00:00
- 1. అనువైన రకాలు:పెసర: ఎల్. జి.జి 630, ఎల్.జి.జి 607, ఎల్. జి.జి 460 మరియు ఐ.పి.యం 2-14.మినుము: అన్ని కాలాలకు అనుకూల రకాలైనటువంటి ఎల్.బి.జి 884, ఎల్.బి.జి 904, టి.బి.జి 129, జి.బి.జి 1, టి.బి.జి 104, ఎల్.బి.జి 752 మరియు పి.యు. 31 మాత్రమే విత్తుకోవాలి. విత్తన మోతాదు గురించి తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం.
- 2. విత్తన మోతాదు: ఒక చదరపు మీటరుకు సుమారు 30-35 మొక్కలు ఉండేటట్లుగా మినుము అయినట్లయితే ఎకరాకు 16-18 కిలోలు, పెసర అయినట్లయితే ఎకరాకు 12 కిలోలు వెదజల్లితే మంచి దిగుబడులు సాధించవచ్చు. రబీలో మెట్టలో వేసిన పెసర, మినుము పైర్లు పూత మరియు కాయ దశలలో ఉన్నప్పుడు పురుగు తెగుళ్ళకు తగిన సస్యరక్షణ చర్యలు పాటించాలి.
- మారుకా మచ్చల పురుగులు: పూత, పిందె దశలో ఉన్న పంటలో 'మారుక' గూడు పురుగు ఆశించే అవకాశము ఉంది. పంటలో 35 రోజుల వయసులో వేప సంబంధిత మందులు (వేపనూనె / వేప గింజల కషాయం) పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.
- 4. పూత సమయంలో క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా క్వినాల్ఫాస్ 2.0 మి.లీ లేదా ఎసిఫేట్ 1 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పైరులో గూళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంట్రానిలిప్రోల్ 20 ఎస్.సి. 0.3 మి.లీ లేదా ప్లుబెండిఎమైడ్ 0.2 గ్రా. లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. మందులో ఏదైనా ఒక దానిని పిచికారీ చేసుకోవచ్చు.
- 5. తెగుళ్ళ యాజమాన్యం: సాధారణంగా కొరినోస్పారా ఆకుమచ్చ తెగులు, బూడిద, తుప్పు మరియు సెర్కోస్పోరా తెగుళ్ళు ఆశిస్తాయి. వీటిని సమర్థవంతంగా అరికట్టటానికి పైరు 30-35 రోజుల దశలో లీటరు నీటికి 2 మి.లీ హెక్సాకొనజోల్ మరియు 50-55 రోజుల దశలో 1 మి.లీ ప్రాపికొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- 6. వైరస్ తెగుళ్ళ నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. పల్లాకు తెగులు, ఆకుముడత తెగులు మరియు సీతాఫలం తెగులు ఆశించిన మొక్కలను తొలి దశలోనే గమనించి మొక్కలను పీకి వేసి, తెగులు వ్యాప్తికి కారకాలైన రసం పీల్చు పురుగులను నివారించాలి.
- 7. శనగ: శనగ కొన్ని ప్రాంతాలలో శాఖీయ దశలోనూ, మరికొన్ని ప్రాంతాలలో పూత మరియు కాయ దశలో శాఖీయ పెరుగుదల దశలో పచ్చ రబ్బరు పురుగు, పూత, పిందె దశలలో శనగపచ్చ పురుగు ఆశించి నష్టం కలుగచేస్తాయి.
- 8. శనగపచ్చ పురుగు: ఈ పురుగు పంట కాయ దశలో ఎక్కువగా ఆశిస్తుంది. కాయలపై గుండ్రటి రంధ్రాల ను చేసి తలలోపలికి పెట్టి గింజలను తిని వేసి అధిక నష్టం కలుగచేస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. రసాయనిక మందులైన క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా క్వినాల్ఫాస్ 2.0 మి.లీ లేదా థయోడికార్బ్ 1.5 గ్రా లేదా స్పైనోసాడ్ 0.35 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- 9. తుప్పు తెగులు: శనగ పైరు పక్వానికి వచ్చే దశలో ఆకులపై గుండ్రటి పొక్కులు ఏర్పడి మొక్కలు పక్వానికి రాకముందే ఎండిపోతాయి. నివారణకు హెక్సాకొనజోల్ 2.0 మి.లీ లేదా ప్రొపికోనజోల్ 1.0 మి.లీ లేదా ట్రైప్టోక్సీస్ట్రోబిన్ + టెబ్యుకొనజోల్ 0.8 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
- 10. కంది:సస్యరక్షణ: కంది పంటను శనగ మచ్చ పురుగు మరియు మారుకా మచ్చల పురుగు కొన్ని ప్రాంతాలలో ఆశించుట గమనించటమైనది. ఈ పురుగుల నివారణకు నొవాల్యురాన్ 1.0 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేదా కొరాజన్ 0.3 మి.లీ లేదాఫ్లూబెండమైడ్ 0.2 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ లేదా ఇండిక్సికార్బ్ 0.75 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పురుగు మందులు మార్చి మార్చి పిచికారీ[...]
- 11. పంట పిందె, కాయ దశలో కాయ ఈగ ఉధృతి కూడా ఎక్కువగా ఉంటే కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. కావున పిందె దశలో 5% వేప గింజల కషాయం పిచికారీ చేసినట్లయితే తల్లి పురుగు గ్రుడ్లు పెట్టకుండా నివారించుకోవచ్చు. పిందె దశలో థయాక్లోప్రిడ్ 0.7 మి.లి లేదా డైమిథోయేట్ 2.0 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.