00:00
- బహుళార్థక డ్రమ్ సీడర్ - వరితో పాటు దాదాపు 17 రకాల మెట్ట పంటలను విత్తు చేసే పరికరం ఈ బహుళార్థక డ్రమ్ సీడర్ ఒకేసారి మట్టిని డ్రిల్ చేసి విత్తనాన్ని విత్తిన తరువాత మరల మట్టితో కప్పడం జరుగుతుంది. తద్వారా రైతుకు సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ డ్రమ్ సీడర్ తడి మరియు పొడి నేలల్లో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది.
- బిడిఎస్ ని ట్రాక్టరుతో లాగి విత్తవచ్చు, ఎద్దులతో లాగి విత్తవచ్చు. స్వయంగా రైతు చేతితో లాగి విత్తవచ్చు లేదా 5 హెచ్.వి మోటారు తగిలించి విత్తుకోవచ్చును. ఈ డ్రమ్ సీడర్తో వరి పంటలో సాగుకు 3 రెట్లు తక్కువ ఖర్చు అవుతుందని క్షేత్ర స్థాయి పరిశీలనలో ధృవీకరించారు. 10 కంటే ఎక్కువ పంటలలో క్షేత్ర ప్రదర్శనలు చేసారు. డ్రమ్ సీడర్ పంటల సాగు ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు. దాదాపుగా ఐదు వేల మంది[...]