00:00
- ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు దేశంలోని మూడంచెల విధానంలో షార్ట్ టర్మ్ కోపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ లో క్రింది స్థాయిలో 13 కోట్ల రైతులు దాని సభ్యులుగా ఉండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కీలకమైనవిగా ఉన్నాయి. దేశంలోని అన్ని సంస్థలు ఇచ్చిన కెసిసి రుణాలలో 41% అంటే 3.01 కోట్ల రైతులు, ప్యాక్స్ ద్వారా ఇచ్చిన కెసిసి రుణాలలో 95% అంటే 2.95 కోట్ల చిన్న మరియు సన్నకారు రైతులకు చెందినవి. గ్రామాలలో ప్యాక్స్ వాటి[...]
- షార్ట్ టర్మ్ కోపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ లో మిగిలిన రెండు అంచెలలో జిల్లా స్థాయిలో డిసిసిబిలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులు ఉన్నాయి. నాబార్డ్ చాలా వరకు దేశంలోని రాష్ట్ర సహకార బ్యాంకులను మరియు డిసిసిబిలను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్లోకి తీసుకురావడానికి చొరవతీసుకుంది. అందువలన వారి ఖాతాదారులకు ఆధునికి టెక్నాలజీ తో బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడానికి వీలు కల్పించింది. అయినప్పటికీ, ప్యాక్స్ కి ఇప్పటివరకు సరైన మద్దతు లేని కారణంగా ఈ టెక్నాలజీ ఆవశ్యకతను[...]
- మనదేశంలో పనిచేస్తున్న 95995 ప్యాక్స్ 6,44,089 గ్రామాలను మరియు 90% గ్రామీణ నెట్వర్క్ ను కవర్ చేస్తున్నాయి.మొత్తం గ్రామీణ క్రెడిట్ లో ప్యాక్స్ 13.4% వాటా కలిగి ఉన్నాయి. ప్యాక్స్ క్రింది స్థాయిలో రైతులకు చేరువలో ఉండి, రైతులకు చేరువలో ఉండి, రైతులకు రుణాలను అందించడమే కాకుండా ఎరువులు, మరియు క్రింది స్థాయిలో ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి ఇతర అవసరాలకు తగిన సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మన ప్యాక్స్ అందిస్తున్న సేవలను ఏ వాణిజ్య బ్యాంకు శాఖ[...]
- సొసైటీలో రైతులు, గ్రామీణ చేతివృత్తి నిపుణులు మొదలైన సభ్యుల మధ్య పొదుపు మరియు పరస్పర సహాయాన్ని ప్రోత్సహిస్తాయి. వారి క్రెడిట్ అవసరాలను తీరుస్తాయి మరియు వ్యవసాయ ఉత్పత్తుల ప్రొక్యూర్మెంట్, సప్లై మరియు స్టోరేజ్ ఫెసిలిటీ మొదలైన క్రెడిట్ లింక్డ్ సేవలను అందిస్తాయి.డిసిసిబిలు డైరెక్ట్ లింకేజ్ ద్వారా ప్యాక్స్‌కి డైరెక్ట్ ఫైనాన్స్ ని అందిస్తాయి. డిసిసిబిల ఫైనాన్స్‌పై నియంత్రణ మరియు సమన్వయం కోసం రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధానంగా బాధ్యత వహిస్తాయి.
- సొసైటీలో సభ్యత్వం అనేది కులం, మతం, సంఘం, లింగ బేధం అనే సంబంధం లేకుండా రైతులందరికీ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే సొసైటీలు గ్రామాల్లో సామాజికతను ఐక్యంగా ఉంచుతుంది. పెరిగిన ఉత్పత్తి మరియు ఉత్పాదకత ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆర్థిక సంపద పెరుగుతుంది. అందుకే గ్రామీణ ఆదాయం మరియు ఉపాధి కల్పనలో ప్యాక్స్ పాత్రను తక్కువగా అంచనా వేయలేదు.
- ప్యాక్స్ గ్రామీణ ఆర్థిక సేవలలో కీలక పాత్రధారులుగా మారడానికి స్థానిక కమ్యూనిటీకి వివిధ ఉత్పత్తులు మరియు సేవలను అందించే మల్టీ సర్వీస్ సెంటర్స్ గా రూపాంతరం చెందడం అన్నదిఉత్తమమైన మార్గం. ఇది ప్యాక్స్‌ల వ్యాపార కార్యకలాపాలను సులభతర చేస్తుంది అని విజయవంతమైన సొసైటీల అనుభవాల నుండి స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలోని ముల్కనూర్ కో-ఆపరేటివ్ రూరల్బ్యాంక్ మరియు మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్.కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం సభ్యుల నుండి డిపాజిట్లను స్వీకరించడానికి మరియు[...]
- సొసైటీలు స్మాల్ మరియు మార్జినల్ ఫార్మర్లకు రుణాలను ఇస్తూ వారికి చేరువ కావటం ద్వారావ్యవసాయ రుణాలను అందించే సంస్థలుగా క్రమపద్ధతిలో రూపుదిద్దుకున్నాయి. ఇంకా, సహకార సంస్థలను టెక్నికల్ సపోర్ట్ వారి సభ్యులకు అనేక సేవలను అందించే శక్తివంతమైన వ్యాపార సంస్థలుగా తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటివరకు వివరించిన విషయాలను దృష్టిలో ఉంచుకుని, 'ఆత్మనిర్బర్ భారత్ అభియాన్ 'కు అనుగుణంగా ప్యాక్స్న స్వయం సమృద్ధి చేయడానికి, భారత ప్రభుత్వం 29 జూన్ 2022 న కేంద్ర[...]
- సొసైటీలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి సంబంధించిన వివిధ ఉత్పత్తులు మరియు అత్యాధునికమైన సేవలను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఋణ అవసరాలు వేగంగా మారుతున్నాయి. ఈ అవసరాలను అర్థం చేసుకుని,పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు మరియు అవసరమైన సేవలను అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సొసైటీ యొక్క వ్యాపారాభివృద్ధిని కూడా పెంపొందించవచ్చు.
- భారతదేశంలోని ప్యాక్స్ నేడు రైతులకు, ప్రత్యేకించి చిన్న మరియు సన్నకారు రైతులకు సేవలను అందించడం ద్వారా ఆర్థిక చేయూతను బలోపేతం చేస్తున్నాయి. కంప్యూటరీకరణ ద్వారా ప్యాక్స్ యొక్క కార్యకలాపాలలో పారదర్శకత, సమర్థత మరియు విశ్వసనీయతను పెంపొందిచవచ్చు. ప్యాక్స్ తన సభ్యులకు ఋణాలను వేగవంతంగా అందించడంతో పాటు,అతి తక్కువ వ్యయంతో అతిత్వరగా లావాదేవీలను నిర్వహించడంతో పాటు ప్యాక్స్ లో ఉన్న ఇంబాలెన్స్ కూడా తగ్గించడానికి ప్యాక్స్ కంప్యూటరీకరణ చాలా అవసరం.
- ప్యాక్స్ కంప్యూటరీకరణ10.మన సహకార సంఘాలకు విస్తృతమైన నెట్వర్క్ ఉన్నప్పటికీ టెక్నాలజీని ఉపయోగించని కారణంగా ఈ సంస్థలు తన సభ్యులకు పరిమితమైన సేవలను మాత్రమే అందించ గలుగుతున్నాయి. వీటి ప్రభావం సంస్థ యొక్క లాభ దాయకత మరియు రోజువారీ కార్యకలాపాలపై పడుతూ సంస్థ యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ప్యాక్స్ కంప్యూటరైజేషన్ అత్యావశ్యకమని గ్రహించి అన్ని సొసైటీలు కామన్ అకౌంటింగ్ సిస్టమ్ కలిగి ఉండటం కోసం మరియు ప్యాక్స్ ను జాతీయ స్థాయిలో ఒకే[...]
- 11.త్వరిత గతిన మారుతున్న గ్రామీణ ఋణ అవసరాలను తీర్చడానికి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించడానికి వ్యాపార లావాదేవీలను త్వరితగతిన నిర్వహించడానికి లావాదేవీల ఖర్చును తగ్గించుకోవడానికి, వ్యాపారంలో పోటీని తట్టుకోవడానికి మరియు _ యువతకు తగిన సాంకేతికత ద్వారా సేవలను అందించడానికి ప్యాక్స్ కంప్యూటరైజేషన్ చాలా అవసరం. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కు అనుగుణంగా ప్యాక్స్ ను స్వయం సంపత్తిగా చేయడానికి మన భారత ప్రభుత్వం 29 జూన్ 2022 న కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్ట్ అయిన[...]
- ఈ ప్రాజెక్టును అమలుపరచడం ద్వారా సహకార సంస్థలను శక్తివంతమైన వ్యాపార సంస్థలుగా అభివృద్ధి పరచడం కార్యకలాపాలలో పారదర్శకత సామర్థ్యం మరియు పోటీతత్వాన్ని తీసుకురావడం ప్యాక్స్ యొక్క పనితీరులో విశ్వసనీయతను పెంపొందించడం ప్యాక్స్ కు ఆర్ధిక చేయూతను అందించడం ప్యాక్న నోడల్ సర్వీస్ డెలివరీ పాయింట్ గా ఏర్పాటు చేయడం