00:00
- 1. మామిడి, నిమ్మ జాతుల తరువాతి స్థానంలో ఉన్న అరటి విస్తీర్ణం, ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దాదాపు ఏడాదిపాటు పొలంలో ఉండే ఈ ఉష్ణమండల పంటలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. అయితే కాయ నాణ్యతను బట్టి, మార్కెట్టులో ధర ఉంటుంది కాబట్టి, గెల సమయం నుండి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు.
- 2. గెలలు వేసే సమయానికి చెట్టుకు కనీసం 12-13 ఆకు పచ్చని ఆకులు కలిగి ఉండాలి. లేనిచో గెలలోని కాయల ఎదుగుదల సరిగా ఉండకపోవడమే కాకుండా, కొన్ని సార్లు కాయలోని గుజ్జు పసుపు రంగులో మారి కనిపిస్తుంది.
- 3. సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టడం వలన ఎటువంటి పోషక లోపాలు లేకుండా గెల ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. గెలలోని హస్తాలన్నీ విచ్చుకున్న తరువాత 5వ, 15వ, 25వ, 35వ రోజుల్లో (4 సార్లు పది రోజుల వ్యవధితో) సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (0-0-50) 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- 4. అరకిలో ఆవు పేడకి, 100 మి.లీ నీరు, 7.5 గ్రా. యూరియా, 7.5 గ్రా. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కలిపిన మిశ్రమాన్ని మందపాటి ప్లాస్టిక్ కవర్లో కట్టి, 9 అంగుళాల దూరంలో 60 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించిన గెల చివరి భాగానికి కట్టినట్లయితే, నత్రజని, పొటాష్ లను గెల నేరుగా తీసుకొని కాయ పరిమాణం, నాణ్యత పెంచేందుకు దోహదపడుతుంది. ఈ పద్ధతిలో 18-20 శాతం అధిక దిగుబడిని పొందవచ్చు.
- 5. కాయ పగుళ్ళు ఉంటే నీటి తడులు సక్రమంగా ఇవ్వడంతో పాటు బోరాన్ లేదా పొటాష్ ధాతు లోపాలు ఉంటే సరిచేసుకోవాలి. పొటాషియం లోపం గమనిస్తే, 5 గ్రా. సల్ఫేట్ ఆఫ్ పొటాష్ / పొటాషియం నైట్రేట్ ను లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధితో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొక్కకు 80 గ్రా. చొప్పున మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను 40 రోజుల వ్యవధితో 4 దఫాలుగా వేసుకోవాలి. బోరాన్ లోపం గమనిస్తే,[...]
- 6. సూక్ష్మ పోషకాల మిశ్రమం 5 గ్రా / లీ. 2వ నెల నుండి 5వ నెల వరకు ప్రతి నెల పిచికారీ చేయాలి. సూక్ష్మ ధాతు మిశ్రమాన్ని మొక్కకు నేల ద్వారా అందించడము కంటే ఆకులపై పిచికారీ చేయడం మంచిది. బిందు సేద్యము ద్వారా సూక్ష్మ పోషకాలను ఇవ్వదలచినప్పుడు చిలేటెడ్ రూపములో వున్న పోషకాలను ఎకరానికి 2 కిలోల చొప్పున ఇవ్వాలి. అరటి కోసమే ప్రత్యేకముగా తయారు చెయ్యబడిన ఆర్కా బనానా స్పేషల్ (ఎకరాకు 10[...]
- 7. 5 వ నెల నుండి పంట కోత వరకు నెలకి ఒక సారి 75 గ్రాముల ఆర్కా బనాన స్పెషల్ ను 15 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీనిలో రెండు నిమ్మకాయల రసము మరియు ఒక షాంపూ ప్యాకెట్ కలుపుకోవాలి. అదే విధముగా జాతీయ అరటి పరిశోధనా సంస్థ వారి ఐ.సి.ఎ.ఆర్.- ఎన్.ఆర్.సి. బనానా శక్తిని కూడా మొక్క నాటిన 3, 5, 7 నెలల తరువాత 2 శాతం ద్రావణంగా పిచికారీ[...]
- 8. గెల బరువు వలన లేదా గాలులు అధికంగా ఉన్నప్పుడు చెట్లు విరిగే అవకాశం ఉన్నందున, వెదురు కర్రతో ఊతం ఇవ్వాలి. 3 వ నెల నుంచి వచ్చే పిలకలను ప్రతి 20 రోజులకు ఒకసారి కొడవలితో కోసి తీసివేయడం వలన గెల మంచిగా ఎదుగుతుంది. గెలలకు దగ్గరగా ఉన్న ఆకుల వలన కాయలపై రాపిడి జరిగి మచ్చలు ఏర్పడే అవకాశం ఉన్నందున అటువంటి ఆకులను, అలాగే తెగుళ్లు ఆశించిన ఆకులను తీసి వేసుకోవాలి. ఆఖరి హస్తం[...]
- 9. కాయలు పక్వానికి రాకుండా గెలల పైనే పండిపోతుంటే, శీతాకాలంలో పొటాషియం డైహైడ్రోజెన్ ఆర్థోఫాస్ఫేట్ 5 గ్రా./ లీ. 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. వేసవిలో సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రా. / లీ. మార్చి నెల నుండి 10-15 రోజులకు ఒకసారి గెల అంతా తడిచేలా పిచికారీ చేయాలి.
- 10. కాయ గుజ్జు పసుపు రంగులో మారడం అనే సమస్య సిగటోకా ఆకుమచ్చ తెగులు ఆశించిన మొక్కల్లో, పొటాషియం, మెగ్నీషియం మరియు బోరాన్ లోపాలు ఉన్నప్పుడు, మొక్కకు తగినన్ని ఆరోగ్యకరమైన ఆకులు లేనప్పుడు, పాలంలో నీరు నిలిచి ఉన్నప్పుడు, మొక్క నీటి ఎద్దడికి గురవ్వడం వంటి సంధర్భాలలో గమనించవచ్చు. సమస్యను బట్టి తగిన చర్యలు గురించి తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం.
- 11. అరటిలో రసం పీల్చు పురుగులు ముఖ్యంగా తామర పురుగు నివారణకు బెల్ ఇంజెక్షన్ ను ఇవ్వాలి. ఇందుకోసం లేత గెల నిటారుగా ఉన్నప్పుడు, పై నుండి 1/4 భాగం కింద 30 డిగ్రీల కోణంలో ఇమిడాక్లోప్రిడ్ (0.3 మి.లీ, 500 మి.లీ నీటిలో కలిపిన ద్రావడం) 1 మి.లీ ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాలి. హస్త్రాలు విచ్చుకోకముందే లేత కాయలను తామర పురుగు ఆశించి, వాటిని గీకి రసం పీల్చడం వలన కాయల మీద గార వంటి[...]
- 12. అరటి కాయలో కుళ్ళు తెగులు గురించి తెలుసుకుందాం. కాయల ముచ్చిక ఉన్న ఆడ పూల అవశేషాలను 10-15 రోజుల తరువాత తీసివేయాలి. ఈ అవశేషాలను తామర పురుగుకు స్థావరాలుగా ఉండడమే కాక, వర్షాకాలంలో కాయ ముచ్చిక కుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంది. తెల్ల చక్కరకేళి, కూర రకాలు, గ్రాండ్ నైన్ రకాలలో ఈ సమస్యని ఎక్కువగా గమనించవచ్చు. ఈ తెగులు సోకిన కాయలను తొలి దశల్లోనే గుర్తించి తీసి వేసి తగులబెట్టాలి. గెలలు పూర్తిగా[...]
- 13 . అరటి లో కుళ్ళు తెగుల నివారణ గురించి తెలుసుకుందాం. గెలలోని ఒకటి లేదా రెండు చివరి హస్తాలను తీసివేయాలి. తద్వారా గెలలోని మిగతా హస్తాలు పూర్తిగా తయారు అవుతాయి. అలాగే పిలకలను తీసివేసి మట్టిని ఎగదోయాలి. వేసవి కాలంలో గెల పైన ఉండే తొండం మీద సూర్య రశ్మి ఎక్కువగా పడితే, తొండం కుళ్ళి, గెల బలహీన పడి, కింద పడిపోతుంది. తొండం కుళ్ళు తెగులు నివారణకు గెల కిందకి వంగిన తరువాత తొండం[...]
- 14. ఎండ నుండి అరటికాయల సంరక్షణ గురించి తెలుసుకుందాం.ఎండ నుండి గెలలను సంరక్షించుకోవడానికి గెలల చుట్టూ అరటి ఆకులను చుట్టాలి. దీనితో పాటుగా మచ్చలు ఏర్పడిన తొండం పూర్తిగా తడిసేలా కార్బండెజిమ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తరువాత 2% రంధ్రాలను కలిగినా 100 గేజీ తెలుపు రంగు పాలిథీన్ సంచులను తొడగాలి. శీతాకాలంలో 2% రంధ్రాలు కలిగిన నీలం రంగు సంచులకు తొడగాలి. దీని[...]
- 15 జి.ఎస్.ఎం మందం ఉండి, రోల్స్ లాగా దొరికే పాలీ ప్రొఫెలీన్ సంచులను కూడా ఉపయోగించవచ్చు. ఈ రకం సంచులకు రంధ్రాలు అవసరం లేదు. సంచులను గెలకు పై భాగంలో మాత్రమే కట్టి, కింద భాగం కట్టకుండా వదిలేయాలి. లేనిచో వర్షాకాలంలో నీరు చేరి, కాయ కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీని ద్వారా కాయలు నాణ్యంగా, మచ్చలు లేకుండా, మంచి రంగు, సైజు కలిగి ఆకర్షణీయంగా ఉండి, త్వరగా పక్వానికి వస్తాయి.
- 16. కాయల కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. గెలలు కోసే 20 రోజుల ముందు ఎటువంటి మందులను పిచికారీ చేయరాదు. గెలలను మార్కెట్ అవసరానికి అనుగుణంగా చల్లటి సమయంలో కోసుకోవాలి. స్థానిక మార్కెటుకు అయితే పూర్తిగా తయారైన గెలను దూర ప్రాంతాలకు 80-85 శాతం తయారు అయిన గెలను ఎగుమతులకు 70-75 శాతం తయారైన గెలలను కోయాలి.
- 17. హస్తాలను కత్తిరించిన వెంటనే ఒక శాతం ఆలమ్ (పొటాషియం అల్యూమినమ్ సల్ఫేట్) ద్రావణంలో ముంచి, ఆరిన తరువాత 150 గేజ్ పరిమాణం కలిగిన పాలిథీన్ సంచులలో నిల్వ చేసుకోవాలి. దీని ద్వారా నిల్వలో కాయపై మచ్చలు (ఆంత్రాక్సోస్), హస్త మొదలు కుళ్లు, కాయ ముచ్చిక కుళ్ళు రాకుండా నివారించుకోవచ్చు.