Search
Close this search box.

స్ప్రింక్లర్ సేద్యం

album-art
00:00
  • 1. స్ప్రింక్లర్ సేద్యంలో నీటిని తుంపర్లుగా వర్షం వలె మొక్కలు లేదా భూమి ఉపరితలంపైన విరజిమ్మటం జరుగుతుంది. ఈ విధానంలో నీటిని ఒక క్రమమైన పీడనంతో (1.5 నుండి 3 కేజీలు / సెం.మీ) పైపుల్లో ప్రవహింపచేసినపుడు ఆ నీరు పైపులకు అమర్చబడిన స్ప్రింక్లర్ నాజిల్ గుండా తుంపర్లుగా విడి పోయి వర్షపు జల్లుగా నేలపైన పడుతుంది.
  • 2. స్ప్రింక్లర్ పద్ధతిలోని అతి ముఖ్యభాగాన్ని "స్ప్రింక్లర్ హెడ్ " అంటారు. దీనిలో 2 రంధ్రాలు ఉంటాయి. స్ప్రింక్లర్ నాజిల్ నుండి వెదజల్లబడే నీటి బిందువులు పరిమాణం పైపులోని పీడనం (ప్రెషర్ ) వల్ల మారుతుంటుంది. పీడనం తక్కువగా ఉన్నట్లయితే నీటి బిందువులు స్ప్రింక్లర్ నాజిల్ ద్వారా పెద్ద పరిమాణంలో విడుదలవుతాయి. అట్టి పరిస్థితులలో పంటకు మరియు నేలకు హాని కలుగుతుంది. అందుచేత అవసరమైన పీడనంతో స్ప్రింక్లర్ పద్ధతిని నడపాలి.
  • 3. శాశ్వతంగా ప్రధాన, ఉపప్రధాన పైప్ లైన్లను, లేటరల్స్న భూమిలో పాతిపెట్టి కదిలించేందుకు వీలు లేకుండా అమర్చవచ్చు. రెండో ' పద్దతి లో ప్రధాన పైపులు మాత్రమే భూమిలో ఉండి మిగతా పరికరాలు కదిలించేందుకు వీలవుతుంది. మూడో పద్ధతిలో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరొక పొలానికి తీసుకొని పోయి అమర్చుకోవటానికి వీలవుతుంది. https://www.apcobctimlc.in/wp-content/uploads/2023/07/irrig23sprinkler3wav.wav 4. స్ప్రింక్లర్ రకాలలో మొదటిది ఇంపాక్ట్ స్ప్రింక్లర్స్ తక్కువ పరిధి కలవి. అన్ని రకాల పంటలకు (వేరుశనగ, గోధుమ, పొద్దుతిరుగుడు,[...]
  • 5. రెగ్యులేటెడ్ స్ప్రింక్లర్స్: ఎగుడు దిగుడు లేదా ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉన్న నేలల్లో వాడుతారు.పార్ట్ సర్కిల్ స్ప్రింక్లర్స్: నేల అంచుల్లో ఒక ప్రక్క మాత్రమే అర్థవలయం తడిసే విధంగా వాడతారు. పర్ఫోరేటెడ్ పైపులు: పచ్చికలలో మరియు లాన్స్లలో ఎక్కువగా వాడుతారు.
  • 6. స్ప్రింక్లర్ పద్ధతి వలన లాభాలు:స్ప్రింక్లర్ పద్ధతిలో సాంప్రదాయ నీటి పారుదల విధానంలోలాగా పొలంలో నీరు పారించేందుకు కాలువలు, గట్లు ఏర్పాటు చేయనవసరం లేదు. అందువలన పంట, భూమి నష్టపోకుండా పొలం మొత్తం సాగు చేయవచ్చు.
  • 7. సాంప్రదాయ నీటి పారుదల విధానంలో నీరు కాలువల గుండా పారినపుడు పక్కలకి ఇంకి 35% పైగా వృధా అవుతుంది. స్ప్రింక్లర్ పారుదల పద్ధతిలో అటువంటి నష్టం ఉండదు.పంటకు తరుచూ అవసరమయ్యే పరిమాణంలో నీటిని అందించటం వలన ఎదుగుదల బాగా ఉండి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడి సాధించవచ్చు.
  • 8. స్ప్రింక్లర్ పద్ధతిలో నీటిని భూమిలోపలి పొరల్లోకి చొచ్చుకొని పోనీకుండా అవసరమయినంత లోతుకు మాత్రమే ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఇసుక నేలలలో సమర్థవంతంగా నీటి యాజమాన్యం చేపట్టవచ్చు. మొక్కలకు అవసరమయినంత నీటిని ఎక్కువ సార్లుగా తక్కువ మొత్తంలో ఇవ్వవచ్చు.
  • 9. స్ప్రింక్లర్ లో ఉత్పన్నమయ్యే మృదువైన నీటి తుంపరుల వలన భూమిపై అధికంగా నీరు నిలువ ఉండదు. మట్టి గడ్డకట్టదు. అవసరమైన నిష్పత్తిలో గాలి మరియు నీరు భూమిలో ఉంటూ విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. తద్వారా అధిక దిగుబడి సాధ్యమవుతుంది.
  • 10. స్ప్రింక్లర్ పద్ధతి వలన ఎగుడుదిగుడుగా ఉన్న నేలలను, నీటి వసతికన్నా ఎత్తులో ఉన్న భూములను కూడా సాగుచేయవచ్చు. నీరు వర్షం మాదిరి తుంపర్లుగా పడుట వలన పరిసరాలు చల్లబడి అధిక ఉష్ణోగ్రత నుండి పంటలను కాపాడవచ్చు.
  • 11. స్ప్రింక్లర్ హెడ్ : స్ప్రింక్లర్ పరికరాలను అటు ఇటు కదల్చినపుడు స్ప్రింక్లర్ హెడ్ పాడవకుండా జాగ్రత్త వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో స్ప్రింక్లర్ కు నూనె, గ్రీజ్ మిరయు ఇతర లూబ్రికెంట్లు వాడరాదు. అరిగి పోయిన వాచర్లను ఎప్పటికప్పుడు మార్చాలి. మూసుకుపోయిన నాజిల్స్ను శుభ్రపరిచేందుకు ఇనుప చువ్వలను బదులుగా సన్నని పుల్లలను వాడాలి.
Scroll to Top