Search
Close this search box.

వేసవి కాలంలో టమాటా సాగు

album-art
00:00
  • 1. టమాట ప్రపంచమంతట బాగా పండించే కూరగాయ పంట. మన రాష్ట్రములో కూడా అధికంగా పండిచబడుచున్నది. దీనిని అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగాను, జ్యూసుగాను, కెచప్, ఫ్యూరీ, పేస్టు మరియు పౌడరుగా అధికంగా వాడతారు. టమాటాలో అధికంగా విటమిన్ 'సి' ఉంటుంది. వీటి ఉత్పత్తులకు అనేక దేశాలలో గిరాకీ ఉంటుంది.
  • 2. వాతారణం:టమాట శీతాకాలపు పంట. మంచును అసలు తట్టుకోలేదు. విత్తనము 18.5 డిగ్రీల నుండి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ లో బాగా మొలకెత్తుతుంది. కాయ 15 డిగ్రీల నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు బాగా కట్టుతుంది. టమాట ఎక్కువ ఉష్ణోగ్రతను గాని, ఎక్కువ వర్షపాతమును గాని తట్టుకొనలేదు.
  • 3. నేలలుబాగా నీరు ఇంకే బరువైన గరప నేలలు ఈ పంటకు అనుకూలం. వర్షాకాలంలో తేలిక పాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా సాగు చేయచ్చు. ఉదజని సూచిక 6.0 నుండి 7.0 గల సారవంతమైన నేలలు చాలా అనుకూలము.
  • 4. రకాల వివరాలు:వేసవి పంటకు: మారుతమ్, పికెయమ్ - 1, అర్కవికాస్, అర్కసౌరభ్, అర్కాన్సాస్ ట్రావెలర్, బెల్లా రోసా, 216, బ్లాక్ చెర్రీ, సెలబ్రిటీ, కాస్టోలుటో జెనోవేస్, ఎవా పర్పుల్ బాల్, ఫ్లోరిడా 91 బి. హెచ్.ఎన్. ముఖ్యమైనవి.
  • 5. సస్యరక్షణ:పురుగులు:కాయతొలుచు పురుగు: లేత ఆకులను, కొమ్మలను తినివేస్తుంది. కోత దశలో కాయలను తొలచి నాశనం చేస్తుంది. దీని నివారణకు ఎరపంటగా బంతిని వేసుకోవాలి (ఒక వరుస బంతి మొక్కలు ప్రతి 16 వరుసలకు) టమాట కంటే బంతి నారును 20 రోజుల ముందుగా నాటుకోవాలి. ట్రైకోగ్రామా బదనికలను ఎకరాకు 20,000 చొప్పున విడుదల చేయాలి. ఎకరాకు 4 చొప్పున లింగాకర్షణ బుట్టలను పెట్టాలి. వైరస్ ఎకరానికి 250 లార్వాలను సమానమైన ద్రావణాన్ని పిచికారీ చేయాలి.
  • 6. ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలను ఉంచాలి. ఆశించిన పురుగుకు సంబంధించిన బాగా ఎదిగిన క్రిములను ఏరి నాశనం చేయాలి. క్రిమి సంహారక మందులను పిచికారీ చేయుటకు ముందు కాయలను కోయాలి. ఈ పురుగును నివారించుటకు థయోడికార్బ్ 1 గ్రా. లేదా నొవాల్యూరాన్ 1.25 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • 7. పచ్చదోమ:ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చటం వలన, ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి క్రమేపి ఆకు అంతా ఎర్రబడి చివరగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 1 మి.లీ లేదా థయోమిథాక్సామ్ 1 గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • 8. రబ్బరు పురుగు:కాయతొలుచు పురుగు వలనే పంటను నాశనం చేస్తుంది. పురుగుల చివరి దశలో నివారణకు విషపు ఎరలను ( 10 కిలోల తవుడు + 1 లీటరు క్లోరిపైరిఫాస్ + 1 కిలో బెల్లం తగినంత నీటికి కలిపి పాకం చేసి ప ఎలియ పెట్టినది ) పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసి పొలంలో అక్కడ అక్కడ పెట్టాలి. ఈ పురుగు ని వారణకు కాయతొలుచు పురుగుకు చెప్పబడిన సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి.
  • 9. టమాట పిన్ వార్మ్:ఈ పురుగు వలన పంట నష్టం దాదాపు 20-80 శాతం వరకు అంచనా వేయడం జరిగింది. ఈ పురుగు ఆరుబయట పండించే పంటలనే కాకుండా హరిత గృహాలలో కూడా సరైన జాగ్రత్తలు పాటించకపోతే టమాట పంటను ఆశించి నష్టం కలుగచేస్తుంది.నివారణ: పొలంలో ఎకరాకు 4-5 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. కాయలను మరియు పండ్లను ఏరి కాల్చి వేయాలి. ఈ పురుగు నివారణకు డెల్టామోత్రిన్ లేదా లామ్డా సైహాలోత్రిన్ 1.0 మి.లీ లేదా[...]
  • 10 తెగుళ్ళు:నారుకుళ్ళు తెగుళ్ళు: ఈ తెగులు ఆశించడం వలన, నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి నారు గుంపులు, గుంపులుగా చనిపోతుంది. విత్తటానికి ముందు తప్పనిసరిగా 3 గ్రా. థైరం లేదా మాంకోజెబ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. పిదప ట్రైకోడెర్మా విరిడే అనే జీవ శిలీంద్ర నాశిని 4 గ్రా. ఒక కిలో విత్తనానికి కలిపి నారు పోయాలి. నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి నారుమడిని[...]
  • 11. ఆకుమాడు తెగులు (ఎర్లీల్లైట్):
  • 12. వడలు తెగులు (బాక్టీరియల్ విల్ట్):మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుకు మారి, తొడిముతో సహా రాలి, తర్వాత మొక్క వడలిపోయి, చనిపోతుంది. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తెగులును తట్టుకునే బి.టి - 1 వంటి రకాలను వాడుకోవాలి. నేల ఉదజని 3.6 నుండి 5 వరకు ఉన్న ఆమ్ల భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని అవలంభించాలి.
  • 13. వైరస్ తెగులు (టొబాకో మోజాయిక్):తెగులు సోకిన మొక్కల ఆకుల మీద, అక్కడక్కడ పసుపుపచ్చ మచ్చలు ఏర్పడి, ఆకులు ముడుచు కొని, మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెళుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే రసం పీల్చే పురుగులు (పేనుబంక) నివారణకు అంతర్వాహిక కీటక నాశనులను పిచికారీ చేసుకోవాలి.
  • 14. టమాటా స్పాటెడ్ విల్ట్ వైరస్:టమాట చిగురాకుల పైభాగంలో ఈనెలు గోధుమ వర్ణంకు మారి, ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి, మాడిపోతాయి. మొక్కలు గిడసబారి, పూత పిందెపట్టక ఎండిపోతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే తామర పురుగుల నివారణ కు డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 1 మి.లీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
Scroll to Top