Search
Close this search box.

సూక్ష్మపోషకాల లోపాలు – సవరణ

album-art
00:00
  • 1. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతోపాటు సూక్ష్మపోషకాల అవసరం చాలా ముఖ్యము. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నా, సూక్ష్మపోషక లోపాలుంటే దిగుబడులు తగ్గుతాయి. అందువలన సాధ్యమైనంత వరకు నేలలోని వాటికి సంబంధించిన ఎరువులు వేసుకొని లోపాలు పంటలపైన రాకుండా నివారించుకోవాలి. సూక్ష్మ పోషకాల్లో జింకు లోపం దాదాపు అన్ని జిల్లాల నేలల్లో గమనించబడింది. మన రాష్ట్రంలోని సుమారు 38 శాతం నేలల్లో ఈ లోపం ఉంది.
  • 2. జింకు లోపం ఉన్న నేలల్లో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేటును ప్రతి మూడు పంటలకు ఒకసారి వేసి లోపాన్ని నివారించవచ్చు. వరి తర్వాత వరి పంటను వరుసగా వేసినట్లయితే ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేటును ప్రతి రబీ పంటకు ముందు వేసి నివారించవచ్చు.
  • 3. ఇనుము లోపం దాదాపు మన రాష్ట్రంలో 5 శాతం మట్టి నమూనాల్లో గమనించబడింది. ఇనుము లోపం, సున్నం అధికంగా ఉండే నేలల్లో మరియు సాగు నీటిలో కార్బోనేట్లు, బైకార్బోనేట్లు అధికంగా ఉండే నేలల్లో గమనించబడలేదు.మామిడి, జామ, సపోట, బత్తాయి, ద్రాక్ష లాంటి పండ్ల తోటల్లో జింకు లోప నివారణకు చెట్టుకు 100-200 గ్రాముల జింకు సల్ఫేటును చెట్లపాదుల్లో వేసి మట్టితో కలపాలి. పంటలపైన లోపం ఉంటే 0.2 శాతం జింకు సల్ఫేట్ పిచికారీ చేయాలి.ఇనుపధాతు లోపం[...]
  • 4. బోరాన్ లోపం కొబ్బరి తోటలు పండించే నేలల్లో ఎక్కువ గమనించబడింది. ఈ లోపాన్ని సవరించడానికి 1 లీటరు నీటికి 1 గ్రాము బోరిక్ ఆమ్లన్ని రెండు సార్లు 10-15 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. ముందు జాగ్రత్తగా ఈ లోప నివారణకు చెట్టుపాదులో 50 గ్రాముల బోరాక్స్న వేయాలి.
  • 5. ప్రొద్దుతిరుగుడు మరియు వేరుశనగ పంటల్లో బోరాన్ లోపం సర్వసాధారణం. ఈ లోపాన్ని సవరించుటకు 0.1 శాతం బోరిక్ ఆమ్లాన్ని (1 లీటరు నీటికి) పైరు వేసిన తర్వాత 30 మరియు 45 రోజుల తర్వాత రెండు సార్లు పిచికారీ చేయాలి.
  • 6. కాలీఫ్లవర్ బోరాన్ లోపం ఎక్కువగా కనబడుతుంది. ఈ లోపాల సవరణకు ఎకరానికి 8 కిలోల బోరాక్స్ మరియు 400 గ్రాముల సోడియం మాలిప్డేట్ వేయాలి. పంటపైన బోరాన్ లోప సవరణకు 0.1 శాతం బోరిక్ ఆమ్లం (1గ్రా. 1 లీటరు నీటికి) పంట వేసిన 30 మరియు 45 రోజుల తర్వాత రెండు సార్లు పిచికారీ చేయాలి.
  • 7. ప్రత్తిలో మెగ్నీషియం లోపి సాధారణంగా కనబడుతుంది. మెగ్నీషియం లోప సవరణకు లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ పైరు వేసిన 45 మరియు 90 రోజుల తర్వాత మూడుసార్లు పిచికారీ చేయాలి.అందుబాటున బట్టి సాధ్యమయినంత వరకు సేంద్రీయ ఎరువులు వాడినట్లయితే, సూక్ష్మపోషకాల లోపాలు పంటలపైన రాకుండా చూసుకోవచ్చు.
  • 8. మాలిబ్దినం లోపం ఆమ్లనేలల్లో 49% వరకు ఉందని గమనించబడింది. ఈ లోపాన్ని నివారించడానికి ఎకరానికి 400 గ్రాముల సోడియం మాలిప్డేట్ ను మట్టితో కలిపి వేయాలి. కాలీఫ్లవర్ లోని మాలిబ్డినం లోపాన్ని కూడా ఇలాగే నివారించుకోవచ్చు.
Scroll to Top