00:00
- 1. 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా చిరుధాన్యాలలో మార్కెట్ అవకాశాలు, సాగు విస్తీర్ణము మరియు దిగుబడిని పెంచడానికి దోహదపడే అంశాల గురించి అవగాహన చాలా అవసరం. నేటి వాతావరణ మార్పులు, తగ్గుతున్న వ్యవసాయ భూమి, జనాభా పెరుగుదల, ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రస్తుతం ఉన్న ఆహార పంటల సరళిని మార్చి పోషకాహార భద్రతను సాధించాల్సిన అవసరం ఉంది. దీనికి మనం వాతావరణ మార్పులను తట్టుకునే అధిక పోషక విలువలు కలిగినటువంటి చిరుధాన్యాలను[...]
- 2. చిరుధాన్యాల వాణిజ్యం పెరగాలని మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాసెసింగ్ యూనిట్సున్న ఏర్పరచడానికి రైతు ఉత్పత్తి సంస్థలకు సహాయం చేస్తున్నారు. చిరుధాన్యాలను ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేయడం ద్వారా అధిక సహాయం పొందవచ్చు. చిరుధాన్యలను రెండు విధాలుగా ప్రాసెసింగ్ చేయవచ్చు. చిరుధాన్యాలను ప్రైమరీ ప్రాసెసింగ్ ద్వారా ధాన్యం పొట్టును తొలగించి బియ్యంగా తయారు చేస్తారు. ఈ బియ్యాన్ని నేరుగా లేదా పిండిగా మార్చి వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో వాడుతారు.
- 3. చిరుధాన్యాలను మనం మూడు రకాల యంత్రాల ద్వారా ప్రాసెసింగ్ చేసుకోవాలి. మొదటి యంత్రం ప్రీ క్లీనర్, దీని ద్వారా చె, రాళ్ళు, ఇసుక వంటి పదార్థాలను ధాన్యం నుండి వేరు చేస్తుంది. రెండవ యంత్రం డీ హల్లర్, దీని ద్వారా ధాన్యం పొట్టును తొలగించి బియ్యం తయారవుతుంది. మూడవ యంత్రం గ్రేడర్, దీని ద్వారా పెద్ద గింజలు వేరు చేయబడతాయి. పగిలిన గింజలు, నూకలను వేరు చేస్తారు. చిరుధాన్యాలను నానబెట్టడం, మొలకెత్తించి మాల్ట్ తయారు చేయడం[...]
- 4. చిరుధాన్యాలను సెకండరీ ప్రాసెసింగ్ యంత్రాల ద్వారా నూడిల్స్ వర్మిసెల్లి, పాస్తా, సూప్ మిక్స్, కేక్, బేకరీ కుకీస్, బిస్కెట్స్ లాంటి ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో అమ్మవచ్చును. మహిళలు, రైతులు లేదా స్వయం సహాయక మహిళ బృందాలు సంఘంగా ఏర్పడి చిరుధాన్యాలతో వివిధ ఆహార పదార్థాలను తయారు చేసి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించి ఆదాయం పెంచుకోవచ్చు.
- 5. చిరుధాన్యాలలో బియ్యం, గోధుమల కన్నా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉంటాయి. కావున చిరుధాన్యాలను పోషకాహార ధాన్యాలుగా చెప్పుకుంటాం. తక్కువ క్రొవ్వును కలిగి ఉంటాయి. రక్తంలో చెక్కరశాతాన్ని నియంత్రిస్తాయి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉన్న ధాన్యాలు, గ్లూటిన్ అనే పదార్థం లేదా ఆహార ధాన్యాల పై చేసిన వివిధ పరిశోధనలలో చిరుధాన్యాలను తరుచుగా తినడం ద్వారా క్యాన్సర్, చెక్కర వ్యాధి, గుండె[...]
- 6. చిరుధాన్యల సాగు ఆవశ్యకత మరియు విస్తీర్ణం పెంచడం గురించి తెలుసుకుందాం. * తక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగు చేయగల చిరుధాన్యాలైన జొన్న, సజ్జ, రాగి, కొర్ర పంటలు అవకాశం ఉంటుంది. * చిరుధాన్యాలను ప్రధాన పంటలైన వేరుశనగ, చెరకు, కంది వంటి పంటలలో అంతర పంటలుగా సాగు చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చు.
- 7. చిరుధాన్యల సాగు ఆవశ్యకత మరియు విస్తీర్ణం పెంచడం గురించి తెలుసుకుందాం. * సరైన కాలంలో వర్షపాతం లేనప్పుడు లేదా ఆలస్యంగా వర్షపాతం ఉన్నప్పుడు ప్రధాన పంటలను సాగు చేయలేని పరిస్థితుల్లో చిరుధాన్యాల పంటలైన సజ్జ, రాగి, కొర్ర, సామ, ఆరిక వంటి పంటలను ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేసి ఇంటికి అవసరమయ్యే ధాన్యాన్ని, పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. * రబీ లేదా వేసవిలో నీటి వసతి తక్కువగా ఉన్నప్పుడు 3-4 నీటి తడులతోనే చిరుధాన్య పంటలైన[...]
- 8. చిరుధాన్యాలలో అధిక దిగుబడిని పెంచడానికి దోహదపడే అంశాలు తెలుసుకుందాము. విత్తనాలు చిన్నవిగా ఉంటాయి కావున విత్తేటప్పుడు పొలంను బాగా దున్ని నేలను మెత్తగా చేసిన తరువాత తక్కువ లోతులో విత్తినట్లైతే మొలక శాతం బాగుంటుంది.చిరుధాన్యాల పంటల దిగుబడి ప్రధాన పంటలతో పోల్చినపుడు తక్కువగా ఉంటుంది. కావున దిగుబడిని పెంచడానికి సరైన యాజమాన్య పద్ధతులను సకాలంలో పాటించినట్లయితే దిగుబడులు పెరుగుతాయి.
- 9. చిరుధాన్యాల పంటలను సాగు చేసేటప్పుడు, అధిక దిగుబడినిచ్చు రకాల ఎంపిక, (జొన్న రకాలు ఎన్.టి.జె 4, ఎన్.టి.జె. 5, ఎన్ 15, సజ్జ రకాలు ఎ.బి.వి. 04, ఐ.సి.టి.పి 8203, రాగి రకాలు వకుళ, తిరుమల, ఇంద్రావతి, గోస్థని, వేగావతి, కొర్ర రకాలు రేనాడు, మహానంది, యస్.ఐ.ఎ. 3156, సూర్యనంది) మరియు నాణ్యమైన విత్తనం చాలా ముఖ్యం. చిరుధాన్యాల పంటలలో సరైన మొక్కల సాంద్రత పొలంలో ఉంచడం వలన సరైన దిగుబడులను పొందవచ్చును. నీటివసతి ఉన్నప్పుడు[...]
- 10. పంట తొలి దశలలో కలుపు మొక్కలను నివారించుకోవాలి. కలుపు మొక్కల నివారణకు లోతు దుక్కులు చేయడం మరియు సకాలంలో కలుపు యాజమాన్యం చేసినట్లైయితే పంట ఏపుగా పెరిగి చీడపీడలు ఆశించకుండా ఉంటాయి. విత్తనాన్ని విత్తేటప్పుడు వరుసలలో విత్తుకుంటే అంతర సేద్యం చేయడానికి మరియు కలుపును యంత్రాల సహాయంతో నివారించడానికి సులువుగా ఉంటుంది.
- 11. సిఫారసు చేసిన ఎరువుల యాజమాన్యం పాటించడం వలన కూడా దిగుబడులను పెంచుకోవచ్చు. జొన్న లో ఎకరానికి 70 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూర్ ఫాస్పేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్లను వేయాలి. సజ్జలో ఎకరానికి 52 కిలోల యూరియా, 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషన్ను వేయాలి. రాగిలో ఎకరానికి 52 కిలోల యూరియాను, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు[...]
- 12. ఈ రోజు చిరుధాన్యాల్లో ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం.భాస్వరం, పొటాషియం అందించే ఎరువులను మొత్తం విత్తేటపుడు వేసుకోవాలి. నత్రజని అందించే ఎరువును రెండు సమ భాగాలుగా చేసుకొని సగభాగం విత్తేటప్పుడు, మిగిలిన సగ భాగం పైరు మోకాలు ఎత్తు దశలో ఉన్నపుడు వేయాలి.
- 13. రైతులు ప్రాంతీయ మార్కెటింగ్ అవకాశాలు చూసుకొని సరైన చిరుధాన్యాల పంటలను ఎంపిక చేసు కొని సాగు చేయాలి. ప్రతి రైతు ఇంటి అవసరాల కోసం కొంత మేర విస్తీర్ణంలోనైనా సాగు చేసుకొని ఆహారం లో ప్రతిరోజు ఒక భాగంగా చిరుధాన్యాలను చేర్చుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది.