Search
Close this search box.

ఆడిట్

album-art
00:00
  • ఆడిటింగ్ ప్రారంభమయ్యే ముందే సంఘ సిఇఓ మరియు సంఘ సిబ్బంది ఆడిట్ కొరకు అవసరమైన సమాచారము, స్టేట్మెంట్లను తయారు చేసుకోవాలి. అప్పుడే ఆడిట్ త్వరగా మరియు నాణ్యత తో కూడిన ఆడిట్ ను సమర్పించగలరు. ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే అనగా మార్చి 31 న నగదు మరియు డే బుక్ను ముగింపు చేయవలెను. ఆరోజు నగదు నిల్వను సరిచూడవలయును. ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన అన్ని పుస్తకాలను మరియు రిజిష్టర్లను అన్ని వ్యాపార వ్యవహారాలను, సంఘటలనలను నమోదు[...]
  • నగదు, బ్యాంకు మరియు డేబుక్లలను తేదీల వారీగా రశీదు పుస్తకాలను, ఓచర్లను ఇతర డాక్యుమెంట్లను ఓచింగ్ కొరకు ఉంచాలి. దీని వలన ఓచింగ్ త్వరగా జరుగుతుంది. రిజిష్టరు కాబడిన బైలాలు, అనుబంధ బైలాలు వ్యాపార నిబంధనలు ఉద్యోగుల సర్వీసు నిబంధనలు మొదలగునవి ప్రస్తుత తేదీ వరకు అమెండ్మెంట్ చేసిన నిబంధనలతోపాటు ఆడిట్ కొరకు సిద్ధంగా ఉంచాలి. ఫైనాన్సింగ్ బ్యాంకు, డిపార్ట్మెంట్ ద్వారా జారీచేయబడిన సర్క్యులర్ల స్టాక్ ఫైలును కూడా తయారు చేసి, పరిశీలన కొరకు ఉంచాలి.
  • సంఘం పరపతేతర వ్యాపారం చేసినపుడు మార్చి 31న ఉన్న ఎరువులు, క్రిమి సంహారక మందులు, విత్తనాలు మొ|| వాటికి సంబంధించి స్టాక్ స్టేట్మెంట్ను తయారు చేయవలయును. ముగింపు సరుకు విలువను కొనుగోలు ధర లేదా మార్కెట్ ధర ఏది తక్కువ అయితే దానితో లెక్కించవలెను. అమ్మకం ధరను చూపించరాదు. సంఘం ఫైనాన్సింగ్ బ్యాంకు లేదా ఇతర బ్యాంకులలో సేవింగ్స్ ఖాతా, మరియు కరెంటు ఖాతాలలో జరిపిన లావాదేవీలకు సంబంధించి రీకన్సిలేషన్ / కన్ఫర్మేషన్ స్టేట్మెంట్సును, సంబంధిత బ్యాంకు[...]
  • జనరల్ లెడ్జెర్ ప్రకారం ముగింపు నిల్వ బ్యాంకు జారీ చేసిన కన్ఫర్మేషన్ మెమో ప్రకారం సరి చూడవలెను. తేడాలు ఉన్నట్లయితే ఆ తేడాలకు కారణములను తెలుసుకొని, సర్దుబాటు పద్దుల ద్వారాతే డాను సవరించాలి. వీటికి సంబంధించిన సర్దుబాటు పద్దులను మార్చి 31 న సర్దుబాటు కాలములో వ్రాయాలి. కొన్ని తేడాలను సర్దుబాటు పద్దుల ద్వారా సరిచేయలేని ఎడల "బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ" ని తయారు చేసి ఆడిట్కు సమర్పించవలెను.
  • సొసైటీ ఎరువులు, క్రిమి సంహారక మందులు, విత్తనాల వ్యాపారము మొ||వి సప్లై దారుల నుండి రీకన్సిలేషన్ / కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ను తీసుకొనవలెను. ఈ నివేదికలు ఆడిట్కు సమర్పించవలెను. జనరల్ లెడ్జర్కు, కన్ఫర్మేషన్ స్టేట్మెంట్కు మధ్య తేడాలు ఉన్నట్లయితే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ద్వారా ఆ తేడాలను సరిచేయవలెను. వ్యక్తుల, సభ్యుల, సంస్థల నుండి రావలసిన మొత్తాలకు మరియు చెల్లించవలసిన మొత్తాలకు షెడ్యూల్సును విడిగా తయారు చేయవలెను. ఆస్తులు, అప్పులకు సంబంధించి ప్రారంభనిల్వ, డెబిట్, క్రెడిట్ ముగింపు నిల్వతో షెడ్యూలును[...]
  • షెడ్యూల్స్ తయారు చేసేటపుడు షేర్ క్యాపిటల్ మెంబర్స్కు మరియు అసోసియేట్ మెంబర్స్క విడిగా షెడ్యూల్స్ తయారు చేయాలి. డిసిసిబీస్ నుండి అదర్ బ్యాంక్స్ నుంచి బారో చేసిన వాటికి సంబంధించి సికెసిసి, ఎమ్జీ, ఎల్టి, ఎల్టి రీషెడ్యూల్మెంట్, ఎస్చ మొదలయిన వాటికి సెపరేట్గా షెడ్యూల్స్ తయారు చేయలి.
  • లోన్స్ అండ్ అడ్వాన్స్ విషయంలో సికెసిసి, ఎమ్జీ, ఎల్టి, ఎల్టి రీషెడ్యూల్మెంట్, గోల్డ్ లోన్స్, లోన్స్ అగైన్స్ట్ డిపాసిట్స్ మొదలయిన వాటికి షెడ్యూల్స్ విడిగా తయారు చేయాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో షేర్ క్యాపిటల్, రిజర్వ్ ఫండ్స్ కు సంబంధించిన డిపాజిట్స్ మరియు ఇతరములయిన టర్మ్ డిపాజిట్స్ . గురించి షెడ్యూల్స్ తయారు చేసి సంబంధిత లెడ్జెర్స్ తో మరియు జనరల్ లెడ్జర్ ప్రకారం బాలెన్స్ ను సరిచూసి ఆడిట్కు సమర్పించవలెను.
  • డిసిసిబి లేదా ఇతర బ్యాంకుల నుండి తీసుకున్న ఋణాలు మరియు వాటిలో నుండి పెట్టుబడులకు సంబంధించి కన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ ను తీసుకుని వాటిని సొసైటీలో తయారు చేసిన షెడ్యూల్స్తో వెరిఫై చేయాలి. సొసైటీ యొక్క ఎన్పీఎ మీద ఐఆర్ఎ్స నార్మ్స్ ప్రకారం ప్రొవిజన్ ఏర్పాలు చేయాలి. ఈ ప్రొవిజన్ ఏర్పాటు చేయుటకు సొసైటీకి రావలసిన అప్పులు మరియు అడ్వాన్సులను ఒకో వ్యక్తికి సంబంధించిన వడ్డీ ఒక చోట వ్రాసి ప్రుడెన్షియల్ వార్మ్స్ ప్రకారం షెడ్యూల్స్ ను తయారు[...]
  • ప్యాక్క సంబంధించి ఎన్ఎఎ ఆస్తుల మీద ప్రొవిజన్ ఏర్పాటు చేయవలెను. ఈ ప్రొవిజన్ ఏర్పాటు చేయుటకు సొసైటీకు రావలసిన అప్పులు మరియు అడ్వాన్సులు ఒక వ్యక్తికి సంబంధించి అన్ని అప్పులు ఒక చోట వ్రాసి, ప్రుడెన్షియల్ నిబంధనల ప్రకారం వాటిని వర్గీకరించి షెడ్యూల్స్ను తయారు చేయవలెను. అన్ని రకముల అప్పులు మరియు అడ్వాన్సులు ఈ షెడ్యూలు నందు పొందుపరచవలెను. అనగా ఆస్తులు మరియు అడ్వాన్సులకు సంబంధించిన వర్గీకరణ నివేదికను తయారు చేసి ఆడిట్ కొరకు తయారు చేయవలసిన[...]
  • వాయిదా మీరని అప్పులపై వడ్డీని లెక్కించవలెను. సికెసిసి మరియు ఇతర అప్పులలో అప్పులన్నీ ఒకే సారి డిమాండ్ వచ్చినపుడు వాయిదా తేదీమార్చి 31కి తర్వాత ఉన్నప్పుడు వాయిదా మీరని వడ్డీగా లెక్కించ వలెను. ప్రస్తుత విధానం ప్రకారం పంట అప్పులకు సంబంధించి వాయిదా తేదీ పంట అప్పు ఇచ్చిన తేదీ నుండి ఒక సంవత్సరం ఆడిట్ తేదీ నాటికిఅనగా మార్చి 31కి వాయిదా తేదీ దాటిన పంట అప్పుల మీద వడ్డీని వాయిదా మీరిన వడ్డీ గా[...]
  • దీర్ఘకాలిక అప్పుల విషయంలో వాయిదాలను పరిశీలించి గడువు తేదీ దాటిన అప్పుల మీద వడ్డీని వాయిదా మీరిన వడ్డీగానూ, గడువు తేదీ రాని అప్పులపై వడ్డీని వాయిదా మీరని వడ్డీగానూ గుర్తించవలయును. రావలసిన వడ్డీ వివరాలను అప్పుల షెడ్యూలుకు అదనముగా ఒక కాలంలో ప్రత్యేకంగా తయారు చేయాలి.
  • పెట్టుబడులపై రావలసిన వడ్డీని మార్చి 31నకు లెక్కించి రావలసిన వడ్డీగా పరిగణించి ఆడిట్ కొరకు సమర్పించవలెను. డిసిసిబి లేదా ఇతర బ్యాంకులలో పెట్టుబడిగా ఉంచిన రిజర్వుఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్లు మొదలగు పెట్టుబడుల మీద రావలసిన వడ్డీని లెక్కించవలెను. రిజర్వుఫండ్, మరియు రాని బాకీల నిధి మొదలగు పెట్టుబడుల వడ్డీ మార్చి 31 వరకు చెల్లించవలసినది లెక్కించి, సర్దుబాటు ఎంట్రీ వేయాలి. డిసిసిబి లేదా ఇతర బ్యాంకులలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ యొక్క డ్యూ డేట్ దాటినప్పటికీ వాటిపై[...]
  • సొసైటీ లో బారోయింగ్స్ మీద చెల్లించవలసిన వడ్డీని లెక్కించవలెను. ఇందులో వడ్డీని రెండు రకములుగా తయారు చేయవలెను. ఓవర్ డ్యూస్ మరియు నాన్ ఓవర్ డ్యూస్ మీద చెల్లించవలసిన వడ్డీని సెపరేట్గా లెక్కించవలెను. సొసైటీ బ్యాంకులకు చెల్లించవలసిన ఋణాలను మరియు చెల్లించవలసిన వడ్డీ వివరాలనలు పేర్కొనవలెను. లెక్కించిన వడ్డీని బ్యాంకు వారు ఇచ్చి రికన్సీలేషన్ మెమోతో సరిచూసి తే డాలు ఉన్చచో అడ్జస్ట్మెంట్ ఎంట్రీ వ్రాయవలెను. అలాగే గత సంవత్సరం ఋణాలపై చెల్లించవలసిన వ డ్డీని పరిగణనలోకి[...]
  • సొసైటీ చెల్లించవలసిన డిపాజిట్లపై డిపాజిట్ చేసిన తేదీ నుండి మార్చి 31 వరకు చెల్లించవలసిన వడ్డీని లెక్కించాలి. డిపాజిట్లకు సంబంధించి తయారు చేసిన షెడ్యూల్సునందు చివరి కాలంలో ప్రతీ డిపాజిట్ ఎదురుగా చెల్లించవలసిన వడ్డీని లెక్కించి వ్రాయవచ్చును. గత సంవత్సరములో డిపాజిట్లపై చెల్లించవలసిన వడ్డీని పరిగణలోనికి తీసుకొని మార్చి 31 తేదీని జర్నల్ ఓచర్ ఉపయోగించి అడ్జస్ట్మెంట్ ఎంట్రీ వేయాలి.
  • ఈ ఆర్థిక సంవత్సరం ఖర్చులు, ఆ సం॥లో చెల్లించకపోయిన, ఇటువంటి ఖర్చును ఆడిట్ రిపోర్టులో చూపించాలి. ఉదాహరణకు మార్చి నెల జీతాలు మార్చి నెలలో చెల్లించక పోయినప్పటికీ మార్చి నెల జీతాల లోనికి తీసుకోవాలి. ఇందుకు సంబంధించి, జర్నల్ ఓచరు ఉపయోగించి మార్చి 31 న సర్దుబాటు పద్దు వ్రాయాలి. ముందుగా చెల్లించిన ఖర్చులను కూడా ప్రస్తావన సంవత్సరంలోనికి లెక్కలోనికి తీసుకొనవలెను. సంఘంలో ఇన్సూరెన్సు రెండు సంవత్సరములకు చెల్లించినపుడు రెండవ సం॥పు ఇన్సూరెన్సు, ప్రస్తుత సం॥పు ఖర్చులలో[...]
  • వడ్డీ కాకుండా ఇతర ఆదాయాలు, ఈ ఆర్థిక సంవత్సరంలో రాకపోయిన, ఈ సం॥పు ఆదాయం అయినపుడు ఆడిట్లోనికి తీసుకొని ఆడిట్కు సమర్పించవలెను. ఇందుకు సంబంధించి రావలసిన ఆదాయాలకు మార్చి 31 న జర్నల్ ఓచరును ఉపయోగించి సర్దుబాటు పద్దు వ్రాయాలి. సంఘంలో ఉన్న స్థిరాస్తుల వివరాలు ఒక పట్టిక రూపంలో తయారు చేసి ఆడిట్కు సమర్పించవలెను. తరుగుదల వివరములు తెలుపుతూ ఈ స్థిరాస్థుల వివరాలు పేర్కొనవలెను. ఇందుకు సంబంధించి తరుగుదలకు గాను మార్చి 31 న జర్నల్[...]
  • ఆస్తులపై ఉన్న వివిధ ఋణగ్రస్థుల నుండి రావలసిన మొత్తాలలో వసూలు అయ్యే అవకాశం ఉన్నవి, వసూలు అవకాశం లేని అప్పులను డేట్ వైజ్ విడిగా ఆడిటర్కు సమర్పించవలెను. వివిధ ఋణగ్రస్థులకు సంబంధించి వారి నుండి కన్ఫర్మేషన్ స్టేట్మెంట్స్ కూడా తీసుకొనవలెను. ఋణగ్రస్థుల నుండి వసూలు అయ్యే అవకాశం లేనపుడు 100% ప్రొవిజన్ చేయాలి. వసూలు అవుతుందనే నమ్మకం ఉన్నప్పుడు ప్రుడెన్షియల్ నిబంధనలననుసరించి ప్రొవిజన్ చేయాలి. గత సం||లో ఋణగ్రస్తుల మీద ఏర్పాటు చేసిన ప్రొవిజన్ ను పరిగణలోనికి[...]
  • సంఘమునకు రావలసిన అప్పులు మరియు అడ్వాన్సులను ప్రుడెన్షియల్ నిబంధనలననుసరించి “క్లాసిఫికేషన్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్వెస్ " షెడ్యూలు తయారు చేయాలి. ఆ షెడ్యూలు మరియు ప్రుడెన్షియల్ నిబంధనల ఆధారముగా సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్ మరియు లాస్ అప్పులకు ప్రొవిజన్ లెక్కించాలి. గత సం॥ లో ఏర్పాటైన ప్రొవిజన్లను దృష్టిలో ఉంచుకుని సబ్స్టాండర్డ్, డౌట్ఫుల్ మరియు నష్ట అప్పులకు సంబంధించిన ప్రొవిజన్లకు మార్చి 31 న జర్నల్ ఓచరు ఉపయోగించి సర్దుబాటు పద్దు వ్రాయాలి.
Scroll to Top