారా వ్యవసాయోత్పత్తిని పెంచవచ్చు. ఇటువంటి నేలల్లో ఎకరాకి 16 టన్నుల ఇసుకని వెదజల్లి దుక్కి చేసుకున్న మంచి ఫలితాలు కనిపించును.
  • నేల లోపల గట్టి పొరలు :ఉపరితలం నుండి మీటరు వెడల్పున గుంట త్రవ్వుతూ వెళ్ళితే కొంత లోతున గట్టి పొరలు కనబడతాయి. చిన్నపాటి చాకును గ్రుచ్చి ఈ గట్టి పొరను నిర్థారించుకోవచ్చు. పెద్ద ట్రాక్టరుతో లోతుగా దున్నే నాగళ్ళతో లేదా సబ్ సాయిలర్ లేదా చిసెల్ నాగళ్ళతో దున్ని ఈ సమస్యను అధిగమించవచ్చు. లోతు సాగళ్ళను 60 సెంటీమీటర్ల దూరంలో అడ్డంగా, నిలువుగా రెండు వైపులా తోలాలి. వీటితో పాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు[...]
  • మాగాణిలో ఆరుతడి పంటలకు దుక్కి సమస్య గల భూములు:మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పైరుకు అనువైన మంచి దుక్కి చేయడం ఒక ప్రధాన సమస్య. వరి తరువాత ఆరుతడి పంటలు వెయ్యటానికి భూమిని దున్నగానే పెళ్ళలు పెద్దవిగా లేస్తాయి. అందువల్ల వేసిన పైరు సరిగా మొలకెత్తదు. మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మొదట మామూలుగా నాగళ్ళతో దున్నిన తర్వాత ట్రాక్టరుతో నడిచే తిరుగు దంతె లేదా పళ్ళ దంతెతో తేలికగా దున్నితే పెద్ద పెళ్ళలు[...]
  • తీవ్రవాలు కలిగిన భూములలో నేలకోత అధికంగా ఉండటమే కాక భూసారం తగ్గటంతో పాటు నేల నీటి నిల్వశక్తి తగ్గి, బెట్ట పరిస్థితులు వేగంగా వచ్చి పంట దిగుబడి తగ్గుతుంది. మూడు, నాలుగు శాతం వరకు వాలువున్న నేలల్లో వాలుకు అడ్డంగా కాంటూరు సేద్యం చెయ్యడం ద్వారా ఈ నేలల ఉత్పాదకతను గణనీయంగా పెంచవచ్చు. కాంటూరు సేద్యానికి వీలు కలిగించేందుకు వాలుకు అడ్డంగా ప్రతి మీటరు నిలువుకు కాంటూరు 'కీ' లైన్లను ఏర్పాటు చెయ్యాలి.
  • పైరు వేసిన 3 - 4 వారాల తర్వాత పెద్ద నాగలితో ప్రతి 3.5 మీటర్ల దూరంలో వర్షపు నీరు సంరక్షణకై వాలుకు అడ్డంగా కాంటూరు కీలైన్లను సమాంతరంగా లోతు నాగలి సాలు ను వేయాలి. పైరు వేసిన 25 రోజుల తర్వాత పైరు సాలుకు అనుగుణంగా బోదెలు, కాల్వల నిర్మాణం కూడా వర్షపు నీటి సంరక్షణ మరియు సద్వినియోగానికి ఎంతో దోహదపడుతుంది. వీటి వల్ల మెట్ట పైర్ల దిగుబడి 20 నుండి 25 శాతం వరకు[...]
  • నేల వాలు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు కాంటూరు గట్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ గట్టు వరద నీటి వేగాన్ని ఆపి, నేలలో నీటి నిల్వను పెంచుతాయి. ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో పైరు బెట్టను దీర్ఘకాలం ఎదుర్కొనే వీలుంటుంది. వీటిని ఏర్పాటు చేసుకొనేటప్పుడు ప్రతి మీటరు నిలువుకు ఒక గట్టును నిర్మించాలి.
  • తేలిక పాటి నేలల్లో మరియు వార్షిక వర్షపాతం 600 మిల్లీ మీటర్ల కన్న తక్కువ ఉన్న ప్రాంతాల్లో కాంటూరు గట్లు బాగా ఉపయోగపడతాయి. వార్షిక వర్షపాతం 600 మిల్లీ మీటర్ల కన్న ఎక్కువగా ఉన్న లేదా నీటిని వేగంగా పీల్చే గుణం తక్కువగా ఉన్న ఎడల వాలు గట్లను నిర్మించవచ్చు. వట్టివేరు గడ్డి మొక్కలతో జీవగట్లను కూడా కాంటూరు గట్లకు బదులుగా పెంచవచ్చు.
  • వట్టి వేరు గడ్డి మొక్కలను కాంటూరు గట్లు మాదిరిగానే కాంటూరు మీద వేయాల్సి వుంటుంది. బెట్టను తట్టుకొని, పశువులు తినని, తక్కువ నీరు అవసరమయ్యే ఇతర స్థానిక గడ్డి జాతి మొక్కలను కూడా వట్టివేరుకు బదులుగా జీవగట్టు నిర్మాణానికి ఉపయోగించవచ్చు.ప్రత్యామ్నాయంగా కాంటూరు గట్టుకు బదులుగా చిన్న మట్టి గట్టును నిర్మించవచ్చు. ఈ మట్టి గట్టు ఎగువ వైపు గట్టును అనుకొని వట్టివేరు మొక్కలను ప్రతి 10 - 15 సెంటీమీటర్లకు ఒక మొక్కను నాటితే ఇవి కూడా[...]
  • అధిక వాలు గల నేలల్లో అధిక వర్ష సమయంలో నేల కోత లేకుండా వరదనీరు వెళ్ళటానికి కాంటూరు గట్లను కొద్దిగా వాలు ఇచ్చి నిర్మించాలి. రేగడి భూముల్లో 0.1 నుండి 0.2 శాతం వాలు సరిపోతుంది. మధ్యస్థపు నేలల్లో 0.3 నుండి 0.4 శాతం వాలు ఇవ్వవచ్చు. ఇదే ఇసుక నేలల్లో 0.5 శాతం వరకు వాలు ఇవ్వవచ్చు.
  • కాంటూరు వాలు గట్టు 400 మీటర్లకన్నా పొడవుగా నిర్మించి నేల కోత లేకుండా వరదనీరు పోవడానికి వాలుగు అనుగుణంగా ప్రత్యేకంగా వరద కాలువలను నిర్మించాల్సి ఉంటుంది. ఈ కాల్వలోని నీటిని పొలాల్లోకి నీటి కుంటలలోకి మళ్ళించాలి. ఈ గుంటలలోని నీటిని పశువులు త్రాగడానికి, చెట్ల పెంపకానికి, బెట్ట సమయం లో క్లిష్ట పరిస్థితుల్లో పైరును రక్షించడానికి వినియోగించవచ్చు.
  • చౌడు నేలలు గురించి తెలుసుకుందాం. ఇవి ప్రధానంగా రెండు రకాలు. తెల్ల చౌడు మరియు కారు చౌడు. వేసవి కాలంలో నేలల ఉపరితలం పైన తెల్లటి పొర లాగ నీటిలో కరిగే లవణాలతో పేరుకొని ఉంటుంది. ఈ భూముల్లో విత్తిన గింజలు సరిగా మొలకెత్తవు. మొలకెత్తిన పైరు కూడా ఏపుగా పెరగదు. పొలంలో మొక్కల సాంద్రత కూడా చాలా తక్కువగా ఉంఉటంది. ఈ సమస్యను అధిగమించేందుకు భూమిపై పేరుకొన్న ఉప్పు ను పారతో చెక్కి తీసివేయాలి. పొలాన్ని[...]
  • తెల్ల చౌడు నేలల్లో ప్రతి మడిలో సుమారు 15 సెంటీ మీటర్ల లోతు నీరు నిల్వ ఉండేటట్లు సాగునీటిని పె ట్టాలి. ఈ నీటిలో లవణ శాతం తక్కువగా ఉండాలి. ఈ నీటిని మడిలో 4 లేక 5 రోజులు నిల్వ ఉంచి భూమిలో ఇంకనీయాలి. తర్వాత మురుగు నీటిని లోతైన కాలువల ద్వారా తీసివేయాలి. వర్షపు నీటిని ఈ పనికి ఉపయోగిస్తే 4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. మంచి ఫలితాలుంటాయి.[...]
  • నాణ్యమైన నీరు అందుబాటులో లేనప్పుడు, ఉప్పునీటిని తట్టుకొనగలిగే వరి, చెరకు, జొన్న, సోయ, బొబ్బ ర, సజ్జ, ఆవాలు లాంటి పైర్లను పెంచుకోవాలి. వరిలో సార్వా కాలానికి దీప్తి, ఇంద్ర, పాండురంగ, నెల్లూరు సోన వ మరియు దాళ్వా సాగుకు సోమశిల, నెల్లూరి మషూరి, నెల్లూరు సోన రకాలు, చెరకులో 83వి15, . మిరపలో భాస్కర ఆవాలులో క్రాంతి, పి.యమ్. 28, వరుణ్ రకాలను ఎంచుకోవాలి.
  • వరి సాగుకు పచ్చి రోట్ట పైర్లు ముందుగా నేలలో పెంచి కలియదున్నాలి. నాటుకు ముందు మంచి నీటిని వినియోగించి 3 - 4 సార్లు నేలలోనికి లవణాలను ఇంకించడం ద్వారా లేదా బయటికి పోయేలా ఏర్పాటు చేసుకోవాలి. నారు వయస్సు 25 - 35 రోజులు ఉండి, కుదురుకు ఎక్కువ మొక్కలు వచ్చేలా నాటు ఏర్పాటు చేసుకోవాలి. సిఫారసు కన్నా 25 శాతం అదనపు నత్రజని ఎరువులను వేసుకోవాలి. నాటిన 15 మరియు 20 రోజులకు జింక్[...]
  • భూసార పరీక్షల ద్వారా క్షారం కూడా అధికంగా ఉంటే సిఫారస్ మేరకు జిప్సంను కూడా వాడుకోవాలి. పప్పు ధాన్యపు పంటలు చౌడును అంతగా తట్టుకోలేవు. మెట్ట ప్రాంతాల్లో బోదెలు, పాళ్ళు నిర్మించి సాళ్ళ మధ్యలో విత్తాలి. బోదె మీద విత్తరాదు. విత్తటానికి ముందు విత్తనాలను ఉప్పు కలిపిన 1 గ్రా లీటరు నీటిలో 2 - 3 గంటలు నానబెడితే, ఉప్పు ప్రభావాన్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది.
  • పశువుల ఎరువు, కంపోస్టు మరియు పచ్చిరొట్ట ఎరువులను వాడాలి. వీటితో పాటు నేల ఆమ్ల గుణాన్ని కలిగించే యూరియాను, వాడితే మంచిది. సైనోబాక్టీరియా అనే సూక్ష్మ బాక్టీరియాను వాడటం వల్ల సోడియం లవణాల వల్ల కలిగే చెడును కొంతవరకు తగ్గించవచ్చు.
  • నీటి వసతి లేని చౌడు భూములను బాగు చేయుటకు సాధ్యపడదు. కనుక అట్టి భూములలో అనువైన చెట్టను నాటవచ్చు. ఈ భూముల్లో 15 సెం.మీ వ్యాసం గల 'ఆగర్' ను వాడి 1.2 - 1.5 మీ. లోతు గుంత వెయ్యాలి. ప్రతి గుంత నుండి తీసిన మట్టిలో 2-3 కిలోల జిప్సం, 7-8 కిలోల సేంద్రీయ ఎరువు కలిపి గుంతలు పూడ్చాలి. ప్రతి గుంతకు 25 గ్రా. నత్రజని, అమ్మోనియం సల్ఫేట్ రూపంలో వేసి మొక్కలు[...]
  • కారు చౌడు నేలల్లో వేసవి కాంలో పైన నలుపు లేక బూడిద రంగు పొరను చూడవచ్చు. వీటిలో మార్పిడి జరిగే సోడియం 15 శాతం కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొద్ది పాటి వర్షం వచ్చినా, నీరు త్వరగా భూమి లోకి ఇంకదు. ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది. సేద్యానికి అనుకూలంగా ఉండదు. ఈ నేలల్లో నీరు ఇంకే స్వభావం తక్కువ కాబట్టి మొదటగా పొలాన్ని చిన్నచిన్న మళ్ళుగా చేసుకొని, మళ్ళ నుండి మురుగు నీరు[...]
  • కారు చౌడు నేలల్ని బాగుచేయడానికి “జిప్సంను” వేయాల్సి ఉంటుంది. జిప్సం మోతాదును భూసార పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. భూసార పరీక్షా ఫలితాలు అందుబాటులో లేకపోతే ఎకరాకు సుమారుగా 1.2 నుండి 1.6 టన్నుల జిప్పాన్ని వేయవచ్చు. జిప్సాన్ని నేలపై చల్లి మట్టిలో కలిసేలా పైన దంతెతో లేదా గొర్రుతో దున్నాలి. మొత్తం జిప్సాన్ని ఒకే దఫాగా వేయాలి. పలు దఫాల్లో వేయకూడదు.
  • కారు చౌడు నేలల్లో జిప్సం వేసిన తరువాత నీటిని నిల్వ కట్టి నేలలో ఇంకేలా చేసి వారం రోజుల తరువాత నీటిని, మురుగ కాలువలోనికి పంపాలి. రేగళ్ళలో తరుచుగా తేలికపాటి తడులను ఇవ్వాల్సి ఉంటుంది.ఒకవేళ నేలలో సున్నం అధికంగా ఉండే, జిప్సానికి ప్రత్యామ్నాయంగా ఐరన్ పైరైట్ను లేదా పొడిచేసిన గంధకాన్ని వాడవచ్చు.
  • పైరైట్ పొడి 5 మిల్లీ మీటర్ల కన్నా తక్కువ సూక్ష్మత్వం కలిగి ఉండాలి. పైరైటు నేలమీద చల్లి మట్టిలో కలిసేలా దంతెతో తేలికగా దున్నాలి. మట్టి తేమగా వుండేటట్లు తేలికపాటి తడిపెట్టి వారం రోజులు గాలికి వదిలి వేయాలి. తరువాత మడిలో నీరు పెట్టి ఇంకేలా చేసి, తరవాత మురుగు కాలువల ద్వారా బయటకు పంపాలి.చెరకు ఫ్యాక్టరీలలో వ్యర్ధ పదార్ధంగా మిగిలే ప్రెస్మడ్ను కూడా జిప్సంకు బదులుగా వాడవచ్చు. ఎకరాకు 1.2 నుండి 1.6 టన్నులు వేయాలి.[...]
  • ఆమ్లనేలలో ఉదజని సూచిక 6.5 కన్నా తక్కువగా ఉంటుంది. పైకి చూడటానికి ఈ నేలలు తేలికగా ఎర్రగా కనపడతాయి. ఈ నేలలను బాగు చేయడానికి సున్నం లేదా ఉక్కు పరిశ్రమలో వ్యర్థపదార్ధంగా మిగిలే బేసిక్స్త్గ్ ను వాడవచ్చు.
  • నిన్న తెలుసుకున్న విధంగా భూసార పరీక్ష ఆధారంగా తేమ నేలల్లో ఎంత సున్నం వేయాలో తెలుసుకోవచ్చు. ఆ ఫలితం అందుబాటులో లేనప్పుడు ఎకరాకు 2 నుండి 3 క్వింటాళ్ళ పొడిచేసిన సున్నాన్ని సాళ్ళలో వేస్తే సరిపోతుంది. మొదట 2-3 సంవత్సరాలు సున్నం బాగా అవసరమయ్యే లెగ్యుమ్ జాతి పైర్లను, కూరగాయలను పండించవచ్చు. సిన సున్నం ప్రభావం 5 సంవత్సరాల వరకు ఉంటుంది. అందువల్ల ఆ తరువాత సంవత్సరాల్లో సున్నం అంతగా అవసరం లేని ఇతర పైర్లను వేయవచ్చు.
  • సున్నం అధికంగా గల నేలలు గుర్తించడం చాలా తేలిక. గలస లేదా ప్రత్యేక పొర రూపంలో ఉన్న సున్నాన్ని చూడగానే తేలికగా గుర్తించవచ్చు. ఈ నేలలో భాస్వరం ఎరువు వినియోగ సామర్థ్యం అతి తక్కువగా ఉండటమే కాక సూక్ష్మ పోషక పదార్థాలైన జింకు, ఇనుము, మాంగనీస్, రాగి లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి.సూక్ష్మ పోషకాలు, ఈ నేలల్లో వేస్తే అంత సమర్థవంతంగా పైరులో లోపాలను సరిదిద్దలేవు. ఫలితంగా ఈ నేలల్లో వేసే పంటల దిగుబడి మరియు నాణ్యతను మెరుగుపర్చలేవు.[...]
  • ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి పంట నష్టాన్ని తగ్గించవచ్చు. ఈ నేలల్లో జనుము మరియు జీలుగను పచ్చిరొట్ట పైర్లుగా పెంచి నేలలో కలియదున్ని మురిగేలా చేస్తే ఫలితం ఉంటుంది. భాస్వరం ఎరువును చేలో వెదజల్లకుండా పైరును సాలులో విత్తేటప్పుడే గింజకున్న 5 సెంటీమీటర్ల లోతు మరియు 5 సెంటీమీటర్ల పక్కన పడేలా విత్తనం మరియు ఎరువును ఒకేసారి వేసే “సీడకమ్ ఫెర్టిలైజర్ డ్రిల్ ” ద్వారా వేయాలి. బదులుగా భాస్వరంతో కలిపిన పశువుల ఎరువు[...]
  • సున్నం అధికంగా గల నేలల్లో పెరిగే నిమ్మ, నారింజ తోటల్లో ఇనుప ధాతు లోపం వల్ల సామాన్యంగా పల్లాకులు కనిపిస్తాయి. ఈ లోపాన్ని సవరించటానికి జనుమును పచ్చిరొట్ట పంటగా పెంచి పాదులో వేసి కుళ్ళనిస్తే పోషఖ లోపాలు ముఖ్యంగా ఇనుప ధాతు లోపం తగ్గుతుంది. దీనితోపాటు ప్రతి పాదులో 25 కిలోల మాగిన పశువుల ఎరువు మరియు 125 గ్రాముల అన్నభేదిని వేస్తే, ఈ లోపం సవరించబడుతుంది.సున్నం అధికంగా గల నేలల్లో వేసిన నిమ్మ, నారింజ తోటల్లో[...]
  • ఉరక భూములు గురించి తెలుసుకుందాం. వ్యవసాయానికి సాగు నీరు అవసరమో మురుగు నీరు పోయే వసతి కూడా అంతే అవసరం. డెల్టా భూముల్లో ముఖ్యంగా చౌడు భూముల్లో మురుగు నీరు నిల్వ ఉంటే పంటలు సరిగా పండవు. పొలాల్లో మిగులు నీరు ఉండటం వలన మొక్కల వేరు వ్యవస్థకు సరైన మోతాదులో ప్రాణవాయువు అందక దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ భూములు సహజంగా మురుగుపోనీ, లోతట్టు ప్రాంతాల్లోనే ఉంటాయి. ఈ భూముల్లో మురుగు నివారించే పద్ధతుల గురించి[...]
  • ఉరక భూముల్లో మురుగు పోవుటకు రెండు పద్ధతులు పాటించవచ్చు. మొదటిది ఉపరితర మురుగుతీత. ఉరక భూములలో వాలుననుసరించి ప్రతి 100 మీ లేదా 125 మీ దూరంలో నిలువుగా 1.25 మీ లోతు, 1 మీ. వెడల్పు గల బోదెలను తీసి వాటిని మురుగు కాల్వకి కలపాలి. దీనివలన పొలంలోని పైపొరలో కరిగి ఉన్న లవణాలు ఈ మురుగు నీటి ద్వారా పోతాయి.
  • భూగర్భ మురుగు తీత పద్ధతి: భూమి ఉపరితలమునకు నీటి మట్టము దగ్గరగా ఉండే మురుగు నిల్వలను, భూగర్భ మురుగునీటి పారుదల గొట్టములను అమర్చుట ద్వారా చౌడు భూములను బాగు చేయవచ్చును. ఈ పద్ధతిలో మురుగు నీటిని తీసి నేలలో లవణ సాంద్రతను తగ్గించుటకు 3 లేక 4 అంగళముల వ్యాసం కలిగి 4 రంధ్రములు ఉన్న మట్టి లేదా పి.వి.సి గొట్టములను నేలలోవున్న లవణ సాంధ్రత మరియు నీటి మట్టము ఉన్న లోతుననుసరించి సుమారు 1.25 మీ.[...]
  • మురుగు తీసే వసతిలేని భూములలో సల్ఫైడ్ హాని : పల్లపు ప్రాంతాలలో వరి పండించే పొలాల్లో మురుగు వసతి సక్రమంగా లేనప్పుడు పంటలకు సల్ఫైడ్ వల్ల నష్టం కలుగుతుంది. ఈ భూములలో గల గంధకము సల్ఫైడ్ గా మారుతుంది. సల్ఫైడ్ హాని సాధారణముగా బంక నేలల్లోను, కొత్తగా సాగులోనికి తెచ్చిన నేలల్లోను, ఇనుప ధాతు లోపం ఉన్న నేలల్లోను, మురుగు వసతి సక్రమముగా లేనప్పుడు కలుగుతుంది.
  • సల్ఫైడ్ హాని గమనించిన వెంటనే అక్కడక్కడ పొలం అంతా ఒక అడుగు లోతున కాలువ తీసి నీటిని పొలం నుండి తీసివేయాలి. పొలమును చిన్న చిన్న నెర్రలు ఏర్పడేవరకు ఆరబెట్టాలి. తరువాత నీరు పెట్టాలి. అనువైన పరికరముతో పొలంలో చాళ్ళ మధ్య మట్టి బాగా కదిలేలా చెయ్యాలి. పైరు కోలుకున్న తరువాత నత్రజని ఎరువులు తప్పనిసరిగా వాడాలి.
  • సల్ఫైడ్ హాని వచ్చు పాలంలో కుళ్ళి, సగం కుళ్ళియున్న సేంద్రీయ పదార్థములను వాడరాదు. సల్ఫేటు మూలకం ఉన్న రసాయన ఎరువులను వాడరాదు. ఇనుప ధాతువు ఉన్న ఎరువులను వాడవలెను. ఎర్రమట్టి లో ఇనుప ధాతువు ఎక్కువగా ఉండుట వలన, సల్ఫైడ్ హాని సమస్య ఉన్న భూములలో ఈ ఎర్ర మట్టిని వాడి నివారించవచ్చు.
Scroll to Top