Search
Close this search box.

మామిడి కోత దశలో ఆశించే పురుగులు మరియు తెగుళ్ళ యాజమాన్యం

album-art
00:00
  • 1.మామిడి ప్రస్తుతం కోత దశలో ఉంది. ఈ సమయంలో ఎక్కువగా పండు ఈగ ఆశించి నష్ట పరుస్తుంది. దీని నివారణకు కాయ నిమ్మ కాయ పరిమాణంలో ఉన్నప్పుడే పండ్ల కవర్లను కట్టుకోవాలి. దీని వలన పండు ఈగ నుంచి మాత్రమే కాక తామర పురుగు, ఎండ వలన కలిగే నష్టం (సన్ బర్న్) నుంచి రక్షణతో పాటు కాయ మంచి రంగుతో, నాణ్యంగా ఉంటుంది. పండు ఈగ ఎర బుట్టలను ఎకరాకు 6-8 వరకు 5-6 అడుగుల[...]
  • 2. పండు ఈగ ఆశించి రాలిపోయిన పండ్లను ఏరి నాశనము చేయాలి. చెట్టు క్రింద దున్ని కోశస్థ దశను బయట పడేయాలి. అజాడిరక్టిన్ 1500 పి.పి.యం 3 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మలాథియాన్ 2 మి.లీ / లీ లేదా డైమిథోయేట్ 1 మి.లీ / లీ కి 10 గ్రా బెల్లం ను లీటరు నీటిలో కలిపి కాయలు కోసే 3-4 వారాల ముందు పిచికారీ చేయాలి.
  • 3. మామిడి తొడిమ కుళ్ళు తెగులు ముఖ్యంగా బెంగుళూరు (తోతపురి) రకానికి ఎక్కువగా ఆశిస్తుంది. కాయలు తయారు అయి పక్వ దశలో ఉన్నప్పుడు ఈ తెగులును గమనించవచ్చు. ఇందుకుగాను 45 రోజుల కోతకు ముందు ఒక లీటరు నీటికి టెబుకోనజోల్ (50%) + ట్రైపాక్సిస్ట్రోబిన్ (25% డబ్యుజి) 1 గ్రా. పిచికారీ చేసుకోవాలి.
  • 4. కాయ తొలుచు పురుగు అనేది చిన్న కాయ నుండి పెద్ద కాయ దశ (టెంక గట్టి పడే వరకు) వస్తుంది. ఎండు కొమ్మలు, అలాగే పురుగు ఆశించి రాలిన పండ్లను ఎప్పటికప్పుడు తీసి వేసి, నాశనం చేయాలి. కాండము పగుళ్ళలో గల స్థబ్ద స్థితిలో ఉన్న గొంగళి పురుగులను నాశనం చేయాలి. సాయంత్రం వేళ చితుకుల మంటలు, దీపపు ఎరలు (160 వాట్లు) హెక్టారుకు ఒకటి చొప్పున తల్లి రెక్కల పురుగు కోసం ఏర్పాటు చేయాలి.
  • 5. కాండం పగుళ్ళలో బటానీ పరిమాణంలో బిటి 1 గ్రా / లీ పిచికారీ, నిమ్మకాయ సైజులో క్లోరిపైరిఫాస్ 20 ఇ.సి 2.5 మి.లీ లీటరు నీటికి మరియు వేపగింజల కషాయం 5% లేదా వేపనూనె 1500 పి.పి.యం (లీటరు నీటికి 3 మి.లీ) 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
  • 6. కాయ తొలుచు పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు సైపర్మెథన్ 0.5 మి.లీ లేదా బీటా సైపూత్రిన్ + ఇమిదక్లోప్రిడ్ 1 మి.లీ / లీ కలిపి పిచికారీ చేసుకోవాలి. బాక్టీరియా నల్లమచ్చ తెగులు ఆశించిన కాయలపై చిన్న పగుళ్లు ఏర్పడి జిగురులాంటి పదార్థం కారుతుంది. ఈ తెగులు బంగినపల్లి రకంలో అధికంగా కనపడు తుంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరూడ్ 300 గ్రా. లేదా అగ్రిమైసిన్ 60 గ్రా. 100 లీటర్ల నీటిలో కలిపి తెగులు లక్షణాలు[...]
  • 7. పొలుసు పురుగు:ఈ పురుగు ఆకులు, కొమ్మలపై, పండ్లపై ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగులు రసం పీల్చడం వల్ల పీల్చిన ప్రాంతం పాలిపోయినట్లు ఉంటుంది. ఇవి కొన్ని వేల సంఖ్యలో ఆకుల్ని, కాయల్ని ఆశిస్తాయి. కానీ ఎక్కువగా పాత ఆకులపై ఆశిస్తాయి.వీటి నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా / లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా డైక్లోరోవాస్ 1 మి.లీ / లీ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
Scroll to Top