00:00
- ఇటీవల చిరుధాన్య పంటలపై అవగాహన పెరగడం వలన రైతులు చిరుధాన్య పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఆహార భద్రతతో పాటు పోషణ భద్రతను సాధించడానికి ఉపయోగపడతాయి. ఖరీఫ్ లో వర్షాధారంగా ఈ పంటల సాగు చేసి అధిక దిగుబడిని పొందడానికి పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు.
- జొన్న పంట: దీని విత్తన కాలము జూన్ మరియు జులై నెలలు. జొన్న విత్తన మోతాదు ఎకరాకు 4 కిలోలు. జొన్న పంట వేసేముందు కిలో విత్తనానికి 3 గ్రా.ల థైరమ్ లేదా కాప్టాన్తో విత్తన శుద్ధి చేయాలి. మొవ్వు ఈగను నివారించుకోవడానికి థయోమిథాక్సామ్ మందును కిలో విత్తనానికి 3 గ్రా కలిపి విత్తనశుద్ధి చేయాలి. విత్తనాన్ని వరుసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 10-12 సెం.మీ దూరం ఉండేలా విత్తాలి.
- అంతర పంటలు: జొన్న పంటతో కంది అలసంద / ప్రొద్దుతిరుగుడు / శనగ పంటలను 2 వరసలు : 1 వరుస నిష్పత్తిలో సాగు చేయవచ్చు.కలుపు నివారణ మరియు అంతరకృషి: అట్రాజిన్ 50% పొడి మందును ఎకరాకు 800 గ్రా. ల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 25 నుండి 30 రోజులకు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయాలి.
- మొవ్వ తొలుచు ఈగ: నివారణకు కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున విత్తేట ప్పుడు సాళ్ళలో వేయాలి. 14, 21 రోజుల మొక్కలపై థయోడికార్బ్ 1.5 గ్రా లేదా లామ్లాసైహలోత్రిన్ 2 మి.లీ లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి.కాండం తొలుచు పురుగు: నివారణకు విత్తిన 25-35 రోజులలోపు 2 మి.లీ మెటాసిస్టాక్స్ 25 ఇ సి మందు ను లీటరు నీటికి చొప్పున కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. నివారణకు కార్బోఫ్యూరాన్ 3[...]
- సజ్జ పంట విత్తు కాలము జూన్ మరియు జులై నెలలు. సజ్జ పంట విత్తన మోతాదు ఎకరాకు 1.6 కిలోలు. సజ్జ పంట వేసేముందు విత్తనాలను 2% (20 గ్రా. ఉప్పు లీటరు నీటికి) కిలో విత్తనానికి 3 గ్రా.ల చొప్పున థైరమ్ను కలిపి విత్తనాన్ని శుద్ధి చేయాలి.విత్తు దూరం: వరుసల మధ్య 45 సెం.మీ, వరుసలో మొక్కల మధ్య 12-15 సెం.మీ దూరంలో విత్తాలి.
- ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును పాలంలో వేసి కలియదున్నాలి. ఎకరానికి 52 కిలోల యూరియా, 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వేయాలి. మొత్తం భాస్వరం, పొటాషియం ఎరువులను విత్తే రోజు వేయాలి. నత్రజని ఎరువును రెండు సమ భాగాలుగా చేసి ఒక సగ భాగం విత్తేటప్పుడు మిగిలిన సగ భాగం విత్తిన 30 రోజులకు వేయాలి.అంతర పంటలు: సజ్జ పంటతో కంది[...]
- కలుపు నివారణ మరియు అంతరకృషి: విత్తిన రెండు రోజులలోగా అట్రాజిన్ 50% పాడి మందును ఎకరాకు 600 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేస్తే కలుపు మొక్కలను నివారించ వచ్చు. విత్తిన 25-30 రోజులకు గుంటక లేదా దంతితో అంతరకృషి చేయాలి.
- సజ్జ పంటలో వెర్రి తెగులు నివారణకు కిలో విత్తనానికి 6 గ్రా. మెటలాక్సిల్ 35 ఎస్.డి మందును కలిపి విత్తు కోవాలి. పంటలో తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 2 గ్రా.ల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. విత్తిన 21 రోజుల తరువాత లీటరు నీటికి 1 గ్రా. రిడోమిల్ మందును కలిపి పిచికారీ చేయాలి.త్రుప్పు మరియు అగ్గి తెగులు నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1[...]
- రాగి పంట విత్తు కాలము జూన్ - జూలై నెలలు. విత్తన మోతదు: నాటే పద్దతికి ఎకరాకు 3 కిలోల విత్తనంతో 5 సెంట్లలో పెంచిన నారు సరిపోతుంది. ఎకరాకు వెదజల్లే పద్ధతిలో 4 కిలోల విత్తనం కావాలి. కిలో విత్తనానికి 2 గ్రా.ల ట్రైసైక్లోజోల్ 75% డబ్ల్యు. పి మందును కలిపి విత్తనశుద్ధి చేసినచో తొలిదశలో అగ్గి తెగులు రాకుండా నివారించవచ్చు. వరుసల మధ్య 20 సెం.మీ వరుసలో మొక్కల మధ్య 10 సెం.మీ దూరం[...]
- రాగి పంటలో ఎరువుల వాడకం గురించి తెలుసుకుందాం. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును పొలంలో వేసి కలియదున్నాలి. ఎకరానికి 52 కిలోల యూరియాను, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను ఎకరాకు పొలానికి వేయాలి. నత్రజని ఎరువును రెండు సమ భాగాలుగా చేసి, సగ భాగం నాటే రోజు, మిగిలిన సగ భాగం నాటిన 30 రోజులకు పైపాటుగా వేయాలి.రాగి పంటను 8:2[...]
- కలుపు నివారణ మరియు అంతర కృషి: విత్తనం విత్తేటప్పుడు లేదా నారు నాటిన తరువాత పెండిమిథాలిన్ 30% ఎకరాకు 600 మి.లీ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి కలుపును నివారించవచ్చు. నాటిన 25-30 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు ఎకరాకు 400 గ్రా, 2-4 సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పిచికారీ చేయాలి.
- రాగిపంటలో సస్యరక్షణలో భాగంగా అగ్గి తెగులు నివారణకు మచ్చలు కనిపించినప్పుడు లీటరు నీటికి 0.5 గ్రా. ట్రైసైక్లోజోల్ 75% డబ్ల్యూ. పి మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నారు నాటే ముందు బైటాక్స్ మందును 3 గ్రా. లీటరు నీటికి చొప్పున కలిపి ద్రావణంలో నారును ముంచి శుద్ధి చేసి నాటుకుంటే పంటను మొదటి దశల్లో ఆశించే తెగుళ్ళ నుంచి కాపాడుకోవచ్చు. వెదజల్లే విత్తే పద్ధతిలో 2 గ్రా. ట్రైసైక్లోజోల్ 75% డబ్ల్యూ పి[...]
- రాగిపంటలో సస్యరక్షణలో భాగంగా గులాబి రంగు పురుగు: పురుగు ఆశించినప్పుడు లీటరు నీటిలో 2 మి.లీ మెటాసిస్టాక్స్ 25 ఇ సి మందును లీటరు నీటికి చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలి.
- ఈ రోజు కొర్ర పంట గురించి తెలుసుకుందాం. కొర్ర పంట విత్తు కాలము జూన్ - జూలై నెలలు. దీని విత్తన మోతాదు ఎకరాకు 3-4 కిలోలు. కిలో విత్తనానికి 2 గ్రా. కార్బండెజిమ్ తో విత్తన శుద్ధి చేయాలి. దీనిని విత్తే టప్పుడు వరుసల మధ్య 20 సెం.మీ వరుసలో మొక్కల మధ్య 10 సెం.మీ దూరంలో విత్తాలి.
- ఎరువులు: ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును పొలంలో వేసి కలియదున్నాలి. 18 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను విత్తేటప్పుడు వేసుకోవాలి. మరో 18 కిలోల యూరియాను విత్తిన 30 రోజులకు పైపాటుగా వేయాలి.అంతర పంటలు: కొర్ర పంటతో వేరుశనగ పంటను 2 వరుసలు : 1 వరుస నిష్పత్తిలో, సోయాచిక్కుడు / ప్రత్తి / కంది పంటలను 5 వరుసలు : 1 వరుస నిష్పత్తిలో సాగు[...]
- కలుపు నివారణ మరియు అంతరకృషి: ఐసోప్రోట్యూరాన్ మందును ఎకరాకు 400 గ్రా విత్తిన రెండు రోజులలోపు నేలపై పిచికారీ వేయాలి. విత్తిన 20 రోజుల తర్వాత సాళ్ళలో గొర్రుతో ఎడసేద్యం చేయడం వలన కలుపు మొక్కలు రాకుండా నివారించవచ్చును.
- కొర్ర పంటలో సస్యరక్షణ:అగ్గితెగులు: నివారణకు కాప్టాన్ లేదా థైరమ్ 3 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. లీటరు నీటికి కార్బండెజిమ్ 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.వెర్రకంకి తెగులు: నివారణకు 1 గ్రా. థైరమ్ లేదా కాప్టాన్ లేదా మెటలాక్సిల్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. లీటరు నీటికి మెటలాక్సిల్ 1 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా[...]