00:00
- 1. మన దేశంలో ప్రధానమైన వాణిజ్య పంటలలో ప్రత్తి ముఖ్యమైంది. గత 2, 3 సంవత్సరాలుగా ప్రత్తి పంట యొక్క దిగుబడి మరియు విస్తీర్ణం తగ్గుతూ వస్తుంది. దీనికి ప్రధానమైన కారణాలు: గులాబి రంగు ఉధృతి సరియైన మద్దతు ధర లేకపోవడం ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన నాణ్యమైన ప్రత్తి తీయలేకపోవడం తీతలకు ఎక్కువ కూలీల ఖర్చు మరియు కూలీల కొరత
- 2. పంట తీసిన తర్వాత చేపట్టవలసిన పద్ధతులు ప్రత్తి పంట పూర్తైన వెంటనే విరామ సమయాన్ని ఖచ్ఛితంగా పాటించాలి నీటి వసతి ఉన్నప్పటికీ ప్రత్తిని ఆరు నెలలకు మించి పొడిగించకుండా తీసివేయాలి ప్రతి తీతల తర్వాత చేనులో గొర్రెలు, మేకలు మరియు పశువులను మేపాలి ప్రతి మోళ్ళను ట్రాక్టరు రోటావేటరుతో భూమిలో కలియదున్నాలి
- 3. పంట తీసిన తర్వాత చేపట్టవలసిన పద్ధతులు నీటి వసతి ఉన్న చోట రెండో పంటగా ఇతర ఆరుతడి పంటల్ని సాగు చేసుకోవాలి ప్రత్తి తీసిన తరువాత ఎండిన మోళ్ళను, విచ్చుకోని కాయలను భూమిలో కలియదున్నుట ద్వారా పురుగు కోశస్థ దశలను నాశనం చేయవచ్చును గులాబి రంగు పురుగు ఆశించిన ప్రత్తిని, రైతుల ఇళ్ళ వద్ద గాని లేదా జిన్నింగ్ మిల్లుల వద్ద గాని నిల్వ ఉంచకూడదు. ప్రత్తి మిల్లులో జిన్నింగ్ అయిన తర్వాత వచ్చే గుడ్డి[...]
- 4. రోటవేటర్ / మల్చర్ ఉపయోగించి పంట అవశేషాలను నేలలో కలపటం:ప్రత్తి తీతలు తర్వాత ట్రాక్టరు - రోటవేటరు లేదా మల్చర్ కానీ లేదా ష్రెడ్జర్ నడిపి పంట అవశేషాలను, ప్రత్తి మోళ్ళను నేలలో కలియదున్నాలి. ఈ విధంగా చేయడం వలన నేలకు సేంద్రీయ పదార్థం అందజేయటమే కాక, గులాబి రంగు పురుగు యొక్క కోశస్థ దశలను కూడా నాశనం చేయవచ్చు.
- 5. లోతు దుక్కులు వేసవిలో లోతు దుక్కులు 2-3 సార్లు చేయాలి నాగలితో నేల తిరగబడే లాగ లోతు దుక్కులు చేసినట్లయితే వివిధ పురుగుల కోశస్థ దశలు / గుడ్లు / ముఖ్యంగా కలుపు మొక్కల యొక్క భూగర్భ భాగాలు ఎండకు ఎండి, పంట కాలంలో కలుపు సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నేల యొక్క లోపలి పొరలు కదిలించబడి, నీరు లోపలి పొరలకు ఇంకటంలో సహాయ పడుతుంది.
- 6. పచ్చిరొట్ట ఎరువులు: వేసవి జల్లులు పడినప్పుడు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర మొదలగు పంటలను విత్తుకోవాలి ఈ పైర్లు యొక్క కాండం, పెన్సిల్ మందం వచ్చినప్పుడు లేదా 50% పూత దశలో ఉన్నప్పుడు నేలలో కలియ దున్నాలి, లేనిచో నార శాతం పెరిగిపోయి నేలలో క్రుళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీని వలన ప్రధాన పంట విత్తుకోవటం ఆలస్యం అవుతుంది. సూపర్ ఫాస్ఫేట్ గాని ఆంగ్రూ డికంపోజర్ గాని చల్లినట్లయితే త్వరగా కుళ్ళింపచేస్తాయి.
- 7. పచ్చిరొట్ట ఎరువులు: సమస్యాత్మక భూములైన చైడు నేలల్లో జీలుగను వేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఈ పైర్లు వేయటం వలన ఎకరానికి 25 కిలోల నత్రజని, ఎరువు నేలకు అందజేయబడుతుంది. పచ్చిరొట్ట ఎరువుల పంటలు - జనుము, పిల్లి పెసర, బొబ్బర్లు, జీలుగ పచ్చి ఆకు ఎరువుల పంటలు - వేప, కానుగ, జిల్లేడు, గ్లైరిసిడియా
- 8. నేల పరీక్ష పంట వేసే ముందు నేల యొక్క పరీక్ష చేయించడం ఎంతో ముఖ్యం నేలలో ఉన్న పోషకాలను బట్టి పైరుకు వేయవలసిన నత్రజని, భాస్వరం మరియు పొటాష్ ఎరువుల మోతాదు ఆధారపడి ఉంటుంది. సమస్యాత్మక భూములయినట్లయితే, తగు యాజమాన్య చర్యలు పాటించాలి నేలలో సేంద్రీయ కర్బనంను పెంచేందుకు పశువుల ఎరువును లేదా ఏదైనా కంపోస్టు ఎరువును (4-5 టన్నులు / ఎకరం) ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
- 9. ప్రధాన పంటకు నేల తయారీ: ప్రత్తి పంటకు నల్లరేగడి నేలలు, ఒండ్రు నేలలు మరియు నీటి సదుపాయము గల ఎర్ర నేలలు అనుకూలమైనవి. చౌడు భూములు మినహాయించి, అన్ని రకాల భూములలో ఈ పంట వేసుకోవచ్చు ఇసుక భూములలోనూ, ఒక అడుగు లోతు తక్కువగా ఉన్న భూములలో ప్రత్తి సాగు చేయరాదు. ప్రత్తి బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది. కాని అధిక తేమను అసలు తట్టుకోలేదు. నీరు ఎక్కువగా నిలువ ఉండే భూములలో ప్రత్తి సాగు చేయరాదు.[...]